E-Paper
Advertisement

ఇంకా మౌస్ వాడుతున్నారా? ఈ షార్ట్‌కట్స్ తెలిస్తే.. ల్యాప్‌టాప్ వాడకంలో మీరే తోపు!

ఇంకా మౌస్ వాడుతున్నారా? ఈ షార్ట్‌కట్స్ తెలిస్తే.. ల్యాప్‌టాప్ వాడకంలో మీరే తోపు!
Advertisement

Laptop Shortcuts: ఈ రోజుల్లో ఆఫీస్ ఉద్యోగులైనా, విద్యార్థులైనా ల్యాప్‌టాప్ వాడకం సర్వసాధారణం అయిపోయింది. అయితే చాలామంది తమ రోజువారీ పనుల కోసం మౌస్‌పైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. దీనివల్ల టైం వేస్ట్ అవ్వడమే కాకుండా పని వేగం కూడా తగ్గుతుంది. అలా కాకుండా ల్యాప్‌టాప్‌లో కొన్ని స్మార్ట్ కీబోర్డ్ షార్ట్‌కట్స్‌ను నేర్చుకుంటే.. గంటల తరబడి చేసే పనిని కేవలం నిమిషాల్లోనే పూర్తి చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పనిని సులభతరం చేసే ఆ 5 అద్భుతమైన షార్ట్‌కట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

ట్యాబ్స్ మళ్లీ ఓపెన్ చేయడానికి

బ్రౌజర్‌లో ఏదైనా పని చేస్తున్నప్పుడు పొరపాటున కొన్ని ట్యాబ్స్‌ను క్లోజ్ చేస్తుంటాం. అలాంటప్పుడు మళ్లీ హిస్టరీలోకి వెళ్లి వెతుక్కునే పని లేకుండా ఓ షార్ట్ కట్ ఉపయోగపడుతుంది. దానిని అప్లై చేస్తే క్లోజ్ అయిన ట్యాబ్స్ వెంటనే తిరిగి ఓపెన్ అవుతాయి. ఇందుకోసం Ctrl + Shift + T ప్రెస్ చేయాలి. ఒకవేళ మాక్ బుక్ అయితే Cmd + Shift + T నొక్కితే సరిపోతుంది.

క్లిప్ బోర్డ్ హిస్టరీ ఫీచర్

Advertisement

ల్యాప్ టాప్ లో వర్క్ చేసేటప్పుడు చాలా మంది అవసరమైన కంటెంట్ ను కాపీ (Ctrl + C) చేసి మరోచోట పేస్ట్ (Ctrl + V) చేస్తుంటారు. అయితే ఆ వెంటనే మరో కంటెంట్ కాపీ చేస్తే.. అంతకుముందు చేసింది ఆటోమేటిగ్గా డిలీట్ అవుతుందన్న సంగతి తెలిసిందే. కానీ గతంలో కాపీ చేసిన.. 10-15 కంటెంట్ లిస్ట్ మొత్తం ఒకేచోట చూడాలనుకుంటే క్లిప్‌బోర్డ్ హిస్టరీ ఫీచర్ ఉపయోగపడుతుంది. దీనికోసం Windows Key + V షార్ట్ కట్ కీ ప్రెస్ చేయాలి.

ఒకేసారి రెండు పనులు

యూట్యూబ్ చూస్తూ నోట్స్ రాసుకోవాలన్నా, రెండు వేర్వేరు ఫైల్స్ చూస్తూ డేటా ఎంటర్ చేయాలన్నా.. ల్యాప్ టాప్ స్క్రీన్‌ను రెండు భాగాలుగా విభజించడం చాలా అవసరం. ఇందుకోసం కొందరు మౌస్‌తో విండోలను అడ్జస్ట్ చేస్తుంటారు. ఈ అవసరం లేకుండా షార్ట్ కట్ కీస్ ఉపయోగించి.. ఈజీగా స్క్రీన్ ను స్ప్లిట్ చేయవచ్చు. దీనికోసం Windows Key + Left Arrow లేదా Right Arrow క్లిక్ చేయాలి.

స్క్రీన్‌షాట్లను తీసే టూల్

Advertisement

ల్యాప్‌టాప్ స్క్రీన్ మొత్తాన్ని కాకుండా అందులో కావాల్సిన నిర్దిష్ట భాగాన్ని మాత్రమే కట్ చేసి స్క్రీన్‌షాట్ తీయడానికి విండోస్ ‘స్నిప్పింగ్ టూల్’ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ షార్ట్‌కట్ నొక్కగానే స్క్రీన్ బ్లర్ అవుతుంది. అప్పుడు మీకు నచ్చినంత మేర సెలెక్ట్ చేసుకుని స్క్రీన్‌షాట్ సేవ్ చేసుకోవచ్చు. దీనికోసం Windows Key + Shift + S ఉపయోగపడుతుంది.

Also Read: ఏసీ బాక్స్‌కు దుమ్ముపట్టిందా? నేరుగా నీళ్లతో కడగొచ్చా? లేదా? షాకింగ్ నిజాలు!

సెకన్లలో అప్లికేషన్స్ మినిమైజ్

ల్యాప్ టాప్ వాడే సమయంలో చాలా మంది 10 నుంచి 12 విండోస్ ఒకేసారి ఓపెన్ చేసి పెడతారు. ఈ క్రమంలో ఒక్కసారిగా హోమ్ స్క్రీన్ చూడాల్సి వస్తే.. అన్ని విండోలను ఒక్కొక్కటిగా మినిమైజ్ చేయడం పెద్ద తలనొప్పిగా మారొచ్చు. దీనికి షార్ట్‌కట్ కీస్ వాడి.. అన్ని అప్లికేషన్లు ఒకే సెకన్లలో మినిమైజ్ అయిపోయేలా చేయవచ్చు. నేరుగా డెస్క్ టాప్ స్క్రీన్ మీదకు ఎంటర్ అవ్వొచ్చు. దీనికోసం Windows Key + D షార్ట్ కట్ కీని ప్రెస్ చేయాల్సి ఉంటుంది.

Also Read: ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×