E-Paper
Advertisement

Pen drives: పెన్‌డ్రైవ్‌కు ఆ రెండు రంధ్రాలు ఎందుకుంటాయో తెలుసా? దీని వెనుకున్న అసలు కారణం ఇదే!

Pen drives: పెన్‌డ్రైవ్‌కు ఆ రెండు రంధ్రాలు ఎందుకుంటాయో తెలుసా? దీని వెనుకున్న అసలు కారణం ఇదే!
Advertisement

Pen drives: నేటి డిజిటల్ యుగంలో పెన్‌డ్రైవ్ అనేది మన జీవితంలో ముఖ్య భాగమైపోయింది. ఫొటోలు, వీడియోలు, ఆఫీస్ డాక్యుమెంట్లు.. ఇలా వేల కొద్దీ ఫైళ్లను మనం ఈ చిన్న డివైజ్‌లోనే భద్రపరుచుకుంటుంటాం. అయితే, మీరు ఎప్పుడైనా గమనించారా? దాదాపు అన్ని పెన్‌డ్రైవ్‌ల పైన రెండు చిన్న రంధ్రాలు ఉంటాయి. చాలామంది ఇవి కేవలం డిజైన్ కోసం అనుకుంటారు. కానీ, ఈ రెండు రంధ్రాల వెనుక చాలా ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

జారిపోకుండా పట్టుకునేందుకు..

మనం పెన్‌డ్రైవ్‌ను కంప్యూటర్ లేదా లాప్‌టాప్‌కు కనెక్ట్ చేసేటప్పుడు, ఆ రంధ్రాలు మన వేళ్లకు మంచి గ్రిప్‌ను అందిస్తాయి. పెన్ డ్రైవ్‌లు సైజులో చాలా చిన్నగా, నున్నగా ఉంటాయి కాబట్టి.. వాటిని తీసేటప్పుడు లేదా పెట్టేటప్పుడు జారిపోయే అవకాశం ఉంటుంది. ఈ రంధ్రాల వల్ల మన వేళ్లు పట్టు కోల్పోకుండా ఉంటాయి. దీంతో పెన్ డ్రైవ్ పడిపోకుండా, లోపల సర్క్యూట్ దెబ్బతినకుండా ఉంటుంది.

Advertisement

Also Read: రూ.999కే బోట్ ప్రీమియం నెక్‌బ్యాండ్.. అమెజాన్ లిమిటెడ్ పీరియడ్ డీల్‌ను అస్సలు మిస్ అవ్వకండి!

పోగొట్టుకోకుండా ఉండేందుకే..

పెన్ డ్రైవ్‌లు చిన్నగా ఉండటం వల్ల వాటిని ఎక్కడో ఒకచోట మర్చిపోవడం లేదా పోగొట్టుకోవడం సర్వ సాధారణం. ఈ సమస్యను నివారించడానికే కంపెనీలు ఆ రంధ్రాలను ఇస్తాయి. వాటి సాయంతో మనం కీచైన్‌ను లేదా ఒక చిన్న తాడును కట్టుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పెన్ డ్రైవ్‌ను మన బ్యాగుకు లేదా తాళాల గుత్తికి తగిలించుకుని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ముఖ్యంగా స్టూడెంట్స్, ఆఫీస్ ఉద్యోగులకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

హీట్‌ను తగ్గించడానికి..

Advertisement

మనం ఎక్కువ సేపు డేటాను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నప్పుడు పెన్ డ్రైవ్‌లు వేడెక్కుతుంటాయి. ఈ రంధ్రాలు లోపల ఉండే వేడి గాలి బయటకు వెళ్లడానికి ఎయిర్ సర్క్యులేషన్‌కు కొంత వరకు దోహదపడతాయి. దీనివల్ల పెన్ డ్రైవ్ ఓవర్ హీట్ అవ్వకుండా దాని జీవితకాలం పెరుగుతుంది. కంపెనీలు ఈ రంధ్రాలను కేవలం డిజైన్ కోసం కాకుండా, యూజర్ల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తాయని దీన్ని బట్టి అర్థమౌతుంది.

Also Read: రూ.20 వేలకే 1200 ANSI బ్రైట్‌నెస్.. గూగుల్ టీవీ సపోర్ట్‌తో బెస్ట్ హోమ్ థియేటర్ ప్రొజెక్టర్ లాంచ్!

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×