E-Paper
Advertisement

Samyuktha Menon: సంయుక్త చేతి పై ఈ గుర్తు చూసారా? వింత గుర్తుకు అర్థం ఏంటబ్బా!

Samyuktha Menon: సంయుక్త చేతి పై ఈ గుర్తు చూసారా? వింత గుర్తుకు అర్థం ఏంటబ్బా!
Advertisement

Samyuktha Menon: సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో నటి సంయుక్త మీనన్ ఒకరు. ఈమె భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ భాష చిత్రాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు .ఇటీవలే బాలకృష్ణ హీరోగా నటించిన ఆఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో కాకపోయినా పర్వాలేదు అనిపించుకుంది. అలాగే శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇక త్వరలోనే మరో సూపర్ హిట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

సంయుక్త మీనన్ స్వయంభు..

భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో నిఖిల్ , నభా నటేష్ , సంయుక్త హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం స్వయంభు(Swayambhu). ఈ సినిమా ఫిబ్రవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా వి ఎఫ్ ఎక్స్ పనులు ఆలస్యం కావడంతో విడుదల కూడా వాయిదా పడి ఫిబ్రవరి 13న విడుదల కావాల్సిన ఈ సినిమా తిరిగి ఏప్రిల్ 10వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. ఇకపోతే తాజాగా ఈ సినిమా నుంచి చిత్ర బృందం టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ వీడియో మాత్రం సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఇక టీజర్ లాంచ్ కార్యక్రమంలో నటి సంయుక్త మీనన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సంయుక్త చేతికి గాయాలు..

Advertisement

ఇక ఈ ఫోటోలలో భాగంగా సంయుక్త చేతి పై గుర్తులు కనిపించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈమె చేతి పై ఉన్న ఈ గుర్తులు ఏంటి అంటూ ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే సంయుక్త చేతి పై ఉన్న ఈ గుర్తులను స్పష్టంగా గమనిస్తే అవి గాయాలు తగిలిన గుర్తు లాగా ఉన్నాయి. ఇక ఈ ఫోటోలు చూసినా అభిమానులు సంయుక్త చేతి పై ఈ గాయాలు ఏంటి ఈమె ఏదైనా ప్రమాదానికి గురయ్యారా అంటూ సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.

ప్రమాదానికి గురైన సంయుక్త..

Advertisement

ఇటీవల సంయుక్త ఓ సినిమా షూటింగ్లో భాగంగా గాయాలు పాలైనటువంటి ఒక వీడియోని షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో భాగంగానే తన చేతికి గాయాలు తగిలి ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు. ఇక ఈ విషయం తెలిసిన అభిమానులు త్వరగా ఈమె కోలుకోవాలని అంటూ ఆకాంక్షిస్తున్నారు. ప్రస్తుతం సంయుక్త ఒకవైపు ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూనే మరోవైపు ఇతర సినిమాల షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. సంయుక్త ఈ సినిమాతో పాటు పూరి జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి హీరోగా నటించిన స్లమ్ డాగ్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది.

Also Read: Varalakshmi Sarath Kumar: డైరెక్టర్ గా మారిన లేడీ విలన్.. సరికొత్తగా మొదటి సినిమా..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×