E-Paper
Advertisement

Actor Sai Kiran: కొడుకు పేరును రివీల్ చేసిన నటుడు సాయి కిరణ్… బాలీవుడ్ హీరో పేరు పెట్టారుగా?

Actor Sai Kiran: కొడుకు పేరును రివీల్ చేసిన నటుడు సాయి కిరణ్… బాలీవుడ్ హీరో పేరు పెట్టారుగా?
Advertisement

Actor Sai Kiran: తెలుగు సినీ ఇండస్ట్రీలో వెండితెర నటుడిగా, హీరోగా కొనసాగుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న వారిలో సీనియర్ నటుడు సాయికిరణ్(Sai Kiran) ఒకరు. హీరోగా పలు సినిమాలలో వెండితెరపై నటించి సందడి చేశారు. ప్రస్తుతం ఈయన వెండితెర సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ ఎంతోమంది బుల్లితెర అభిమానులను సొంతం చేసుకున్నారు. కోయిలమ్మ అనే సీరియల్ ద్వారా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఈయన అనంతరం స్టార్ మా లో ప్రసారమైన గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా మహేంద్ర పాత్రలో మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

స్రవంతి సాయికిరణ్ కొడుకు నామకరణం..

ఇలా పలు సీరియల్స్ లో నటిస్తూ బుల్లితెర నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సాయి కిరణ్ కోయిలమ్మ సీరియల్ నటి స్రవంతి (Sravanthi)తో కలిసి ఏడడుగులు నడిచిన సంగతి తెలిసిందే. నాలుగు పదుల వయసులో సాయికిరణ్ నటి స్రవంతిని రెండవ వివాహం చేసుకున్నారు. వీరి వివాహం కూడా చాలా ఘనంగా జరిగింది. పెళ్లయిన వెంటనే మహేంద్ర స్రవంతి దంపతులు మరొక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతున్నట్టు తెలియజేశారు. ఇకపోతే ఈ జంట గత ఏడాది పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

రణవీర్ రామ్..

Advertisement

తమ కొడుకుకు సంబంధించిన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నప్పటికీ తమ కొడుకు ఎలా ఉంటాడు మాత్రం ఫేస్ రివిల్ చేయలేదు. ఇక ప్రస్తుతం తన కుమారుడికి ఐదు నెలల వయసు అని తెలుస్తోంది. ఉగాది పండుగ సందర్భంగా ఈ జంట తమ కొడుకుకు నామకరణ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తమ కొడుకు పేరును కూడా బయటపెట్టారు . ఈ జంట తమ కొడుకుకు “రణవీర్ రామ్”(Ranaveer Ram) అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ విధంగా తమ కొడుకు పేరును రివీల్ చేసిన ఈ జంట కొడుకు ఫేసును మాత్రం రివిల్ చేయలేదు.

Advertisement

ఇక తమ కొడుకుకు రణవీర్ రామ్ అని పేరు పెట్టడంతో చాలామంది పేరు బాగుంది అంటూ కామెంట్లు చేయగా మరి కొంతమంది అదేంటి బాలీవుడ్ హీరో పేరు పెట్టారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం వీరు షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సాయి కిరణ్ స్రవంతి కోయిలమ్మ, పడమటి సంధ్యారాగం, గుప్పెడంత మనసు, భానుమతి వంటి సీరియల్స్ ద్వారా నటీనటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక సాయికిరణ్ సినిమాల విషయానికి వస్తే నువ్వే కావాలి సినిమాతో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన ఆ తర్వాత ప్రేమించు, మాసుధ, ఉత్సాహం వంటి తదితర సినిమాలలో నటించారు అయితే ఈయనకు నువ్వే కావాలి సినిమా మాత్రం మంచి సక్సెస్ ను తీసుకోవచ్చిందని చెప్పాలి.

Also Read: Vijay Rashmika Fan: ఫైనల్లీ విజయ్ రష్మికను కలిసిన బుల్లి అభిమాని… వైరల్ అవుతున్న క్యూట్ వీడియో!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×