E-Paper
Advertisement

ఏసీ బాక్స్‌కు దుమ్ముపట్టిందా? నేరుగా నీళ్లతో కడగొచ్చా? లేదా? షాకింగ్ నిజాలు!

ఏసీ బాక్స్‌కు దుమ్ముపట్టిందా? నేరుగా నీళ్లతో కడగొచ్చా? లేదా? షాకింగ్ నిజాలు!
Advertisement

AC Cleaning: ప్రస్తుతం ఇళ్లల్లో ఏసీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే చాలామంది ఏసీ ఇండోర్ యూనిట్ క్లీనింగ్ పై చూపించే శ్రద్ద అవుట్ డోర్ యూనిట్ పై చూపించరు. బయట ఉండే ఏసీ బాక్స్ ‌ను అస్సలు పట్టించుకోరు. దీంతో దానిపై దుమ్ము, ధూళి పేరుకుపోవడం వల్ల ఏసీ కూలింగ్ తగ్గిపోవడమే కాకుండా కరెంట్ బిల్లు కూడా తడిసి మోపెడవుతుంది. మరి ఏసీ అవుట్ డోర్ యూనిట్ ను నేరుగా నీటితో కడగవచ్చా? లేదా? సందేహం సహజంగానే ఉత్పన్నమవుతుంది. ఈ నేపథ్యంలో నిపుణులు సూచిస్తున్న క్లీనింగ్ పద్దతులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

నీటితో కడగొచ్చా? లేదా?

సాధారణంగా ఏసీ ఔట్‌డోర్ యూనిట్లు వర్షం, ఎండ, గాలి వంటి అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా డిజైన్ చేస్తారు. కాబట్టి దానిపై నీళ్లు చల్లడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే, నీటితో శుభ్రం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Advertisement

ఔట్‌డోర్ యూనిట్‌ను క్లీన్ చేయడానికి ముందు ఏసీ మెయిన్ స్విచ్‌ను పూర్తిగా ఆఫ్ చేయాలి. ప్లగ్ తీసేయడం ఇంకా బెటర్. మరోవైపు కార్లు కడిగే హై-ప్రెజర్ వాటర్ గన్‌లను ఏసీ బాక్స్ పై అస్సలు వాడకూడదు. దీనివల్ల లోపల ఉండే సెన్సిటివ్ అల్యూమినియం ఫిల్మ్‌లు వంగిపోయే ఛాన్స్ ఉంది. అలాగే ఔట్‌డోర్ యూనిట్ పక్కన ఉండే ఎలక్ట్రికల్ వైరింగ్ కనెక్షన్లపై నీటిని నేరుగా స్ప్రే చేయకుండా జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.

కూలింగ్ పెరగాలంటే ఎలా క్లీన్ చేయాలి?

ఏసీ అవుట్ డోర్ యూనిట్ కూలింగ్ పై ప్రభావం చూపుతుందన్న సంగతి తెలిసిందే. కాబట్టి స్మార్ట్ క్లీనింగ్ పద్దతులు అవలంభిస్తే ఏసీ కూలింగ్ గతంలో కంటే మరింత మెరగవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ముందుగా అవుట్ డోర్ యూనిట్ చుట్టూ పేరుకుపోయిన ఆకులు, చెత్తాచెదారం, ప్లాస్టిక్ కవర్లను తీసేయాలని హితవు పలుకుతున్నారు. . యూనిట్ చుట్టూ కనీసం రెండు అడుగుల స్థలం ఖాళీగా ఉండేలా చూడండి. నీటితో కడిగిన తర్వాత కనీసం 1 నుండి 2 గంటల పాటు ఏసీని ఆన్ చేయవద్దని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తర్వాతే ఆన్ చేయాలని సూచిస్తున్నారు.

Advertisement

Also Read: Hyderabad: ‘SIR’ అంశంపై సీఎం రేవంత్ ఆగ్రహం.. పార్టీ నేతలకు సీరియస్ వార్నింగ్

క్లీనింగ్ బెనిఫిట్స్?

ఏసీ అవుట్ డోర్ యూనిట్ కాయిల్స్ శుభ్రంగా ఉంటే వేడి గాలి త్వరగా బయటకు పోయి గది వేగంగా చల్లబడుతుంది. కంప్రెసర్‌పై భారం తగ్గడం వల్ల విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతుంది. క్రమం తప్పకుండా క్లీన్ చేయడం వల్ల ఏసీ రిపేర్లు రాకుండా ఎక్కువ కాలం ఏసీ మన్నికగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. సీజన్‌కు ఒక్కసారైనా ఇలా అవుట్ యూనిట్ ను క్లీన్ చేసుకుంటే ఏసీ సూపర్ కూలింగ్ ఇవ్వడం ఖాయమని పేర్కొంటున్నారు.

Also Read: మరో వివాదంలో చిక్కుకున్న స్టార్ హీరో జయం రవి.. పనిమనుషుల బంధించి..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×