E-Paper
Advertisement

CM Revanth Reddy: కేటీఆర్ మాటలు డ్రగ్స్ తీసుకున్నట్లే ఉన్నాయి.. వారిది గంజాయి బ్యాచ్.. రేవంత్ ఘాటు కౌంటర్!

CM Revanth Reddy: కేటీఆర్ మాటలు డ్రగ్స్ తీసుకున్నట్లే ఉన్నాయి.. వారిది గంజాయి బ్యాచ్.. రేవంత్ ఘాటు కౌంటర్!
Advertisement

CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ సాగుతున్న తరుణంలో, ప్రత్యర్థి పార్టీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన, బీఆర్ఎస్ పార్టీని రాష్ట్రం నుండి తుడిచిపెట్టాలని, బీజేపీ మోసపూరిత మాటలను నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

బీజేపీ తీరును ఎండగడుతూ, గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. “హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు, వాహనాలు మునిగిపోతే, బండి పోతే బండి ఇస్తాం అని ప్రగల్భాలు పలికిన బండి సంజయ్, ఆ తర్వాత రూపాయి సాయం కూడా చేయలేదు” అని విమర్శించారు. వరదల సమస్యను కేవలం ఓట్ల కోసం వాడుకున్నారని, బీజేపీకి ఓటేస్తే హైదరాబాదీలను నిండా ముంచడమేనని ఆయన మండిపడ్డారు. పాలమూరుకు ఇచ్చిన హామీలను కూడా కేంద్రం విస్మరించిందని, 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు.

Advertisement

కేంద్రం నుండి రాష్ట్రానికి అందుతున్న నిధుల పంపిణీలో జరుగుతున్న వివక్షపై రేవంత్ రెడ్డి గణాంకాలను బయటపెట్టారు. “దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తోంది. తెలంగాణ ప్రతి రూపాయి పన్ను చెల్లిస్తే కేవలం 42 పైసలే వెనక్కి ఇస్తున్నారు. కానీ ఉత్తరాది రాష్ట్రాలైన బిహార్‌కు రూపాయికి 6 రూపాయలు, యూపీకి 2.73 రూపాయలు ఇస్తున్నారు” అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. కేవలం తెలంగాణ సొమ్మును ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని, రాష్ట్ర పన్నుల వాటా తప్ప ప్రత్యేకంగా ఇచ్చిందేమీ లేదని ప్రశ్నించారు.

మరోవైపు బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ రెడ్డి అత్యంత కఠినమైన వ్యాఖ్యలు చేశారు. “పదేళ్లు పెత్తనం చెలాయించి, మున్సిపాలిటీలను నాశనం చేసిన బీఆర్ఎస్ నేతలకు మళ్లీ ఓట్లు అడిగే హక్కు లేదు. ఆ పార్టీని యాసిడ్ పోసి కడగాలి, మళ్లీ మొలవకుండా చేయాలి” అని వ్యాఖ్యానించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను ఈడీ, సీబీఐల నుండి బీజేపీ కాపాడుతోందని, వారి మధ్య విడదీయరాని చీకటి ఒప్పందం ఉందని ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ, వారు హోష్‌లో ఉండి మాట్లాడుతున్నట్లు లేదని, వారిది గంజాయి బ్యాచ్ అని తీవ్రంగా విమర్శించారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని ఆయన కోరారు.

Advertisement

Read Also: KTR: తులం బంగారం ఏమైంది..? రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్, కాంగ్రెస్ శ్రేణులు ఫైర్

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×