E-Paper
Advertisement

రంగనాథ్‌ను హైడ్రా నుంచి తప్పించండి.. సీఎస్‌కు హైకోర్టు ఆదేశం!

రంగనాథ్‌ను హైడ్రా నుంచి తప్పించండి.. సీఎస్‌కు హైకోర్టు ఆదేశం!
Advertisement

Ranganath: హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలంగాణ హైకోర్టుకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఆక్రమణల తొలగింపు చర్యలతో నిలుస్తున్న ఆయన, తాజాగా ధిక్కరణ పిటిషన్ల విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానానికి తన అఫిడవిట్‌ను సమర్పించారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి గౌరవముందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

అఫిడవిట్‌లో ప్రధానాంశాలు

Advertisement

కోర్టు ఆదేశాలను ఉల్లంఘించాలనే ఉద్దేశం తనకు ఎంతమాత్రం లేదని రంగనాథ్ కోర్టుకు తెలిపారు. లోతుకుంటలోని సర్వే నెంబర్ 1, 2 ల పరిధిలోని 40 ఎకరాల భూమిలోకి హైడ్రా సిబ్బంది అసలు వెళ్లనే లేదని, అక్కడ ఎలాంటి కూల్చివేతలు చేపట్టలేదని వివరించారు. ఈ విషయంలో పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టిస్తూ అవాస్తవాలు చెప్పారని, నిబంధనలకు లోబడే తాము వ్యవహరిస్తున్నామని అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

హైకోర్టు తీవ్ర ఆగ్రహం

Advertisement

విచారణ సమయంలో హైకోర్టు కమిషనర్ తీరుపై ఘాటుగా స్పందించింది. రంగనాథ్‌పై ఇప్పటివరకు దాదాపు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు దాఖలవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఒక్క అధికారిపైనే ఇన్ని పిటిషన్లు ఎందుకు వస్తున్నాయని నిలదీసింది. చట్టపరిధి దాటి నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని హెచ్చరించిన న్యాయస్థానం, ప్రజాప్రయోజనాలు ముఖ్యమే అయినా న్యాయపరమైన ప్రక్రియను విధిగా పాటించాలని స్పష్టం చేసింది.

అదే విధంగా హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌ను ఆ పదవి నుంచి తప్పించి, ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) కి  కోర్టు ఆదేశించింది.

Also Read: కడపల్లి రహదారిపై కంటైనర్ బీభత్సం.. ముగ్గురు మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×