E-Paper
Advertisement

Damodar Raja Narasimha: జోగిపేట మున్సిపాలిటీలో కాంగ్రేస్‌ పార్టీ జెండా ఎగరడం ఖాయం : మంత్రి దామోదర రాజనర్సింహ

Damodar Raja Narasimha: జోగిపేట మున్సిపాలిటీలో కాంగ్రేస్‌ పార్టీ జెండా ఎగరడం ఖాయం : మంత్రి దామోదర రాజనర్సింహ
Advertisement

Damodar Raja Narasimha:  రాష్ట్రంలో మెజార్టీ మున్సిపాలిటీలు కాంగ్రేస్‌ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సి.దామోదర రాజనర్సింహ(Damodar Raja Narasimha)ధీమా వ్యక్తం చేసారు. జోగిపేటలోని మార్కెట్‌ గంజ్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. జోగిపేట మున్సిపాలిటీని కాంగ్రేస్‌ దక్కించుకుంటుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమ పాలనతోనే మంచి ఫలితాలను సాధించుకుంటున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనకు ప్రజలు అనుకూలంగా ఓటు వేసారన్నారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ఈ ఫలితాలే రిపీట్‌ అవుతాయన్నారు.

జోగిపేటలో 79.40 శాతం పోలింగ్‌

జోగిపేట మున్సిపాలిటీలో 20 వార్డులు 16,450 ఓటర్లుకుగాను 13, 061 ఓట్లు పోలవగా 79.40 శాతం పోలింగ్‌ జరిగినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌ ప్రకటించారు. ఉదయం నుంచి పోలింగ్‌ మంద కోడిగా సాగిందనే చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, కాంగ్రేస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో 63 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఆయా వార్డుల్లో వృద్దులు, మహిళలను పోలింగ్‌ కేంద్రానికి చేర్చేందుకు ఆటోలు, కార్లను వినియోగించారు. కేంద్రాల వద్ద వికలాంగులకు కేంద్రంలోకి వీల్‌చైర్‌ల ద్వారా తీసుకువెళ్లారు. 12వ వార్డు పోలింగ్‌ కేంద్రాన్ని అడిషనల్‌ కలెక్టర్‌ పాండు పరిశీలించారు.

Advertisement

Also Read: Dharmapuri Arvind: తెలంగాణలో జనసేనతో పొత్తు లేదు.. పవన్ ఇంకెప్పుడు వస్తారు?, ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు

సీపీఎస్‌ కేంద్రం వద్ద సీఐ ఓవరాక్షన్‌

జోగిపేటలోని సీపీఎస్‌ (కేంద్ర ప్రాథమికోన్నత పాఠశాల) పోలింగ్‌ కేంద్రంలో విధులు నిర్వహించిన సీఐ చంద్రయ్య ఓవరాక్షన్‌ చేసారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన ఓటరును లాఠీతో చితకబాదడం, మహిళపై దౌర్జన్యంగా పోలీసులు వ్యవహరించడంతో కేంద్రం వద్ద కొద్ది సేపు ఉద్రిక్తత నెలకొంది. కేంద్రంలోకి ఓటు వేయించేందుకు వికలాంగుడిని తీసుకువెళుతున్న శివ మాల ధరించిన స్వామి కాలర్‌ పట్టుకొని బయటకు నెట్టివేయడంతో ఆ ప్రాంత శివస్వాములంతా కేంద్రం వద్దకు చేరుకొని సీఐ బయటకు రావాలని డిమాండ్‌ చేసారు. స్థానిక పోలీసులు కల్పించుకొని శివస్వాములకు నచ్చజెప్పడంతో సమస్య సద్దుమణిగింది. కేంద్రంలో పోలింగ్‌ సరళిని తెలుసుకునేందుకు వచ్చిన క్యాండెట్‌ ఏజెంట్‌ (మాజీ కౌన్సిలర్‌)ను బయటకు నెట్టి వేసేవేసేందుకు ప్రయత్నించగా ఆయన తిరగబడడంతో స్థానిక ఏఎస్‌ఐ అంజయ్య కల్పించుకొని నచ్చజెప్పారు.

Advertisement

Also ReadFSL Fire Accident: ఫోన్ ట్యాపింగ్ నుంచి ఓటుకు నోటు వరకు.. FSL అగ్నిప్రమాదం వెనుక ఉన్న మతలబు ఇదేనా?

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×