E-Paper
Advertisement

మరో హిట్‌ కోసం రెడీ అవుతున్న సూర్య.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్ ఎప్పుడంటే?

మరో హిట్‌ కోసం రెడీ అవుతున్న సూర్య.. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ రిలీజ్ ఎప్పుడంటే?
Advertisement

Vishwanath And Sons: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ (Vishwanath And Sons). తాజాగా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ప్రకటించారు నిర్మాతలు. ఎప్పటి నుంచో వీరి కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమా గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్వ అవుతోంది.

Read also-నాగచైతన్య ‘వృషకర్మ ‘ రిలీజ్ డేట్ లాక్.. టైం చూసి దిగితున్నాడే..!

Advertisement

అందులో ఏం ఉంది అంటే?.. “ప్రియమైన అన్బానా ఫ్యాన్స్ (Anbaana Fans)… మన సెలబ్రేషన్స్‌ను ఇలాగే కొనసాగించడానికి ఒక చిన్న నోట్… ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ కోసం దారి ఇవ్వండి. ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను శాసించడానికి వస్తోంది” అంటూ మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ ప్రకటనతో సూర్య అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపయింది. ఆగస్టు 14, 2026న స్వాతంత్ర్య దినోత్సవ సుదీర్ఘ వారాంతం కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సూర్య, ఈ సినిమాలో సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. ‘తొలిప్రేమ’, ‘సార్’ (వాతి) వంటి సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు వెంకీ అట్లూరి, ఈ చిత్రాన్ని క్లాస్ అండ్ మాస్ ఎలిమెంట్స్ కలగలిపిన ఒక పవర్‌ఫుల్ ఫ్యామిలీ ఎండ్ కమర్షియల్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు.

Read also-ఎన్టీఆర్ విగ్ర‌హం పెడితే త‌ప్పేంటి!? ఏ రాజ‌కీయ పార్టీకి దీన్ని కాద‌నే ద‌మ్ముంది….అవ‌స‌రాల‌లాంటివి!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుండి అభిమానుల సంబరాలు రెట్టింపు అయ్యాయి. తెలుగు, తమిళంతో పాటు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2026 ఆగస్టులో థియేటర్లలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×