E-Paper
Advertisement

రూ.1000 లోపు బెస్ట్ బ్లూటూత్ స్పీకర్లు.. తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే సౌండ్ గురూ!

రూ.1000 లోపు బెస్ట్ బ్లూటూత్ స్పీకర్లు.. తక్కువ బడ్జెట్‌లో  అదిరిపోయే సౌండ్ గురూ!
Advertisement

Best Bluetooth speakers under 1000: పాటలు వినాలంటే.. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టి హోమ్ థియేటర్లే కొనక్కర్లేదు. మన జేబులో కేవలం రూ.1000  ఉంటే చాలు, ఇల్లాంతా మారుమోగిపోయే రేంజ్‌లో లౌడ్ మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో.. ప్రీమియం ఫీచర్లను అందిస్తూ Zebronics, Mivi, Dubstep వంటి బ్రాండ్స్ దుమ్మురేపుతున్నాయి. పిక్నిక్ అయినా.. ఫ్రెండ్స్‌తో చిన్న పార్టీ అయినా సరే.. హౌస్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే బెస్ట్ బ్లూటూత్ స్పీకర్ల వివరాలు మీకోసం.

రూ. 1000 లోపు బెస్ట్ బ్లూటూత్ స్పీకర్స్:

మ్యూజిక్ లవర్స్‌కు ఒక మంచి స్పీకర్ ఉంటే ఆ కిక్కే వేరు. అయితే.. చాలా మంది మంచి సౌండ్ క్వాలిటీ కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టాలేమో అని అనుకుంటారు. కానీ.. యూజర్లు ఎక్కువగా ‘వాల్యూ ఫర్ మనీ’ గ్యాడ్జెట్స్‌ను ఇష్టపడుతున్నారు. అందుకనే బ్రాండెడ్ కంపెనీలు కూడా కేవలం వెయ్యి రూపాయల లోపే పవర్‌ఫుల్ బాస్, క్రిస్టల్ క్లియర్ ఆడియో, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీతో పోర్టబుల్ స్పీకర్లను మార్కెట్లోకి తెచ్చాయి. ఆ టాప్ బ్రాండ్ల వివరాలు..

1. Zebronics (జెబ్రోనిక్స్)-బడ్జెట్‌లో కింగ్:

Advertisement

ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ ఆడియో డివైజ్‌లకు జెబ్రోనిక్స్ కేరాఫ్ అడ్రస్. రూ. 1000 లోపు ధరలో వీరు అందించే Zebronics Zeb-County లేదా Zeb-Delight సిరీస్ స్పీకర్లు సూపర్ హిట్ అయ్యాయి. ఇవి కేవలం బ్లూటూత్ మాత్రమే కాకుండా USB, mSD కార్డ్, AUX కేబుల్, ఇన్-బిల్ట్ FM రేడియో సపోర్ట్‌తో వస్తాయి. కాంపాక్ట్ డిజైన్‌తో పాటు వీటికున్న హ్యాండ్‌స్ట్రాప్ లేదా క్యారీ లూప్ వల్ల ఎక్కడికైనా ఈజీగా పట్టుకెళ్లవచ్చు.

2. Mivi Roam సిరీస్:

మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అయిన ‘మివి’ తన అద్భుతమైన సౌండ్ సిగ్నేచర్‌తో యువతను బాగా ఆకట్టుకుంటోంది. రూ. 1000 బడ్జెట్‌లో Mivi Roam 2 ఒక అద్భుతమైన ఆప్షన్. చిన్న సైజులో ఉన్నప్పటికీ, ఇది ఇచ్చే హెవీ బాస్ , క్లియర్ వోకల్స్ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.ఇది వాటర్-రెసిస్టెంట్ ఫీచర్‌తో వస్తుంది. అంతేకాదు, ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 24 గంటల ప్లేటైమ్‌ను అందిస్తుందని కంపెనీ చెప్తోంది.

3. Dubstep (డబ్‌స్టెప్):

Advertisement

ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో తెగ ట్రెండ్ అవుతున్న సరికొత్త బ్రాండ్ ‘Dubstep’. స్టైలిష్, మోడర్న్ లుక్‌తో స్పీకర్లను డిజైన్ చేయడంలో వీరు దిట్ట. ఈ మోడల్ రూ. 1000 లోపే లభిస్తుంది. దీని ఆర్జీబీ లైటింగ్ ఎఫెక్ట్స్ రూమ్‌లో మంచి పార్టీ వైబ్‌ను క్రియేట్ చేస్తాయి. బ్లూటూత్ లేటెస్ట్ వెర్షన్‌తో వస్తుంది కాబట్టి ఎలాంటి డిలే  లేకుండా ఇన్స్టంట్‌గా కనెక్ట్ అవుతుంది.

Also Read: రోజూ ఛార్జింగ్ పెట్టే పనిలేదు.. సూర్యరశ్మితో నడిచే సరికొత్త ఓపెన్-సోర్స్ స్మార్ట్‌వాచ్ ఇదే!

స్పీకర్ కొనే ముందు ఇవి గమనించండి :

సౌండ్ ఔట్‌పుట్ : రూ. 1000 బడ్జెట్‌లో 3W నుంచి 10W లేదా 14W వరకు ఔట్‌పుట్ ఇచ్చే స్పీకర్లు దొరుకుతాయి. ఎక్కువ వాట్స్ ఉంటే సౌండ్ అంత లౌడ్‌గా వస్తుంది. కనీసం 5 నుంచి 10 గంటల బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే స్పీకర్‌ను ఎంచుకోవడం మంచిది. బ్లూటూత్‌తో పాటు SD కార్డ్ స్లాట్ లేదా AUX ఆప్షన్ ఉంటే ఫోన్ లేకుండా కూడా పాటలు వినొచ్చు.

భారీ బడ్జెట్ పెట్టకుండానే వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి లేదా గిఫ్ట్ ఇవ్వడానికి ఈ బ్లూటూత్ స్పీకర్లు పర్‌ఫెక్ట్ ఛాయిస్. ఆన్‌లైన్ సేల్స్ సమయంలో బ్యాంక్ ఆఫర్స్ వాడితే ఇవి ఇంకా తక్కువ ధరకే లభిస్తాయి. లేట్ చేయకుండా మీ ఫేవరెట్ స్పీకర్‌ను ఇప్పుడే ఆర్డర్ చేసేయండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×