E-Paper
Advertisement

Chandrababu: మళ్లీ రెండు రాష్ట్రాలు కలవవు.. టీడీపీ బలం ఇదిగో.. ఖమ్మంలో చంద్రబాబు

Chandrababu: మళ్లీ రెండు రాష్ట్రాలు కలవవు.. టీడీపీ బలం ఇదిగో.. ఖమ్మంలో చంద్రబాబు
Advertisement

Chandrababu: తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కూడా బలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు పార్టీ అధినేత చంద్రబాబు. రెండు రాష్ట్రాలుగా విడిపోయాక.. కొందరు చేతకాని వ్యక్తులు మళ్లీ రెండు రాష్ట్రాలను కలిపేస్తామంటున్నారని.. బుద్ది, జ్ఞానం ఉండేవాళ్లు ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయరని పరోక్షంగా వైసీపీ నేతలపై మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాలు విడిపోయినా.. కలిసి పనిచేస్తే దేశానికే ఆదర్శంగా నిలుస్తాయన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ అనే వారికి ఖమ్మంలో ‘టీడీపీ శంఖారావం’ సభలో తెలుగు తమ్ముళ్ల ఉత్సాహమే సమాధానమన్నారు చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్‌లో గాడి తప్పిన పాలనను మళ్లీ గాడిలో పెడతానన్నారు. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని చెప్పారు. జ్ఞానేశ్వర్‌ లాంటి నాయకులను అభివృద్ధి చేసి పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని అన్నారు.

Advertisement

తెలుగు ప్రజలు తనకు ఎన్నో అవకాశాలు ఇచ్చారని.. 9 ఏళ్లు సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా.. పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఉండటం కూడా రికార్డే అన్నారు. రాబోయే రోజుల్లో తన రికార్డును ఎవరూ బద్దలకొట్టలేరని.. 40 ఏళ్లు ఆశీర్వదించిన తెలుగు జాతికోసం జీవితాంతం పనిచేస్తానని చంద్రబాబు చెప్పారు.

“ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి.. ఒక వ్యవస్థ. ఆయన అధికారం కోసం పార్టీ పెట్టలేదు. హైదరాబాద్‌లో తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్‌. నేను కోరుకునేది అధికారం కాదు.. తెలుగు వారు ఎక్కడ ఉన్నా మీ అభిమానం కోరుకుంటున్నా” అని ఖమ్మం సభలో చంద్రబాబు గుర్తు చేశారు.

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×