E-Paper
Advertisement

ఆండ్రాయిడ్ 16, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో Vivo X300e.. పిచ్చెక్కించే లీక్డ్ ఫీచర్లు ఇవే!

ఆండ్రాయిడ్ 16, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో Vivo X300e.. పిచ్చెక్కించే లీక్డ్ ఫీచర్లు ఇవే!
Advertisement

Vivo X300e: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో నుంచి వచ్చే స్మార్ట్‌ఫోన్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉంటారు. అలాంటి వారి కోసమే కంపెనీ ఇప్పుడు ఒక తీపి కబురు చెప్పింది. Vivo X300e లాంచ్‌కు ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 27న ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను ముందుగా చైనా మార్కెట్లో విడుదల చేయనున్నారు. ఆ తర్వాత ఇతర దేశాల్లోకి అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే, విడుదలకు ముందే ఈ ఫోన్ ఫీచర్లు లీక్ కావడంతో టెక్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

అదిరిపోయే డిస్‌ప్లే, క్లాసీ లుక్:

Vivo X300e ఫోన్ 6.59 అంగుళాల హై-రిజల్యూషన్ డిస్‌ప్లేతో రానుంది. గేమ్స్ ఆడటానికి, వీడియోలు చూడటానికి ఈ స్క్రీన్ చాలా స్పష్టంగా, స్మూత్‌గా అనిపిస్తుంది. ఫోన్ సైజ్ పెద్దగా ఉన్నప్పటికీ కేవలం 7.99 మిమీ మందంతో, 203 గ్రాముల బరువుతో చేతిలో పట్టుకోవడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది మూన్‌లైట్ వైట్, సన్‌లైట్ ఆరెంజ్, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో లభించనుంది.

Advertisement

Also Read: గేమర్స్ బీ రెడీ.. రూ.11 వేలకే 280Hz రిఫ్రెష్ రేట్.. లెనోవో కొత్త గేమింగ్ మానిటర్ చూశారా?

సూపర్ ఫాస్ట్ పెర్ఫార్మెన్స్:

స్పీడ్ విషయంలో ఈ ఫోన్ నెక్ట్స్ లెవెల్‌లో ఉండబోతోంది. క్వాల్కమ్ టాప్ ప్రాసెసర్ అయిన స్నాప్‌డ్రాగన్ 8 Gen 5తో ఇది పనిచేస్తుంది. దీంతో హెవీ గేమింగ్, మల్టీటాస్కింగ్ చాలా ఈజీగా అయిపోతాయి. వినియోగదారుల అవసరాలకు తగినట్లుగా 8GB, 12GB ర్యామ్ ఆప్షన్లతో పాటు 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ లభిస్తుంది.

అమేజింగ్ కెమెరా సెటప్:

Advertisement

ఫొటోగ్రఫీ ఇష్టపడే వారి కోసం ఇందులో వెనుక వైపు మూడు కెమెరాలు ఇచ్చారు. అందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో పాటు మరొక 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో కూడా ఏకంగా 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించడం విశేషం.

భారీ బ్యాటరీ, ఆండ్రాయిడ్ 16:

ఈ Vivo X300e ప్రధాన ఆకర్షణ దీని 7200mAh భారీ బ్యాటరీ. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హ్యాపీగా వాడేయవచ్చు. దీనికి తోడు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, NFC, బ్లూటూత్ వంటి అన్ని రకాల కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ప్రీమియం సెగ్మెంట్‌లో ఈ ఫోన్ గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.

Also Read: వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు బిగ్ షాక్.. భారత్‌లో OxygenOS శకం ముగిసినట్లేనా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×