E-Paper
Advertisement

Jabardasth Actor: రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ నటుడు మృతి.. అసలేం జరిగిందంటే?

Jabardasth Actor: రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ నటుడు మృతి.. అసలేం జరిగిందంటే?
Advertisement

Jabardasth Actor:ఈ మధ్యకాలంలో వరుస యాక్సిడెంట్లు అటు ప్రజలను ఇటు సెలబ్రిటీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఎంత జాగ్రత్తగా ప్రయాణం చేసినా అటు నుంచి వచ్చే ప్రమాదాలు పసిగట్టలేనివి. తద్వారా ఏకంగా ప్రాణాలు కూడా కోల్పోతూ అటు కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా జబర్దస్త్ (Jabardasth )ద్వారా కమెడియన్ తనకంటూ ఒక భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఒక కమెడియన్ ఈరోజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. మరి ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం..

రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు మృతి..

విషయంలోకి వెళ్తే.. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల ద్వారా నటుడిగా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్న లక్ష్మీనారాయణ అలియాస్ బాబి (Bobby)తో పాటు మరో ఇద్దరు యువకులు ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. పోలీసులు తెలిపిన వివరాల విషయానికి వస్తే.. రాజమండ్రి – కొవ్వూరు రోడ్డు కం రైల్వే బ్రిడ్జిపై చోటు చేసుకున్న ఈ ఘోర ప్రమాదం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఒక్కసారిగా విషాదాన్ని నింపింది. విషయం తెలిసి అటు స్థానికులు , అభిమానులు ఇటు సినీ సెలబ్రిటీలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం..

Advertisement

ఇక పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం.. ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలిపే ఈ బ్రిడ్జిపై రెండు బైకులు వేగంగా ఢీకొన్నాట. అయితే ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు వ్యక్తులు చిక్కుకోగా.. వారిలో ముగ్గురు హెల్మెట్ ధరించకపోవడంతో తలకు తీవ్ర గాయాలు అయ్యి మృతిచెందగా.. కోమరి ఏడుకొండలు అనే వ్యక్తి హెల్మెట్ ధరించి ఉండటంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు ఈ ప్రమాదంలో పోతుగంటి అక్షయ్ కుమార్ , తగరపు సత్యకుమార్ సునీల్ అనే ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు.. చిన్ననాటి స్నేహితులు అయిన వీరిద్దరూ ఒకేసారి మృతి చెందడంతో అటు కుటుంబ సభ్యులు , ఇటు పరిచయస్థులు కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే అటు జబర్దస్త్ నటుడు బాబీ కూడా ఇదే ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడి ఆయన మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. ఇక ఈ విషయం తెలిసి జబర్దస్త్ నటీనటులు కన్నీటి పర్యంతమౌతూ బాబీ మృతికి సంతాపం తెలుపుతూ.. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.

ALSO READ:Payal Raj Puth: 12 ఏళ్ల కష్టం.. అంత ఈజీగా వదిలేస్తానా.. ట్రోల్స్ కి పాయల్ చెక్!

బాబీ బ్యాక్ గ్రౌండ్..

Advertisement

ఇక బాబీ విషయానికి వస్తే.. బాబి రాజ మహేంద్రవరానికి చెందినవారు. గతంలో మాజీ ఎంపీ హర్ష కుమార్ వద్ద డ్రైవర్గా పనిచేశారు .ఆ తర్వాత కామెడీ షోల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఈయన శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ వంటి షోలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. అలాంటి ఈయన ఇప్పుడు అకాల మరణం పొందడంతో అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇకపోతే అంత్యక్రియలకు ప్రముఖ యాంకర్ సుమతో పాటు పలువురు సినీ, టీవీ కళాకారులు హాజరై ఆయన మృతికి నివాళులు అర్పించారు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×