E-Paper
Advertisement

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
Advertisement

SIM Card Design History: స్మార్ట్‌ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ రోజు చూసే చిన్న వస్తువు.. సిమ్ కార్డ్. అయితే ఎప్పుడైనా గమనించారా? సిమ్ కార్డ్‌కు ఒక వైపు మూలన కొద్దిగా కట్ చేసి ఉంటుంది. అది చూడటానికి ఒక డిజైన్‌లా అనిపించినా, దాని వెనక ఒక పెద్ద హిస్టరీ, మొబైల్ యూజర్ల కంఫర్ట్ , అదిరిపోయే టెక్నికల్ లాజిక్ ఉన్నాయి. అసలు సిమ్ కార్డును అలా ఎందుకు కట్ చేశారు? దీని వెనక ఉన్న కారణాలే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం.

1. గందరగోళానికి బ్రేక్ :
మొదట్లో మొబైల్ ఫోన్లు వచ్చిన కొత్తలో సిమ్ కార్డ్స్ పూర్తిగా చతురస్రాకారం లో ఉండేవి. అంటే నాలుగు మూలలు సమానంగా ఉండేవి. దీనివల్ల ఫోన్ కొన్న కొత్తలో జనాలు సిమ్ కార్డును ఏ వైపు తిప్పి ఫోన్‌లో పెట్టాలో తెలియక తలలు పట్టుకునేవారు. చాలా మంది సిమ్ కార్డును తిరగేసి పెట్టడం వల్ల ఫోన్లలో సిమ్ స్లాట్స్ విరిగిపోయేవి, అలాగే సిమ్ లోపల ఉండే గోల్డ్ చిప్ డ్యామేజ్ అయ్యేది.

Advertisement

2. టెక్నాలజీ కంపెనీల క్రేజీ ఐడియా :
యూజర్లు పడుతున్న ఈ ఇబ్బందులను గమనించిన టెలికాం రీసెర్చ్ కంపెనీలు ఒక సింపుల్ అండ్ స్మార్ట్ ఐడియా ఆలోచించాయి. సిమ్ కార్డును ఒక వైపు మూలన కొద్దిగా కట్ చేస్తే.. ప్రజలు కన్ఫ్యూజ్ అవ్వకుండా కట్ చేసిన భాగం వైపే పర్ఫెక్ట్‌గా ఫోన్‌లో ఇన్సర్ట్ చేస్తారని భావించాయి. అలా సిమ్ కార్డు డిజైన్‌ను మార్చడమే కాకుండా.. ఫోన్లలో ఉండే సిమ్ ట్రేకి కూడా అదే వైపు కట్ చేసినట్టుగా డిజైన్ చేశారు. దీనివల్ల చిన్న పిల్లలు సైతం సిమ్ కార్డును ఎలాంటి తప్పు లేకుండా ఫోన్ లో సెట్ చేయగలుగుతున్నారు.

3. యూజర్ కంఫర్ట్ పెంచడం:
దీన్ని టెక్నికల్ భాషలో ‘పూల్ ప్రూఫింగ్’ లేదా ‘మిస్టేక్ ప్రూఫింగ్’ డిజైన్ అంటారు. అంటే యూజర్లు పొరపాటున కూడా తప్పు చేయకుండా డిజైన్ ద్వారానే గైడ్ చేయడం అన్నమాట. సిమ్ కార్డుకు ఆ చిన్న కట్ ఇవ్వడం వల్ల, కంటి చూపు సరిగ్గా లేని వారు కూడా కేవలం స్పర్శతో సిమ్ ఏ వైపు ఉందో గుర్తుపట్టి ఫోన్‌లో ఈజీగా పెట్టేయగలరు.

Advertisement

Also Read: అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

4. క్రెడిట్ కార్డ్ సైజ్ నుంచి నానో సిమ్ వరకు!
మీకు తెలుసా? 1991 లో వచ్చిన మొదటి సిమ్ కార్డ్ సైజ్ మన ఏటీఎం కార్డ్ అంత పెద్దగా ఉండేది. ఆ తర్వాత ఫోన్లు చిన్నగా మారే కొద్దీ సిమ్ సైజ్ కూడా మినీ, మైక్రో, ప్రస్తుతం మనం వాడుతున్న ‘నానో సిమ్’ స్టేజ్‌కి వచ్చేసింది. సైజ్ ఎంత మారినా, ఆ ఒక మూల కట్ చేసే రూల్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతోంది.

ప్రస్తుతం టెక్నాలజీ మరింత అడ్వాన్స్ అయి ఫిజికల్ సిమ్ కార్డ్ అవసరం లేకుండా నేరుగా ఫోన్ లోపలే యాక్టివేట్ అయ్యే ఇ-సిమ్ ట్రెండ్ నడుస్తోంది. ఏదేమైనా.. ఒక చిన్న కట్ ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది మొబైల్ యూజర్ల పనిని ఎంత ఈజీ చేసిందో కదా.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×