E-Paper
Advertisement

Netflix : పేరుతోనే వివాదం రాజేసిన సిరీస్… రంగంలోకి ముఖ్యమంత్రి… దెబ్బకు రూటు మార్చిన ఓటీటీ

Netflix : పేరుతోనే వివాదం రాజేసిన సిరీస్… రంగంలోకి ముఖ్యమంత్రి… దెబ్బకు రూటు మార్చిన ఓటీటీ
Advertisement

Netflix : సినిమాలు, సిరీస్ లు విడుదలకు ముందే వివాదాస్పదం కావడం కొత్తేమీ కాదు. కానీ ఇలాంటి ఓ వివాదంలో ఏకంగా ముఖ్యమంత్రి కలగజేసుకోవడం మాత్రం ఖచ్చితంగా చర్చించాల్సిన విషయమే. తాజాగా నెట్ ఫ్లిక్స్ నుంచి వస్తున్న ఓ సిరీస్ విషయంలో ఇదే జరుగుతోంది. దీంతో సదరు ఓటీటీ సంస్థ వెనక్కి తగ్గి, ఓ షాకింగ్ నిర్ణయాన్ని తీసుకుంది. అసలు ఈ సిరీస్ విషయంలో ఏం జరుగుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే…

వివాదం ఏంటంటే ?

మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ ఫిల్మ్ ‘ఘూస్ఖోర్ పండత్’. ఇంకా రిలీజ్ కాకముందే బ్రాహ్మణ సమాజాన్ని అవమానించేలా ఉందని ఆరోపణలు వచ్చాయి. ఈ సెటైరికల్ సినిమాలో ఒక పూజారిని లంచగొండిగా చూపించడం, మతపరమైన సంప్రదాయాలను అవమానకరంగా చిత్రీకరించడం వల్ల బ్రాహ్మణ సమాజ సభ్యులు, రాజకీయవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సినిమా ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్‌ను చూసి… బ్రాహ్మణులను అవమానించేలా ఉందని ఫైర్ అయ్యారు. దీని వల్ల యూపీ పోలీసులు నెట్‌ఫ్లిక్స్, సినిమా నిర్మాతలు, మనోజ్ బాజ్‌పేయిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో మతపరమైన భావాలను దెబ్బతీయడం, సమాజాన్ని రెచ్చగొట్టడం వంటి సెక్షన్లు (IPC 153A, 295A) చేర్చారు. ఈ వివాదం మొదలైన తర్వాత మేకర్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుంచి అన్ని ప్రమోషనల్ కంటెంట్‌ను తొలగించారు. ట్రైలర్‌లు, పోస్టర్లు డిలీట్ చేశారు.

Advertisement

‘ఘూస్ఖోర్ పండత్’ కథ ఒక పూజారి (పండత్) చుట్టూ తిరుగుతుంది. అతను లంచాలు తీసుకుని, పూజలు వంటి కార్యక్రమాలు చేస్తాడు. సమాజంలోని లంచగొండితనం, మతం పేరుతో చేసే అవినీతిని సెటైరికల్ గా చూపించడం ఈ సినిమా ఉద్దేశ్యమని ప్రమోషనల్ కంటెంట్ ను చూస్తే తెలుస్తుంది. ఇందులో మనోజ్ బాజ్‌పేయి పండత్ పాత్రలో నటించారు. ఈ వెబ్ ఫిల్మ్ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్‌గా తెరకెక్కింది. కానీ టైటిల్‌లో ‘పండత్’ అనే పదం బ్రాహ్మణులను సూచిస్తుందని, అది అవమానకరమని విమర్శలు వచ్చాయి. సినిమా మేకర్స్ ఇది సామాజిక సందేశం మాత్రమే అని చెప్పినా, వివాదం పెరిగిందే తప్ప తగ్గలేదు.

Also Read : ఈ వైరస్ సోకితే రాళ్ళుగా మారిపోతారు… అయ్యబాబోయ్ ఇదేం అరాచకం మావా ?

ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ – తీర్పు

Advertisement

ఈ సినిమా విడుదలను నిషేధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ ఈ సినిమా టైటిల్, కంటెంట్ బ్రాహ్మణ సమాజానికి పరువు నష్టం కలిగించేలా చేసేలా ఉన్నాయని ఆరోపించారు. జస్టిస్ పురుషీంద్ర కుమార్ కౌరవ్ ముందు ఈ కేసు విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ తరపున లాయర్ సినిమా పేరు మార్చనున్నట్లు కోర్టుకు తెలియజేశారు. ‘ఘూస్ఖోర్ పండత్’ నుంచి కథను మరింత ఖచ్చితంగా ప్రతిబింబించే కొత్త టైటిల్‌కు మార్చాలని నిర్మాతలు ‘స్పృహతో కూడిన నిర్ణయం’ తీసుకున్నారని కోర్టు పేర్కొంది. తీర్పు ఇవ్వడానికి ఇంకేమీ అవసరం లేదని, పిటిషన్‌ను కొట్టివేసింది.

మనోజ్ బాజ్‌పేయి – మేకర్స్ రెస్పాన్స్

మనోజ్ బాజ్‌పేయి ఈ వివాదంపై స్పందిస్తూ సినిమాలో సామాజిక సమస్యలను ఎత్తి చూపించడమే తప్ప, ఏ మతాన్ని అవమానించే ఉద్దేశ్యం లేదని చెప్పారు. నిర్మాతలు కూడా ఇది కథాత్మక స్వేచ్ఛ మాత్రమే అని వాదించారు. కానీ వివాదం పెరగడంతో సోషల్ మీడియాలో ప్రమోషన్స్ మొత్తం తొలగించారు. బ్రాహ్మణ సంఘాలు, రాజకీయవేత్తలు ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని పిలుపిచ్చాయి. సోషల్ మీడియాలో #BoycottNetflix ట్రెండ్ అయింది. ఇలాంటి వివాదాలు గతంలో కూడా జరిగాయి. ‘పద్మావత్’, ‘తాండవ్’ వంటి సినిమాలు మతపరమైన ఆరోపణలు ఎదుర్కొన్నాయి. చివరగా కోర్టు తీర్పు తర్వాత సినిమా కొత్త పేరుతో విడుదల కానుంది.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×