E-Paper
Advertisement

Tollywood: అధ్యాయం ముగిసింది.. విడాకులు ప్రకటించిన ప్రముఖ జంట!

Tollywood: అధ్యాయం ముగిసింది.. విడాకులు ప్రకటించిన ప్రముఖ జంట!
Advertisement

Tollywood:బుల్లితెర ప్రేక్షకులకు షాక్ ఇస్తూ నటి అనూష హెగ్డే తన వైవాహిక బంధంపై చేసిన ప్రకటన ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. బుల్లితెర పాపులర్ జంట అనూష హెగ్డే – ప్రతాప్ సింగ్ విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న వార్తలకు ఎట్టకేలకు తెరపడింది. తమ మధ్య విభేదాలు ఉన్నాయా లేదా అనే అనుమానాలకు అనూష ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చింది. “మేమిద్దరం చట్టపరంగా విడిపోయాం” అంటూ ఆమె చేసిన ప్రకటన అభిమానులను కలిచివేస్తోంది. 2023 నుంచే వీరిద్దరి మధ్య దూరం పెరగగా, 2025లో అధికారికంగా విడాకులు తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేసింది. అయితే ఈ విషయంపై ఎటువంటి చర్చలు లేదా విమర్శలు చేయవద్దని, కేవలం తన నిర్ణయాన్ని గౌరవించాలని ఆమె కోరింది. పరస్పర అంగీకారంతోనే ఈ బంధానికి ముగింపు పలికినట్లు తెలుస్తోంది.

‘నిన్నే పెళ్లాడతా’ నుంచి విడాకుల వరకు:

అనూష హెగ్డే, ప్రతాప్ సింగ్‌ల పరిచయం ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్ సెట్ లో మొదలైంది. కలిసి నటిస్తున్న సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లి 2020 ఫిబ్రవరిలో ఘనంగా వివాహం చేసుకున్నారు. మొదట్లో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంటను చూసి అందరూ ముచ్చటపడ్డారు. కానీ, కాలక్రమేణా వచ్చిన మనస్పర్థలు వీరిని విడదీశాయి. ప్రస్తుతం తన పూర్తి దృష్టిని కెరీర్, కుటుంబం, మానసిక ప్రశాంతత పైనే పెట్టినట్లు అనూష వెల్లడించింది. ఒక అందమైన ప్రేమకథ ఇలా విడాకులతో ముగియడం ఆమె అభిమానులను కాస్త నిరాశకు గురిచేసింది.

Advertisement

ALSO READ:Nara Rohit – Sirisha lella: నారా రోహిత్ వెడ్డింగ్ వీడియో వైరల్.. నవ్వులు.. కోలాహాల నడుమ ఒక్కటైన జంట

కెరీర్ పరంగా బిజీగా ఉన్న నటీనటులు:

నటుడు ప్రతాప్ సింగ్ తెలుగు బుల్లితెరపై సుపరిచితుడు. స్టార్ మా టీవీ లో ‘శశిరేఖ పరిణయం’తో అందరికి పరిచయం అయిన ప్రతాప్ ఆ తరువాత ‘కుంకుమ పువ్వు’, ‘తేనె మనసులు’ వంటి సీరియల్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ‘ముద్దపప్పు ఆవకాయ’ వెబ్ సిరీస్‌లో నిహారిక కొణిదెలకు జోడీగా నటించి మెప్పించాడు. ఆ తరువాత కొన్ని వెబ్ సిరీస్ లలో నటించారు. ఇక అనూష హెగ్డే ‘సూర్యకాంతం’ వంటి సీరియల్స్‌లో నటించినప్పటికీ, తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో కన్నడ పరిశ్రమ వైపు మొగ్గు చూపింది. 2022లో, ఆమె తమిళ టెలివిజన్ లో అడుగు వేసి ఆనంద రాగంలో ఐపిఎస్ ఈశ్వరి పాత్రను పోషించింది. జూన్ 2025 నుండి, ఆమె ఆనంద రాగంలో ఈశ్వరి పాత్ర లాగ చూడటానికి ఒకేలా కనిపించే తులసి పాత్రను పోషిస్తోంది. ఇక ప్రస్తుతం ఆమె కన్నడ బుల్లితెరపై వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు ఎదురైనా, వృత్తిపరంగా ఇద్దరూ రాణిస్తుండటం విశేషం.

Advertisement

జీవితంలో కొన్నిసార్లు మనం ఊహించని మలుపులు ఎదురవుతుంటాయి. బంధం ముగిసినా, కొత్త ఆశలతో ముందుకు సాగడం ముఖ్యం. అనూష, ప్రతాప్ ఇద్దరూ తమ తమ వ్యక్తిగత జీవితాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

 

View this post on Instagram

 

Tags

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×