E-Paper
Advertisement

Covid: మళ్లీ లాక్ డౌన్?.. ఇండియాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. కేంద్రం హైఅలర్ట్..

Covid: మళ్లీ లాక్ డౌన్?.. ఇండియాలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. కేంద్రం హైఅలర్ట్..
Advertisement

Covid: బిగ్ బ్రేకింగ్. ఇండియాలో కరోనా కొత్త వేరియంట్ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం చైనాలో కల్లోలం రేపుతున్న ఒమిక్రాన్ BF-7 వేరియంట్ భారత్ లో అడుగు పెట్టింది. గుజరాత్, వడోదరకి చెందిన ఓ ఎన్నారై మహిళలో ఒమిక్రాన్ BF-7ను గుర్తించారు. అలానే, ఒడిశాలోనూ కొత్త వేరియంట్ కేసు నమోదైంది. దేశంలో మొత్తం ముగ్గురిలో కొత్త వేరియంట్ కనిపించింది.

కొత్త వేరియంట్ కేసులు నమోదవడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఎయిర్ పోర్టుల్లో హైఅలర్ట్ ప్రకటించింది. విదేశీ ప్రయాణీకులకు స్క్రీనింగ్ టెస్టులు చేయాలని ఆదేశించింది.

Advertisement

కరోనాపై అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే రాష్ట్రాలకు లేఖ రాసింది కేంద్రం. కీలక సమీక్ష నిర్వహించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు పెట్టుకోవడాన్ని తప్పనిసరి చేసింది. దేశంలో ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోవడానికి కేంద్రం సిద్ధంగా ఉందని ప్రకటించింది. బూస్టర్ డోస్ తీసుకోవాలని ప్రజలకు సూచించింది.

భారత్ లో అక్టోబర్ లోనే తొలి ఒమిక్రాన్ BF.7 వేరియంట్ వెలుగు చూడగా.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 3 కేసులు నమోదు అయ్యాయి. కేసుల పెరుగుదల కంట్రోల్ లోనే ఉందని ఆరోగ్యశాఖ తెలిపింది. అయినా, అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేసింది. కొత్త వేరియంట్ కు ఇన్ఫెక్షన్ కలిగించే సామర్థ్యం ఎక్కువ.
వ్యాక్సిన్ తీసుకున్న వారిపైనా ప్రభావం చూపించే సత్తా ఉంది. BF.7 వేరియంట్ కు వేగంగా వ్యాప్తి చెందే స్వభావం ఉండటంతో విదేశాల్లో పాజిటివ్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

Advertisement

చైనా, అమెరికా, యూరప్ దేశాల్లో ఒమిక్రాన్ BF-7 వేరియంట్ విరుచుకుపడుతోంది. చైనాలో లక్షల్లో పాజిటివ్ కేసులు వస్తున్నాయి. కరోనా ఆంక్షలు సడలించడంతో.. పరిస్థితి చేదాటి పోయింది. ఆసుపత్రులు, ల్యాబ్ ల ముందు భారీగా బాధితులు క్యూ కడుతున్నారు. కరోనా కట్టడిలో చైనా పాలకులు చేతులెత్తేశారని అంటున్నారు. చైనాలో ఇంతటి కల్లోలానికి కారణమైన ఒమిక్రాన్ BF-7 వేరియంట్ ఇప్పుడు ఇండియాలోనూ వెలుగుచూడటంతో అంతా ఉలిక్కిపడుతున్నారు. మళ్లీ మునుపటి ప్రమాదం పొంచుకొస్తుందేమోనని హడలిపోతున్నారు. మరోసారి లాక్ డౌన్ విధిస్తారా?

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×