E-Paper
Advertisement

వైర్‌లెస్ సౌండ్ సిస్టమ్స్‌తో ఇల్లు మారుమోగాల్సిందే.. టాప్ బ్రాండ్స్ లిస్ట్ మీకోసం!

వైర్‌లెస్ సౌండ్ సిస్టమ్స్‌తో ఇల్లు మారుమోగాల్సిందే.. టాప్ బ్రాండ్స్ లిస్ట్ మీకోసం!
Advertisement

Top Wireless Home Theatre Systems: ప్రస్తుత డిజిటల్ కాలంలో ఓటీటీల హవా పెరిగిపోవడంతో.. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లోనే థియేటర్ లాంటి ఎక్స్‌పీరియన్స్‌ను కోరుకుంటున్నారు. అయితే ఇల్లు మొత్తం వైర్లతో నిండిపోకుండా.. క్లీన్ అండ్ మోడర్న్ లుక్‌తో పవర్‌ఫుల్ ఆడియోను ఇచ్చే ‘వైర్‌లెస్ హోమ్ థియేటర్ సిస్టమ్స్’కు ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉంది. మార్కెట్లో దుమ్మురేపుతున్న Sony, CrossBeats వంటి టాప్ బ్రాండ్ల బెస్ట్ వైర్‌లెస్ సౌండ్ సిస్టమ్స్ వివరాలు మీకోసం.

ఇల్లాంతా సినిమా హాల్‌లా మారాల్సిందే:

సాధారణ టీవీ సౌండ్‌తో బోర్ కొట్టిన వారికి హోమ్ థియేటర్లు ఒక సరికొత్త ఊపిరిని ఇస్తాయి. మునుపటిలా స్పీకర్ల కనెక్షన్ కోసం రూమ్ అంతా వైర్లు లాగాల్సిన అవసరం లేకుండా.. లేటెస్ట్ బ్లూటూత్ , వై-ఫై టెక్నాలజీతో ఇవి పనిచేస్తాయి. యూజర్లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్న టాప్ 5 మోడల్స్ ఇవే..

1. Sony BRAVIA Theatre System 6 :

Advertisement

వైర్‌లెస్ ఆడియోలో సోనీ ఎప్పుడూ నంబర్ వన్ స్థానంలో ఉంటుంది. లేటెస్ట్ గా వచ్చిన Sony BRAVIA Theatre System 6 థియేటర్ లవర్స్‌కు ఒక విజువల్ అండ్ ఆడియో ఫీస్ట్. ఇది 1,000 W పవర్‌ఫుల్ ఔట్‌పుట్‌తో వస్తుంది. ఇందులో డాల్బీ అట్మోస్,  సపోర్ట్ ఉండటం వల్ల శబ్దాలు 3డి ఫార్మాట్‌లో మన చుట్టూ వినిపిస్తాయి. దీని ఫ్రంట్, రియర్ స్పీకర్లు పూర్తిగా వైర్‌లెస్‌గా కనెక్ట్ అవుతాయి. కాబట్టి ఇన్స్టలేషన్ చాలా ఈజీ.

2. CrossBeats Blaze B600 MAX :

Advertisement

తక్కువ ధరలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆశించే వారికి క్రాస్‌బీట్స్  బ్రాండ్ ఒక పర్‌ఫెక్ట్ ఛాయిస్. మార్కెట్ ధర దాదాపు రూ.5,999 గా ఉన్న Blaze B600 MAX ప్రస్తుతం హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. ఇది 2.1-ఛానల్ సబ్‌వూఫర్‌తో అద్భుతమైన సినిమాటిక్ సరౌండ్ సౌండ్‌ను అందిస్తుంది. ఇందులో 3 కస్టమ్ ఈక్వలైజర్ మోడ్స్‌తో పాటు బేస్ , ట్రెబుల్‌ను మనకు నచ్చినట్లు అడ్జస్ట్ చేసుకోవచ్చు.

3. Bose Smart Ultra Soundbar:

మ్యూజిక్‌లో క్రిస్టల్ క్లియర్ వోకల్స్, క్లాసిక్ లుక్ కావాలనుకునే.. వారి కోసం బోస్ బెస్ట్ ఆప్షన్. ఇది డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో పాటు అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌తో వస్తుంది. దీనిని వైర్‌లెస్ సబ్‌వూఫర్‌లతో కనెక్ట్ చేసి హోమ్ థియేటర్‌లా మార్చుకోవచ్చు.

4. CrossBeats Blaze B1100 :

రూమ్ మొత్తం బేస్ మోత మోగిపోవాలి అనుకునే వారి కోసం క్రాస్‌బీట్స్ నుంచి వచ్చిన మరో మోడల్ ఇది. డాల్బీ ఆడియో సపోర్ట్, మల్టీపోర్ట్ కనెక్టివిటీ,  ప్రీమియం ఎల్‌ఈడీ డిస్‌ప్లే దీని సొంతం. వైర్‌లెస్ బ్లూటూత్ కనెక్టివిటీ ఎంతో స్మూత్‌గా ఉంటుంది.

5. Vizio 2.1 Soundbar System :

గ్లోబల్ మార్కెట్లో బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ హోమ్ థియేటర్ ఆప్షన్‌గా ఇది నిలిచింది. కాంపాక్ట్ సైజ్ వైర్‌లెస్ సబ్‌వూఫర్‌తో చిన్న రూమ్‌లకు ఇది చాలా బాగా సెట్ అవుతుంది.

Also Read: రూ.1000 లోపు బెస్ట్ బ్లూటూత్ స్పీకర్లు.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే సౌండ్ గురూ!

కొనే ముందు ఇవి తప్పక చెక్ చేసుకోండి:

ఛానల్స్ : 2.1 ఛానల్స్ బేసిక్ సౌండ్ ఇస్తే.. 5.1 ఛానల్స్ సిస్టమ్స్ నిజమైన థియేటర్ సరౌండ్ సౌండ్‌ను అందిస్తాయి.

కనెక్టివిటీ: బ్లూటూత్‌తో పాటు HDMI (eARC), ఆప్టికల్ పోర్ట్స్ ఉంటే మీ స్మార్ట్ టీవీకి హై-క్వాలిటీ ఆడియో కనెక్ట్ అవుతుంది.

మీరు అల్టిమేట్ ప్రీమియం ఎక్స్‌పీరియన్స్ కోరుకుంటే Sony BRAVIA Theatre System 6 వైపు వెళ్ళవచ్చు. ఒకవేళ రీజనబుల్ ప్రైస్‌లో బెస్ట్ పవర్ కావాలనుకుంటే మాత్రం CrossBeats Blaze సిరీస్ సూపర్ ఛాయిస్. ఈ జూన్ నెలలో వస్తున్న ఆన్‌లైన్ డిస్కౌంట్ ఆఫర్లను ఉపయోగించుకుని మీ ఫేవరెట్ హోమ్ థియేటర్‌ను సొంతం చేసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×