E-Paper
Advertisement

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!

ఆలుగడ్డలు 5 నెలల పాటు తాజాగా ఉండాలా? అయితే ఆ ప్రదేశంలో పెట్టండి!
Advertisement

Potato Storage Tips: భారతదేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగానూ చాలామందికి ఫేవరేట్ వెజిటబుల్ బంగాళాదుంప. కనీసం వారంలో మూడు రోజులైనా ఆలుగడ్డలు మన వంటకాల్లో ఉండాల్సిందే. దీనికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు మరి. ఫ్రై, కుర్మా, చిప్స్.. ఇలా ఎన్ని రకాలుగా చేసుకున్నా రుచి అమృతంలా ఉంటుంది. అయితే, వీటిని సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే మాత్రం త్వరగా మొలకలు వచ్చేస్తాయి. కొన్నిసార్లు వారంలోనే కుళ్లిపోతుంటాయి. కానీ, ఒకే ఒక్క చిన్న చిట్కా పాటిస్తే.. వీటిని ఏకంగా ఐదు నెలల పాటు పాడవకుండా అచ్చం తెచ్చినప్పటిలాగే ఉంచుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

సోషల్ మీడియాలో తలెత్తిన ప్రశ్న:

ఇటీవల శాలీ కెల్లర్ అనే మహిళ బంగాళాదుంపలు వారం రోజులకే పాడైపోతున్నాయని, వాటిని ఎక్కువ రోజులు ఎలా నిల్వ చేయాలో చెప్పాలంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. దీనికి నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. చాలామంది తమ ఇంట్లో ఫాలో అయ్యే రకరకాల చిట్కాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే కొందరు మహిళలు తాము ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల బంగాళాదుంపలు 5 నెలల పాటు పాడవకుండా ఉన్నాయని అనుభవపూర్వకంగా చెప్పారు.

Advertisement

Also Read: టమాటా సైజును బట్టి ఆరోగ్య ప్రయోజనాలుంటాయా? నిపుణులు ఏమంటున్నారంటే..!

నిపుణులు ఏం చెబుతున్నారు?

సాధారణంగా బంగాళాదుంపలను చీకటిగా, పొడిగా ఉండే అలమరాల్లో పెట్టాలని గతంలో అనుకునేవారు. కానీ, ఆహార భద్రతా నిపుణులు, ప్రముఖ పొటాటో సప్లయర్స్ ఇప్పుడు కొత్త విషయాన్ని చెబుతున్నారు. బంగాళాదుంపలను 5 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రత ఉండే ఫ్రిడ్జ్‌లో ఉంచడమే అత్యుత్తమ మార్గం. ఇలా చేయడం వల్ల అవి సాధారణం కంటే మూడు రెట్లు ఎక్కువ కాలం, దాదాపు కొన్ని వారాల పాటు అదనంగా తాజాగా ఉంటాయని వారు స్పష్టం చేస్తున్నారు.

మంచి దుంపలను ఎలా గుర్తించాలి?

Advertisement

తాజా బంగాళాదుంపలు ఎప్పుడూ గట్టిగా, మట్టి వాసనతో ఉంటాయి. ఒకవేళ వాటికి చిన్న చిన్న మొలకలు వచ్చినా, వాటిని కట్ చేసి వాడుకోవచ్చు. అలాగే లోపల అక్కడక్కడా నల్లటి మచ్చలు లేదా ఆకుపచ్చని రంగు ఉంటే.. ఆ భాగాన్ని తీసేసి వండుకోవచ్చు. దీనివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.

వేటిని పారేయాలి?

బంగాళాదుంపలు మెత్తగా అయిపోయినా, వాటిపై ముడతలు పడినా అవి పాడైపోయాయని అర్థం. దుంపల నుంచి నీరు కారుతున్నా లేదా ఒక రకమైన దుర్వాసన వస్తున్నా వాటిని అస్సలు వాడకూడదు. వెంటనే డస్ట్‌బిన్‌లో పారేయడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

Also Read: ఉప్పుకు ప్రత్యామ్నాయంగా పుట్టిన వంటకం.. అస్సామీల సాంప్రదాయ ‘కోలాఖార్’ రుచి చూశారా?

Related News

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు.. ఈ తేదీల్లో పుట్టినవారిని అందరూ అపార్థం చేసుకుంటారు

నిమ్మకాయ తొక్కలు పారేస్తున్నారా? వీటితో 7 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

వీకెండ్‌లో ఎక్కువసేపు నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారంటే

Big Stories

Advertisement
×