E-Paper
Advertisement

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!

లిఫ్టులో పెంపుడు కుక్క బీభత్సం.. హడలిపోయిన బాలికలు.. వీడియో వైరల్!
Advertisement

Dog Attack: ముంబయిలోని ‘శేత్ ఐరిన్’ హైరైజ్ రెసిడెన్షియల్ టవర్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. లిఫ్ట్‌లోకి తీసుకెళ్లిన ఒక పెంపుడు కుక్క ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది. లోపలే ఉన్న ముగ్గురు చిన్న పిల్లలపైకి దాడికి యత్నించింది. ఈ దృశ్యాలన్నీ సీసీటివి కెమెరాలో రికార్డు కాగా.. అవి ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

వైరల్ దృశ్యాలను పరిశీలిస్తే.. ముగ్గురు బాలికలు అప్పటికే లిఫ్ట్‌ లోపల ఉండగా ఒక మహిళ తన పెంపుడు కుక్కతో కలిసి లోపలికి ప్రవేశించింది. అయితే ఆ కుక్క నోటికి ‘మజిల్’ (నోరు తెరవకుండా కట్టే బెల్ట్) ఉన్నప్పటికీ అది వారిపై దాడికి యత్నించింది. లిఫ్ట్ తలుపులు మూసుకున్న కొద్దిసేపటికే ఆ కుక్క అకస్మాత్తుగా బాలికలపైకి దూకడానికి యత్నించింది. దీంతో బాలికలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

Advertisement

బాలికలపైకి ఎగబడుతున్న క్రమంలో యజమాని వారించినా కుక్క కంట్రోల్ కాలేదు. గొలుసు పట్టుకొని వెనక్కి లాగేందుకు ప్రయత్నించినా.. అది బాలికల వైపునకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో లిఫ్ట్ ఆగగానే ఇద్దరు బాలికలు వెంటనే బయటకు పరుగులు తీశారు. అయితే మరో బాలిక మాత్రం లోపలే చిక్కుకుపోయింది. దీంతో ఆమె వైపు కుక్క దూసుకెళ్లింది. అప్పుడు కూడా యజమాని దానిని ఆపడానికి శతవిధాలా ప్రయత్నించింది. కానీ వల్ల కాలేదు.

కుక్క ఎగబడుతున్న క్రమంలోనే లిఫ్ట్ ఆ బాలిక దిగాల్సిన ఫ్లోర్‌కు చేరుకుంది. దీంతో బాలిక ఒక్కసారిగా ప్రాణ భయంతో బయటకు పరిగెత్తింది. ఆ సమయంలో కూడా కుక్క ఆమెను తరుముకుంటూ వెళ్లడానికి యత్నించడం వీడియో చూడవచ్చు. అయితే యజమాని గట్టిగా పట్టుకొని వెనక్కి లాగడంతో.. మూడో బాలిక కూడా సురక్షితంగా బయటపడింది.

Advertisement

Also Read: జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

ఈ ఘటనలో బాలికలు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడటంతో అపార్ట్ మెంట్ వాసులతో పాటు నెటిజన్లు ఊపిరిపీల్చుకుంటున్నారు. దీనిపై స్థానిక పోలీసులు స్పందిస్తూ.. ‘ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు నమోదు కాలేదు. సదరు యజమానికి తన పెంపుడు కుక్కను లిఫ్ట్‌లో తీసుకెళ్లడానికి సొసైటీ అనుమతి ఉంది. అయితే ఈ వీడియో వైరల్ కావడంతో అపార్ట్‌మెంట్ నివాసితులలో కొంత ఆందోళన నెలకొంది’ అని తెలిపారు.

Also Read: నింగికి నిచ్చెన వేసిన తెలుగు శాస్త్రవేత్తలు.. ‘స్కైరూట్’ సృష్టికర్తల సక్సెస్ స్టోరీ!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×