E-Paper
Advertisement

ఫోల్డబుల్ ఫోన్ల రికార్డ్ బ్రేక్.. ఏకంగా 7000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వస్తోన్న Vivo X Fold 6!

ఫోల్డబుల్ ఫోన్ల రికార్డ్ బ్రేక్.. ఏకంగా 7000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వస్తోన్న Vivo X Fold 6!
Advertisement

Vivo X Fold 6: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో తమ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ Vivo X Fold 6ను చైనా మార్కెట్లో విడుదల చేయనుంది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ సోషల్ మీడియా వేదికగా ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక వివరాలను పంచుకున్నారు. జూన్ చివరి వారంలో ఈ అద్భుతమైన డివైజ్ యూజర్ల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

ఈ సరికొత్త ఫోల్డబుల్ ఫోన్ మీడియాటెక్ పవర్‌ఫుల్ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ డైమెన్సిటీ 9500 ప్రొసెసర్‌తో పనిచేయనుంది. దీంతోపాటు ఈ ఫోన్ 7,000mAh బ్యాటరీ సామర్థ్యంతో రానుండటం విశేషం. ఫోల్డబుల్ ఫోన్ల చరిత్రలోనే ఇంత పెద్ద బ్యాటరీని అందించడం ఇదే తొలిసారి కావచ్చు. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఫోన్ బరువు తక్కువగా, పట్టుకోవడానికి వీలుగా చాలా స్లిమ్‌గా డిజైన్ చేశారు.

Advertisement

Also Read: Jio మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. రూ.200 రీఛార్జ్ చేస్తే రూ.1500 లాభం.. ఛాన్స్ మిస్ అవ్వకండి మామా!

ఫొటోగ్రఫీ ప్రియుల కోసం వివో ఈసారి కెమెరా విభాగంలో భారీ మార్పులు చేసింది. ఇందులో మెయిన్ కెమెరాగా 200MP సెన్సార్‌ను అందిస్తున్నారు. దీంతో పాటు 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, మరో 50MP అల్ట్రా‌వైడ్ యాంగిల్ లెన్స్‌ను చేర్చారు. ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ వివో మార్క్ సర్క్యులర్ (గుండ్రటి) మోడ్యూల్‌లోనే అమర్చబడి ఉంటుంది.

Advertisement

వివో X ఫోల్డ్ 6 డిజైన్ పరంగా చాలా ఆకర్షణీయంగా ఉండబోతోంది. డిస్‌ప్లే అంచులు మరింత గుండ్రంగా (రౌండ్ కార్నర్స్) మారి సరికొత్త లుక్‌ను ఇస్తాయి. సెక్యూరిటీ కోసం ఫోన్ పక్కన సైడ్‌మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. ప్రస్తుతం కంపెనీ ప్రయోగాత్మకంగా వైట్ కలర్ వేరియంట్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఈ ప్రీమియం ఫోల్డబుల్ ఫోన్ చైనా మార్కెట్లో విడుదలైన తర్వాత హానర్ మ్యాజిక్ V6, ఒప్పో ఫైండ్ N6, రాబోయే శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 8 వంటి టాప్ మోడళ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఫోన్ గురించిన మరిన్ని పూర్తి వివరాల కోసం అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: పాడ్‌కాస్ట్‌ల కోసం యూట్యూబ్‌లోకి ఏఐ ఎంట్రీ.. ఇక మీ మూడ్‌ను బట్టే కంటెంట్!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×