E-Paper
Advertisement

కేసీఆర్ ఒప్పుకుంటే రేపే అసెంబ్లీ.. దమ్ముంటే డేట్ ఫిక్స్ చేయండి- సీఎం రేవంత్

కేసీఆర్ ఒప్పుకుంటే రేపే అసెంబ్లీ.. దమ్ముంటే డేట్ ఫిక్స్ చేయండి- సీఎం రేవంత్
Advertisement

Kaleshwaram Project: తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, నిధుల దుర్వినియోగంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాభవన్ వేదికగా బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రాజెక్టు దెబ్బతినడానికి గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు, అవినీతి స్వార్థమే కారణమని మండిపడుతూ, దీనిపై అసెంబ్లీలో సమగ్ర చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు.

ప్రాణహిత నుంచి కాళేశ్వరం దాకా.. అంచనాల పెంపు

Advertisement

వైఎస్సార్ హయాంలో 16.40 లక్షల ఎకరాలకు నీరందించే లక్ష్యంతో తక్కువ అంచనా వ్యయంతో (రూ. 39 వేలు) ప్రారంభమైన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టును, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పూర్తిగా రీడిజైన్ పేరుతో మార్చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. నిపుణుల కమిటీ మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్దని వారించినా, కేసీఆర్ తన సొంత లాభం కోసం ఆ నివేదికను పక్కనబెట్టి ‘వ్యాప్కోస్’ సంస్థతో అనుకూల నివేదిక తెప్పించుకున్నారని ఆరోపించారు. కేవలం కమిషన్ల కోసమే ప్రాజెక్టు అంచనాలను రూ. 81 వేల కోట్లకు పెంచారని, కానీ నీళ్లు కానీ, ఆయకట్టు కానీ పెరగలేదని ఎండగట్టారు.

Also Read: సిటీలో కోచింగ్ సెంటర్ల గుట్టురట్టు.. బిగ్ టీవీ ఆపరేషన్‌లో షాకింగ్ నిజాలు!

Advertisement

పునాది లేని నిర్మాణాలు – కుప్పకూలిన బ్యారేజీలు

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో ఎలాంటి భూ పరీక్షలు చేయకుండా, ఇసుక పునాదులపై నిర్మించడం వల్లే ఈరోజు అవి కుప్పకూలే స్థితికి వచ్చాయని సీఎం ధ్వజమెత్తారు. ‘నా మెదడు రంగరించి కట్టాను’ అని చెప్పుకున్న కేసీఆర్ నిర్వాకం వల్లే.. ప్రారంభమైన ఏడాదిలోనే మేడిగడ్డ దెబ్బతిన్నదని, నాణ్యతా లోపాలు, సరైన నిర్వహణ లేకపోవడమే దీనికి కారణమని ఎన్డీఎస్ఏ (NDSA) నివేదిక కూడా స్పష్టం చేసిందని గుర్తుచేశారు. కన్నెపల్లి పంప్‌హౌస్ మునిగిపోవడం వెనుక అధికారుల నిర్లక్ష్యంతో పాటు నాణ్యత లేకపోవడమే ప్రధాన కారణమన్నారు.

ఆర్థిక ఉగ్రవాదులు.. అసెంబ్లీ సవాల్

తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రానికి రూ. 8.21 లక్షల కోట్ల అప్పులు మిగిల్చి, కాళేశ్వరం పేరుతో రూ. లక్ష కోట్లకు పైగా ప్రజాధనాన్ని బూడిదలో పోసిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను రేవంత్ రెడ్డి ‘ఆర్థిక ఉగ్రవాదులు’గా అభివర్ణించారు. కాళేశ్వరంపై చర్చకు రాకుండా మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లను పంపిస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కోరుకుంటే అసెంబ్లీ ప్రత్యేక ఉమ్మడి సమావేశం (జాయింట్ సెషన్) ఏర్పాటు చేయడానికి సిద్ధమని, స్పీకర్‌కు లేఖ రాసి తేదీ ఖరారు చేయాలని సవాల్ విసిరారు. వారు చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదని, తప్పులను నిరూపిస్తే మూడేళ్ల పాటు ప్రాజెక్టు రిపేర్ల బాధ్యతను వారికే అప్పగిస్తామని సీఎం స్పష్టం చేశారు.

Also Read: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కాం.. నీరవ్ మోడీ లండన్ జైలు టు ఇండియా.. పూర్తి వివరాలు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×