E-Paper
Advertisement

కిచెన్ చిమ్నీ కొంటున్నారా? ఫిల్టర్ బెటరా లేక ఫిల్టర్ లెస్సా? ఏది కొంటే లాభం!

కిచెన్ చిమ్నీ కొంటున్నారా? ఫిల్టర్ బెటరా లేక ఫిల్టర్ లెస్సా? ఏది కొంటే లాభం!
Advertisement

Filter vs Filterless chimney: ప్రస్తుతం వంటగదిలో చిమ్నీ అనేది ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. ముఖ్యంగా మన ఇండియన్ వంటకాల్లో ఆయిల్, మసాలాలు ఎక్కువగా వాడతాం కాబట్టి కిచెన్ మొత్తం జిడ్డుగా మారకుండా ఉండటానికి చిమ్నీలు బాగా హెల్ప్ అవుతాయి. అయితే.. మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ‘ఫిల్టర్ చిమ్నీ’ (Filter Chimney), ‘ఫిల్టర్ లెస్ చిమ్నీ’ (Filterless Chimney) అని రెండు రకాలు కనిపిస్తాయి. వీటిలో ఏది మీ వంటగదికి కరెక్ట్? దేని వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి? అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిల్టర్ చిమ్నీ అంటే ఏంటి?

ఫిల్టర్ చిమ్నీలలో ఎక్కువగా బాఫిల్ ఫిల్టర్స్ వాడుతుంటారు. ఇవి సాధారణంగా స్టీల్ లేదా అల్యూమినియం వంపులతో కూడిన ప్యానల్స్ లాగా ఉంటాయి. మనం వంట చేసేటప్పుడు వచ్చే పొగ, జిడ్డు, ఆయిల్ మొత్తాన్ని ఈ ఫిల్టర్లు లాగేసుకుంటాయి. ఆయిల్ అంతా ఫిల్టర్ లోపల ఆగిపోయి, కేవలం పొగ మాత్రమే పైపు ద్వారా బయటకు వెళ్తుంది.

Advertisement

లాభాలు: ఇండియన్ వంటకాలకు, ముఖ్యంగా ఫ్రైలు, పోపులు ఎక్కువగా పెట్టే ఇళ్లకు ఇవి చాలా పవర్‌ఫుల్ గా పనిచేస్తాయి. ఆయిల్ జిడ్డు మోటార్ వరకు వెళ్లకుండా ఇవి  ఆపుతాయి.

నష్టాలు: దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ. కనీసం నెలకో రెండు సార్లయినా ఈ ఫిల్టర్ ప్లేట్లను విప్పి, వేడి నీళ్లు లేదా కాస్టిక్ సోడాతో గంటల తరబడి రుద్ది క్లీన్ చేయాల్సి వస్తుంది. లేకపోతే చిమ్నీ సక్షన్ పవర్ (లాగే శక్తి) తగ్గిపోతుంది.

ఫిల్టర్ లెస్ చిమ్నీ అంటే ఏంటి?

Advertisement

పేరులోనే ఉన్నట్టుగా ఇందులో ఎలాంటి ఫిల్టర్ ప్లేట్లు ఉండవు. దీని మోటార్ డిజైన్ కొంచెం భిన్నంగా ఉంటుంది. వంట గదిలోని పొగ, జిడ్డును నేరుగా మోటార్ సక్షన్ ఫోర్స్ ద్వారా లాగేస్తుంది. ఇందులో ఆయిల్ కలెక్టర్ అనే చిన్న కప్పు ఉంటుంది. జిడ్డు మొత్తం కరిగి ఆ కప్పులో పడుతుంది.

లాభాలు: క్లీనింగ్ తలనొప్పి అస్సలు ఉండదు. ఫిల్టర్లు లేవు కాబట్టి వాటిని విప్పి రుద్దాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని నెలలకొకసారి ఆయిల్ కలెక్టర్ కప్పును తీసి కడిగేస్తే సరిపోతుంది. పైగా ఇవి ఆటో-క్లీన్ టెక్నాలజీతో వస్తాయి కాబట్టి ఒక్క బటన్ నొక్కితే లోపల ఉన్న జిడ్డు మొత్తం కరిగి కప్పులోకి వచ్చేస్తుంది.

నష్టాలు: ఒకవేళ మీ ఇంట్లో రోజూ విపరీతంగా డీప్ ఫ్రైలు, నాన్ వెజ్ వంటలు చేస్తుంటే.. కాలక్రమేణా కొద్దిగా ఆయిల్ మోటార్ భాగాల్లోకి చేరే అవకాశం ఉంటుంది. బాఫిల్ ఫిల్టర్లతో పోలిస్తే ఇది ఆయిల్ జిడ్డును ఆపడంలో కాస్త వెనుకబడి ఉంటుంది.

Also Read: పవర్ కట్ టెన్షన్ వద్దు.. చార్జింగ్ ఎల్‌ఈడీ లైట్లతో కలిగే లాభాలు ఇవే!

మీ వంటగదికి ఏది బెస్ట్ ఛాయిస్?

ఈ రెండింటిలో ఏది బెటర్ అనేది పూర్తిగా మీ వంట విధానం, మీకున్న సమయంపై ఆధారపడి ఉంటుంది.

1.మీరు వంటల్లో ఆయిల్, మసాలాలు, పోపులు ఎక్కువగా వాడతారా? అయితే మీకు బాఫిల్ ఫిల్టర్ చిమ్నీ బెస్ట్ ఛాయిస్. ఇది జిడ్డును పర్ఫెక్ట్‌గా లాగేస్తుంది. కాకపోతే నెలకొకసారి క్లీన్ చేసే ఓపిక మీకు ఉండాలి.

2.నాకు క్లీనింగ్ చేసే అంత టైమ్ లేదు, మెయింటెనెన్స్ ఫ్రీగా ఉండాలి అనుకుంటున్నారా? అయితే కళ్లు మూసుకుని ఫిల్టర్ లెస్ ఆటో క్లీన్ చిమ్నీ తీసుకోండి. 2026లో ఎక్కువ మంది వర్కింగ్ కపుల్స్ , మోడ్రన్ హోమ్స్ వారు ఈ ఫిల్టర్ లెస్ చిమ్నీలనే ఇష్టపడుతున్నారు.

కిచెన్ శుభ్రంగా ఉండటమే కాదు, మన ఆరోగ్యం కూడా ముఖ్యం. కాబట్టి మీ బడ్జెట్, క్లీనింగ్ చేసుకునే వీలును బట్టి సరైన మోడల్‌ను ఎంచుకోండి. కొనేటప్పుడు చిమ్నీ సక్షన్ పవర్ కనీసం 1200 m³/hr లేదా అంతకంటే ఎక్కువ ఉండేలా చూసుకోవడం మర్చిపోకండి!.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×