E-Paper
Advertisement

తిట్ట‌పోరా కేసీఆర్‌..! కాళేశ్వ‌రం క‌ట్ట‌పోరా కేసీఆర్‌..! చ‌ర్చ‌కు వ‌స్త‌వారా కేసీఆర్‌..! నీ మ‌ర్యాద‌ను కాపాడుతాం.. ఒట్టు!

తిట్ట‌పోరా కేసీఆర్‌..! కాళేశ్వ‌రం క‌ట్ట‌పోరా కేసీఆర్‌..! చ‌ర్చ‌కు వ‌స్త‌వారా కేసీఆర్‌..! నీ మ‌ర్యాద‌ను కాపాడుతాం.. ఒట్టు!
Advertisement

తిట్టినంతా తిట్టాడు. కాళేశ్వ‌రం ఉత్త అవినీతి కూప‌మ‌ని నేరుగా చెప్పేశాడు. కేసీఆర్ కుటుంబం వేల కోట్లు సంపాదించుకునేందుకే దీన్ని హ‌డావుడిగా క‌ట్టేశాడ‌ని తీర్మానించేశాడు. క‌నీస అవ‌గాహ‌న లేకుండా.. అది కూలుతుంద‌ని తెలిసినా.. అన్నీ తానై.. అంతా అవినీతిమ‌యం చేసి ల‌క్ష‌ల కోట్లు కొల్ల‌గొట్టేశాడ‌ని తేల్చేశాడు.

దీనిపై చ‌ర్చ‌కు సిద్ద‌మ‌న్నాడు. ప్రత్యేకంగా అసెంబ్లీ సెష‌న్స్ పెట్టిస్తాన‌న్నాడు. మ‌ర్యాద కాపాడుతాం.. ఒట్టు.. నిన్ను ఏమీ అన‌ము.. వ‌చ్చి దీనిపై నీ వివ‌ర‌ణ ఏమిటో చెప్పు.. ప‌రిష్కార మార్గం సూచించు.. ఆలోచిద్దామ‌ని.. తొడ‌పాశం పెట్టి వ‌దిలేశాడు. చివ‌ర‌కు ఆయింట్‌మెంట్ మాట‌లతో ముగించాడు. ఇదీ కేటీఆర్ తీసుకొచ్చిన వారం రోజుల సీఎం ప్ర‌తిపాద‌న‌కు సీఎం రేవంత్ నుంచి వ‌చ్చిన ప్ర‌తిస్పంద‌న‌.

Advertisement

క‌న్నెప‌ల్లి పంప్‌హౌజ్ వ‌ద్ద మోటార్లు చాలు చేయండ‌ని అన్నందుకు ఇదీ… రేవంత్ త‌వ్విన కాళేశ్వ‌రం అవినీతి క‌హాని!

దాదాపు గంటసేపు వాయించి వ‌దిలిపెట్టాడు రేవంత్‌. అంతా చెప్పిన క‌థ‌నే. మ‌ళ్లీ పొల్లుపోకుండా.. ఒక్క అక్ష‌రం అటూ ఇటూ కాకుండా.. అవినీతికి చెందిన ఒక్క‌పైసా అటూ ఇటూ కాకుండా… ఇది ఎటూ ప‌నికిరాని బ్యారేజుగా డిక్లేర్ చేసేందుకు అన్ని దారులు మూసుకుపోయాయ‌ని చెప్పి ఒప్పించే క్ర‌మంలో అదే ప్ర‌యాస‌, అదే త‌ప‌న‌.. ! మ‌ళ్లీ అంతా రిపీట్ చేశాడు.

Advertisement

ఎలా బాగు చేద్దామ‌ని మాకూ ఉంది ఆలోచ‌న అని అంటాడు. కానీ అది సాధ్యం కాద‌ని ఆ వెంట‌నే తేల్చేస్తాడు. దీని వ‌ల్ల ఎలాంటి ఉప‌యోగం లేద‌నే చెబుతాడు. కానీ కేసీఆర్‌ను చ‌ర్చ‌ల‌కు అసెంబ్లీకి ఆహ్వానిస్తాడు. తుమ్మిడిహ‌ట్టి వ‌ద్ద నుంచి మార్చిందే దీని వ‌ల్ల వేల కోట్లు దోచుకునేందుకు అని డిక్లేర్ చేస్తాడు. అందుకే వంద‌ల ఎక‌రాల్లో ఫామ్‌హౌజ్ లు నిర్మించుకున్నార‌ని చెబుతాడు.

