E-Paper
Advertisement

Best Mileage Bikes Feb 2026: టీవీఎస్ To బజాజ్.. ఫిబ్రవరిలో ట్రెండింగ్ మైలేజ్ బైక్స్ ఇవే!

Best Mileage Bikes Feb 2026: టీవీఎస్ To బజాజ్.. ఫిబ్రవరిలో ట్రెండింగ్ మైలేజ్ బైక్స్ ఇవే!
Advertisement

ఫిబ్రవరి 2026 బైక్స్ ట్రెండింగ్ గురించి చూస్తే, ఎక్కువ మంది తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్స్ గురించి బాగా తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎక్కువ మంది వాటినో కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపారు. ఇంతకీ ఈ నెలలో ట్రెండింగ్ లో నిలిచిన టాప్ మైలేజ్ బైక్స్ ఏవనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ టీవీఎస్ స్పోర్ట్ (TVS Sport)

ఇది 110cc విభాగంలో అత్యధిక మైలేజీనిచ్చే సరసమైన బైక్. లీటర్ పెట్రోల్ కు ఇది సుమారు 70-80 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఇది 109.7cc, ETFi ఇంజన్‌ తో వస్తుంది. 8.19 PS పవర్, 8.7 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర సుమారు రూ. 55,000 నుంచి రూ. 63,000 (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది. ఇది రోజు వారీ ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది.  ఈ బైక్ లో ETFi టెక్నాలజీ, LED DRLs, 5 స్టెప్ అడ్జస్టబుల్ షాక్ అబ్జార్బర్స్, ఆల్ గేర్ ఎలక్ట్రిక్ స్టార్ట్, మంచి కుషనింగ్ కలిగిన సీటు ఉంటుంది. ఇది 6-10 ఆకర్షణీయమైన రంగులలో అందుబాటులో ఉంది. కిక్ స్టార్ట్, సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్స్ లో లభిస్తుంది. టీవీఎస్ స్పోర్ట్ తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి, రోజువారీ అవసరాలకు బాగుంటుంది.

⦿ బజాజ్ ప్లాటినా (Bajaj Platina)

Advertisement

ఇది కూడా మంచి మైలేజ్ ఇస్తుంది. లీటరుకు సుమారు 70 నుంచి 85 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. ప్లాటినా 100 వేరియంట్ దాదాపు 75-80 కి.మీ మైలేజ్ ఇస్తుండగా, 110cc వేరియంట్ 70 కి.మీ మైలేజ్ ఇస్తుంది. దీనికి 11 లీటర్ల సామర్థ్యంతో కూడిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ట్యాంక్ ఫుల్ చేస్తే సుమారు 700-800 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

Read Also: హోండా అదిరిపోయే ఆఫర్లు, ఆ కార్లపై ఏకంగా రూ. 2 లక్షల తగ్గింపు!

⦿  హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌ టెక్ (XTEC)

Advertisement

హీరో నుంచి విడుదలైన అద్భుతమైన ఫీచర్లతో కూడిన స్టైలిష్, అత్యధిక మైలేజీనిచ్చే కమ్యూటర్ బైక్. ఇది 97.2 cc ఇంజిన్‌తో వస్తుంది. ఒక లీటర్ పెట్రోల్ తో దాదాపు 73 – 81 కిమీ వరకు మైలేజీ ఇస్తుంది. ఇంధన సామర్థ్యం 9.8 లీటర్లు ఉంటుంది.  బ్లూటూత్ కనెక్టివిటీ, డిజిటల్ కన్సోల్, USB ఛార్జర్, i3S టెక్నాలజీ లాంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉంటుంది. దీని ధర సుమారు రూ.77,678 నుంచి రూ. 80,721 వరకు ఉంటుంది. ఈ బైక్ డ్రమ్ బ్రేక్స్, డిస్క్ బ్రేక్ వేరియంట్ లలో అందుబాటులో ఉంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ,  USB ఛార్జింగ్ పోర్ట్, LED పొజిషన్ ల్యాంప్ ఉంటుంది.

Read Also: యమహా EC-06 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×