E-Paper
Advertisement

SMS Fraud App: మీకు తెలియకుండానే మీ మొబైల్‌ నుంచి ఇతరులకు మెసేజ్.. ఒక్క యాప్‌తో రూ.కోట్లలో స్కామ్

SMS Fraud App: మీకు తెలియకుండానే మీ మొబైల్‌ నుంచి ఇతరులకు మెసేజ్.. ఒక్క యాప్‌తో రూ.కోట్లలో స్కామ్
Advertisement

SMS Fraud App| గ్రేటర్ నోయిడా గౌతమ్ బుద్ధ్ నగర్ సైబర్ పోలీసులు ఒక భారీ స్కామ్ జరుగుతున్నట్లు కనుగొన్నారు. పోలీసుల దర్యాప్తులో వింగో (WinGo) అనే యాప్ అనుమానాస్పదంగా కనిపించింది.  ఈ యాప్ సైబర్ నేరగాళ్ల పెద్ద నెట్‌వర్క్‌లో పోలీసులు భాగమని అనుమానిస్తున్నారు. ఈ స్కామ్ ఈ యాప్‌తో పాటు పెద్ద స్థాయిలో మోసాలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. యాప్ మొబైల్ నంబర్లు, డిజిటల్ ఐడెంటిటీలను దుర్వినియోగం చేస్తోంది. దీని వల్ల సైబర్ నేరస్థులు తమ నిజమైన గుర్తింపును దాచుకోగలుగుతున్నారు.

WinGo యాప్ ఎలా పనిచేస్తుంది?

టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. సైబర్ నిపుణులు WinGo ఆపరేటింగ్ మోడల్‌ను వివరించారు. ఈ యాప్ “టెలికాం మ్యూల్ యాజ్ ఎ సర్వీస్” విధానంలో పనిచేస్తుంది. సాధారణ యూజర్లను టార్గెట్ చేసి మోసం చేస్తారు. ముందుగా నేరస్థులు ఇతరుల సిమ్ కార్డులు, ఫోన్ నంబర్లను తీసుకుంటారు. వారి నెంబర్లతో ఇతరులకు నకిలీ SMS పంపుతారు. దీనివల్ల నిజమైన మోసగాళ్లు తమ గుర్తింపుని దాచి ఈజీగా దోచుకుంటారని పోలీసులు హెచ్చరిస్తున్నారు. యూజర్లు అసలు ఏమీ తెలియకుండానే జరిగే మోసంలో సాధనాలుగా మారిపోతున్నారు.

సులభంగా డబ్బు సంపాదించవచ్చని ఆశచూపి

Advertisement

దర్యాప్తు చేసే అధికారుల ప్రకారం.. WinGo యాప్ యూజర్లను త్వరగా డబ్బు సంపాదించవచ్చని ఆకర్షిస్తుంది. ప్రారంభంలో చిన్న మొత్తంలో త్వరగా లాభాలు చెల్లిస్తుంది. దీనివల్ల కొత్త యూజర్లలో నమ్మకం పెరుగుతుంది. తర్వాత యాప్ SMS సంబంధిత టాస్క్‌లు ఇస్తుంది. యూజర్లు తమ ఫోన్ నుంచి మెసేజ్‌లు పంపాలి లేదా ఫార్వర్డ్ చేయాలి. చాలా మంది మెసేజ్ కంటెంట్ గురించి తెలియకుండానే చేస్తారు. ముఖ్యమైన విషయమేమిటంటే గూగుల్ ప్లే స్టోర్‌లో వింగో యాప్ లేదు. అంటే ఈ యాప్‌కి చట్టబద్ధత లేదు, దీన్ని ఉపయోగిస్తే యూజర్ సెక్యూరిటీ ప్రమాదంలో పడినట్లే.

భారీ సంఖ్యలో SMSలు పంపి మోసం

యాప్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత రోజుకు 80 నుంచి 100 SMSలు పంపుతుంది. ఇవి యూజర్ సొంత మొబైల్ నంబర్ నుంచే వెళ్తాయి. ఎవరికి పంపుతున్నారో, ఎందుకు పంపుతున్నారో యూజర్లకు తెలియదు. పోలీసుల ప్రకారం.. ఈ SMSల ద్వారా ఫిషింగ్ లింకులు, ఫేక్ వెబ్‌సైట్లు, ఫైనాన్షియల్ మోసాలు వ్యాప్తి చేస్తున్నారు. ఇలా మోసం పెద్ద స్థాయిలో వ్యాపిస్తోంది.

ఆందోళనకరంగా టెలిగ్రామ్‌లో ప్రమోషన్

Advertisement

పోలీసులు టెలిగ్రామ్ ఛానెల్స్‌లో ఈ యాప్ భారీగా ప్రమోట్ అవుతున్నట్లు కనుగొన్నారు. కొన్ని ఛానెల్స్‌లో లక్షకు పైగా మెంబర్లు ఉన్నారు. అంటే ఇదంతా ఒక పద్ధతి ప్రకారం భారీ స్థాయిలో జరుగుతున్న మోసం. చాలా మంది తెలియకుండానే ఈ యాప్‌ ఇన్‌స్టాల్ చేసుకొని ఉండవచ్చు. వారి నంబర్లు మోసానికి ఉపయోగపడితే చట్టపరమైన ఇబ్బందులు రావచ్చు.

Also Read: మ్యాక్‌బుక్ vs విండోస్ ల్యాప్‌టాప్స్.. వీడియో ఎడిటింగ్ కోసం ఏది బెస్ట్?

ఆర్థికంగా బలహీనులను టార్గెట్ చేస్తున్న దొంగలు

స్కామర్లు ఆర్థికంగా బలహీనమైన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. అదనపు ఆదాయం కోసం చూసే వారిని ఆకర్షిస్తున్నారు. ఎక్కువ లాభాలు, గ్యారంటీడ్ రిటర్న్స్, రెఫరల్ రివార్డ్స్‌తో మోసం చేస్తున్నారు. సైబర్ అధికారులు SMS ఆధారిత ఆర్నింగ్ యాప్‌లు, మెసేజ్ ఫార్వర్డింగ్ జాబ్ ఆఫర్లను నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు.

పౌరులకు పోలీసుల సలహా

ఆన్‌లైన్‌లో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. సులభంగా డబ్బు ఇస్తామని చెప్పే యాప్‌లను పూర్తిగా ధృవీకరణ చేయకుండా డౌన్‌లోడ్ చేయవద్దు. తెలియని యాప్‌లకు SMS పర్మిషన్లు ఇవ్వవద్దు. పూర్తి నెట్‌వర్క్ దర్యాప్తు కొనసాగుతోంది. టెలిగ్రామ్ ఛానెల్స్‌పై కూడా చర్యలు తీసుకుంటారు. సైబర్ మోసాలకు వ్యతిరేకంగా పబ్లిక్ అవేర్‌నెస్ బలమైన రక్షణ అని పోలీసులు చెబుతున్నారు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×