తుమ్మిహ‌ట్టి వ‌ద్ద బ్యారేజీ నిర్మిస్తారా లేదా చెప్పడు. ఇప్పుడు ఈ కాళేశ్వ‌రం రిపేరు చేయించి… ప‌ని జ‌రిగేలా చూస్తామ‌ని కూడా హామీ ఇవ్వ‌డు. మొత్తంగా దీని వ‌ల్ల అయిన అప్పుల లెక్క‌లు మ‌ళ్లీ చెప్పాడు. అప్పులు మిత్తీల తిప్ప‌లు.. చిప్ప ప‌ట్టుకుని దివాళా దీసిన రాష్ట్ర ఆర్థిక స్థితిని, దుస్థితి గురించీ వివ‌రించాడు.

అయినా మేం ఏం త‌క్కువ చేశామ‌ని జ‌నాల‌ను అడిగాడు. ఇన్ని ప‌థ‌కాలు అందిస్తుంటే ప్ర‌చారం చేసుకోరేం అని నాయ‌కుల‌పై నోరు చేసుకున్నాడు. ఒక్క కాళేశ్వ‌రం ఆగినందుకు.. అవినీతి ప‌థ‌కాలు ఆపినందుకు.. మిగిలిన ప‌థ‌కాల‌న్నీ అమ‌లు చేయ‌గ‌లుగుతున్నామ‌ని తమ ప్ర‌భుత్వ సీక్రెట్ చెప్పాడు.

కాళేశ్వ‌రం కేసీఆర్ మాన‌స‌పుత్రిక కాబ‌ట్టి.. అత‌ని మైండ్‌ను క‌రిగించి ఆయ‌నే ద‌గ్గ‌రుండి క‌ట్టాడు కాబ‌ట్టే ఈ దుస్థితి వ‌చ్చింది కాబ‌ట్టి.. అది మ‌ళ్లీ ఇక ప్రాణం పోసుకోదు కాబ‌ట్టి.. దీని గురించి ఇక పెద్ద‌గా ఆలోచించ‌వ‌ద్దు.. కాబ‌ట్టి అసెంబ్లీలో చ‌ర్చ‌కు వ‌స్తే బాగుంటుంది కాబ‌ట్టి… వ‌స్తే మేం పొట్టు పొట్టు తిడ‌తామ‌నే భ‌యం ఉంటుంది కాబ‌ట్టి.. తిట్ట‌మ‌ని ఒట్టు పెట్టు మ‌రీ చెబుతున్నాం కాబ‌ట్టి.. నీ మ‌ర్యాద‌ను కాపాడుకోవ‌డం మా బాధ్య‌త కాబ‌ట్టి.. ప‌దేండ్లు సీఎంగా చేసినవు కాబ‌ట్టి.. నువ్వు త‌ప్ప‌కుండా వ‌స్తే.. తిట్టంపోరా కేసీఆర్‌!

అని ముగించి ముక్తాయింపునిచ్చి ఫినిషింగ్ ట‌చ్ ఇచ్చి.. ముగింపు నివ్వ‌కుండా ఇప్ప‌టికిది స‌శేష‌మేన‌ని చెప్పాడు

ఈ గంట సేపు ముచ్చ‌ట‌లో ఒక‌టే బాగా ఆలోచింప‌జేసింది. బాగా క‌నెక్ట‌య్యింది. బాగా క‌రెక్ట‌యిన ముచ్చ‌ట కూడా. ఏమిటో తెలుసా? అప్పుడు ఉద్య‌మ స‌మ‌యం నుంచి ఉన్న ఒక్క ఉద్య‌మ‌కారుడు, మేథావి.. ఇప్పుడు ఒక్క‌డంటే ఒక్క‌డు కేసీఆర్‌కు లెఫ్టు, రైటు, వెనుకా ముందు లేడెందుకని? ఇదేమీ అంతు చిక్క‌ని, స‌మాధానం దొర‌క‌ని ప్ర‌శ్నేం కాదు. యావ‌త్ తెలంగాణ జాతికి జ‌వాబు తెలిసిన ప్ర‌శ్నే.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×