E-Paper
Advertisement

25,21,00,000 వ్యూస్… నాలుగేళ్లుగా నెట్ ఫ్లిక్స్ ను ఊపేస్తున్న సిరీస్… ఇదేం పిచ్చి సామీ

25,21,00,000 వ్యూస్… నాలుగేళ్లుగా నెట్ ఫ్లిక్స్ ను ఊపేస్తున్న సిరీస్… ఇదేం పిచ్చి సామీ
Advertisement

Netflix Top 10 Shows : ఒకప్పుడు ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ కోసం ఇంట్లో ఉంటే టీవీలు, బయటకు వెళ్తే సినిమాలపై ఆధారపడేవారు. కానీ నేడు వినోద ప్రపంచం అన్న పదానికి అర్థం పూర్తిగా మారిపోయింది. ఇప్పటికీ ఎన్నో టీవీ ఛానెళ్లు ఉన్నప్పటికీ, చాలా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. ప్రైమ్ వీడియో, జీ5, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీలు అయితే ప్రేక్షకులు ఎప్పుడైనా ఆస్వాదించగల లెక్కలేనన్ని సినిమాలు, సిరీస్‌లను అందిస్తున్నాయి. “సేక్రేడ్ గేమ్స్”, “మనీ హీస్ట్”, “స్ట్రేంజర్ థింగ్స్” వంటి ప్రముఖ సిరీస్‌లు నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులకు ఎప్పుడూ లేనంత కిక్ ఇచ్చాయి. ఈ కొన్ని సిరీస్లే ఆ ఓటీటీకి లక్షలాది మంది వీక్షకులను సంపాదించి పెట్టాయి. అయితే నెట్‌ఫ్లిక్స్ లో మోస్ట్ పాపులర్ అయిన సిరీస్‌లు, వాటి వ్యూస్ గురించి మీకు తెలుసా?

నాలుగు ఏళ్లుగా నెట్‌ఫ్లిక్స్‌ ను ఊపేస్తున్న ఒకే ఒక్క సిరీస్

నెట్‌ఫ్లిక్స్ మోస్ట్ పాపులర్ సిరీస్ గా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది “వెన్స్‌డే”. ఇందులో అత్యంత ప్రాచుర్యం పొందిన మిస్టరీ ఫాంటసీ థ్రిల్లర్. ఈ సిరీస్ కథను “ది ఆడమ్స్ ఫ్యామిలీ”లోని ప్రసిద్ధ పాత్ర వెన్స్‌డే ఆధారంగా రూపొందించారు. ఈ సిరీస్ 2022లో రిలీజ్ కాగా, అత్యధికంగా వీక్షించబడిన సిరీస్‌ గా నిలిచింది. “వెన్స్‌డే” మొదటి సీజన్ ఇప్పటివరకు నెట్‌ఫ్లిక్స్‌లో 252.1 మిలియన్లకు పైగా సాధించి రికార్డును నెలకొల్పింది. ఈ సిరీస్ మొదటి సీజన్‌ లో మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌ లు ఉండగా, వెన్స్‌డే ఆడమ్స్ నెవర్‌మోర్ అకాడమీలో చేరి, ఆ తర్వాత ఒక భయంకరమైన రహస్యాన్ని, హత్య మిస్టరీని వెలికితీస్తుంది.

“వెన్స్‌డే” కథ ఏమిటి?

Advertisement

స్కూల్ లో తన సోదరుడిని వేధిస్తున్న కొంతమంది పిల్లలపై వెడ్నెస్డే దాడి చేయడంతో స్టోరీ మొదలవుతుంది. తరువాత తల్లిదండ్రులు ఆమెను సమాజం నుండి వెలివేయబడిన వారి కోసం ఉన్న నెవర్‌మోర్ అకాడమీ అనే బోర్డింగ్ స్కూల్ లో చేర్పిస్తారు. ఆ పాఠశాలకు చేరుకున్న తర్వాత పట్టణంలో జరుగుతున్న వింత హత్యల రహస్యాలను వెడ్నెస్డే కనిపెట్టి, తన తెలివితేటలతో, అతీంద్రియ శక్తులను ఉపయోగించి ప్రమాదకరమైన రాక్షసుడిని అంతం చేస్తుంది.

Also Read : బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 షోలు

Advertisement

నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 షోల విషయానికి వస్తే… 25,21,00,000 వ్యూస్ తో ‘వెన్స్‌డే’ మొదటి స్థానంలో ఉంది. 14,26,00,000 వ్యూస్ తో ‘అడోలెసెన్స్: లిమిటెడ్ సిరీస్’ రెండవ స్థానంలో, ‘స్ట్రేంజర్ థింగ్స్ 4’ మూడవ స్థానంలో, ‘స్ట్రేంజర్ థింగ్స్ 5’ నాల్గవ స్థానంలో, ‘వెన్స్‌డే సీజన్ 2’ ఐదవ స్థానంలో, ‘డామర్: మాన్‌స్టర్: ది జెఫ్రీ డామర్ స్టోరీ’ ఆరవ స్థానంలో ఉన్నాయి. ‘బ్రిడ్జర్టన్: సీజన్ 1’, ‘ది క్వీన్స్ గాంబిట్’, ‘బ్రిడ్జర్టన్ సీజన్ 3’, ‘హీ అండ్ హెర్స్’ వరుసగా ఏడు, ఎనిమిది, తొమ్మిది, పదవ స్థానాల్లో ఉన్నాయి.

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×