E-Paper
Advertisement

టీడీపీ చుట్టూ తెలంగాణ రాజకీయాలు.. ఎన్టీఆర్ కోసం కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల పోటీ, మేటరేంటి?

టీడీపీ చుట్టూ తెలంగాణ రాజకీయాలు..  ఎన్టీఆర్ కోసం కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల పోటీ, మేటరేంటి?
Advertisement

Telangana Politics: తెలంగాణలో రాజకీయాలు ఎన్టీఆర్ చుట్టూనే తిరుగుతున్నాయి.  ఆ పార్టీ కేడర్‌ను తమవైపు తిప్పుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి అధికార కాంగ్రెస్-విపక్ష బీఆర్ఎస్.  ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెరపైకి కొత్త వాదన తీసుకొచ్చింది బీఆర్ఎస్. ఏ వాదనేంటి? అనేది అసలు ప్రశ్న.

టీడీపీ చుట్టూ తెలంగాణ రాజకీయాలు

Advertisement

తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక, నటుడు, రాజకీయ నేత నందమూరి తారక రామారావు 103వ జయంతి నేడు. మే 28న ఆయన పుట్టినరోజు పార్టీలకు అతీతంగా తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద సందడి గురించి చెప్పాల్సిన పని లేదు.

ఉదయం నాలుగు గంటల నుంచి వివిధ పార్టీల రాజకీయ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఘాట్ వద్దకు చేరుకుని ఘనంగా నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ విషయాన్ని కాసేపు పక్కన బెడదాం. అసలు తెలంగాణ గడ్డపై పుట్టింది తెలుగు దేశం పార్టీ. గడిచిన దశాబ్దం కాలంగా తెలంగాణలో ఆ పార్టీ సైలెంట్ అయ్యింది.

Advertisement

బలమైన నేతలు లేకపోయినా, కేడర్ మాత్రం బలంగా ఉంది. ఆ కేడర్‌ను ఆకట్టుకునే ప్రయత్నాలు ఇప్పటికీ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. తాము అధికారంలోకి రాగానే మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఆనాటి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు.

ఎన్టీఆర్ కోసం కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీల పోటీ

అన్నట్లుగానే మే 28న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహనీయుడు విగ్రహాన్ని గురువారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ విధంగా టీడీపీ కేడర్.. కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లడం గమనించిన బీఆర్ఎస్, కొత్త పల్లవిని ఎత్తుకుంది. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వసంత్‌నగర్‌లో ఆయన విగ్రహానికి నివాళులర్పించారు కూకట్‌పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు.

తన తొలి ఓటు టీడీపీకే వేశానని, అందుకు ఎన్టీఆర్ కారణమని ఆయన గుర్తు చేసుకున్నారు. టీడీపీతోపాటు ఎన్టీఆర్ తో తనకు పాత విషయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రజల కోసం ఎన్టీఆర్ పార్టీ పెట్టారని, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇన్‌సల్ట్ చేసిందో అందరూ చూశారని వివరించారు.

ALSO READ: ‘ఇళ్లు కట్టకపోతే నేను పోటీ చేయను.. మరి కేటీఆర్ సిద్ధమేనా’? మంత్రి పొంగులేటి సవాల్!

ఎన్నికలకు కేవలం 9 నెలలకు ముందు పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు. తెలంగాణలో పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి అన్ని వర్గాలకు న్యాయం చేసిన వ్యక్తని గుర్తు చేశారు.అదే సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కొత్త పల్లవిని ఎత్తుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణారావు డిమాండ్ చేశారు.

కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఎన్టీఆర్ పేరిట పాఠశాలను ఏర్పాటు చేస్తున్నామని, దాన్ని పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. ఇవాళ తాము ఎమ్మెల్యేలు అయ్యామంటే ఆయన స్ఫూర్తి వల్లేనని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఎన్టీఆర్ పేరుతో ఆ పార్టీ కేడర్‌ను తిప్పుకునేందుకు ఇరు పార్టీలు పోటీ పడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

 

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×