E-Paper
Advertisement

సౌండ్ అస్సలు రాదు! నిశ్శబ్దంగా బట్టలు ఉతికే.. టాప్ వాషింగ్ మెషీన్స్ ఇవే!

సౌండ్ అస్సలు రాదు! నిశ్శబ్దంగా బట్టలు ఉతికే.. టాప్ వాషింగ్ మెషీన్స్ ఇవే!
Advertisement

Best silent washing machine india: ఇంట్లో వాషింగ్ మెషీన్ ఆన్ చేయగానే.. హెలికాప్టర్ ల్యాండ్ అయినట్లు పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయా? ఆ సౌండ్‌తో టీవీ వాల్యూమ్ పెంచాల్సి రావడం, ఇంట్లో ప్రశాంతత పాడవడం మనలో చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లమే. కానీ.. ప్రస్తుత మోడ్రన్ టెక్నాలజీతో వస్తున్న లేటెస్ట్ వాషింగ్ మెషీన్లు అస్సలు శబ్దం చేయకుండా చాలా నిశ్శబ్దంగా పని పూర్తి చేస్తాయి. మీ నిద్రను, ప్రశాంతతను అస్సలు డిస్టర్బ్ చేయని టాప్ 5 సైలెంట్ వాషింగ్ మెషీన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. IFB Fully Automatic Front Load Washing Machine:
ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లలో IFB బ్రాండ్‌కు తిరుగులేదు. ఇందులో ఇచ్చే ‘ట్రైషీల్డ్ ప్రొటెక్షన్’ , ‘ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ మోటార్’ వల్ల మెషీన్ తిరిగేటప్పుడు వైబ్రేషన్స్ చాలా వరకు తగ్గుతాయి. ఐఎఫ్బీ లోని అడ్వాన్స్‌డ్ యాంటీ-వైబ్రేషన్ డిజైన్ కారణంగా హై-స్పీడ్ స్పిన్నింగ్‌లో కూడా శబ్దం అస్సలు బయటకు రాదు. పైగా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌తో రావడం వల్ల బట్టల బరువును బట్టి వాటర్, డిటర్జెంట్‌ను అదే సెలెక్ట్ చేసుకుంటుంది.

Advertisement

2. LG Fully Automatic Front Load Washing Machine:
ఎల్జీ వాషింగ్ మెషీన్స్ అనగానే.. గుర్తొచ్చేది వాటి మన్నిక. సాధారణంగా వాషింగ్ మెషీన్లలో బెల్ట్ సాయంతో.. డ్రమ్ తిరుగుతుంది. దీని వల్ల ఎక్కువ సౌండ్ వస్తుంది. కానీ ఎల్జీ తన ప్రీమియం మోడల్స్‌లో AI Direct Drive టెక్నాలజీని వాడుతోంది. అంటే మోటార్ నేరుగా డ్రమ్‌కు కనెక్ట్ అయి ఉంటుంది. బెల్ట్ లేకపోవడం వల్ల ఘర్షణ తగ్గి, మెషీన్ నడుస్తున్నప్పుడు సూపర్ సైలెంట్‌గా ఉంటుంది. రాత్రి పూట బెడ్‌రూమ్ పక్కన ఈ మెషీన్ ఆన్ చేసినా మీకు అస్సలు శబ్దం వినపడదు.

3.Samsung Inverter EcoBubble Front Load Machine:
శాంసంగ్ లోని ‘డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ’ తక్కువ శబ్దంతో.. పాటు కరెంట్ బిల్లును కూడా భారీగా ఆదా చేస్తుంది. ఇందులో.. ఉండే ‘VRT Plus'(Vibration Reduction Technology)ఒక అద్భుతం. ఇది మెషీన్ లోపల ఉండే డ్రమ్ బ్యాలెన్స్‌ను ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేస్తూ వైబ్రేషన్స్‌ను అణచివేస్తుంది. దీని వల్ల వాషింగ్ ,స్పిన్నింగ్ టైమ్‌లో ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. స్మార్ట్ థింగ్స్ యాప్‌తో దీనిని ఫోన్ నుంచే కంట్రోల్ చేయవచ్చు.

Advertisement

4. Bosch Fully Automatic Front Load Washing Machine:
జర్మన్ టెక్నాలజీతో వచ్చే బాష్ వాషింగ్ మెషీన్లు వాటి ‘AntiVibration Side Panels’కు ఫేమస్. మెషీన్ సైడ్ గోడలపై.. ఉండే ప్రత్యేకమైన డిజైన్ స్టెబిలిటీని పెంచి శబ్దాన్ని లోపలే లాగేసుకుంటుంది. ఇందులో ఉండే ‘EcoSilence Drive’ మోటార్ బ్రష్‌లు లేకుండా పనిచేస్తుంది. అందువల్ల వేడి తగ్గడమే కాకుండా సౌండ్ లెవెల్స్ చాలా తక్కువగా (సుమారు 48 డెసిబెల్స్) ఉంటాయి. ఇది లైబ్రరీలో ఉండేటంత ప్రశాంతతను ఇస్తుంది.

5. Panasonic Inverter Top Load Washing Machine:
ఫ్రంట్ లోడ్ మాత్రమే కాదు, బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండే టాప్ లోడ్ మోడల్స్ లో కూడా ఇప్పుడు నిశ్శబ్దంగా పని చేసే ఆప్షన్స్ ఉన్నాయి. పానాసోనిక్ స్మార్ట్ ఇన్వర్టర్ టాప్ లోడ్ మెషీన్ తక్కువ వైబ్రేషన్‌తో స్మూత్‌గా రన్ అవుతుంది. దీని స్లీక్ మోడ్రన్ డిజైన్ తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తుంది. బడ్జెట్ పరిధిలో.. సైలెంట్ అండ్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

Also Read:  Pigeon నుంచి Milton వరకు.. బెస్ట్ ఎలక్ట్రిక్ కెటిల్స్ మీ బడ్జెట్‌లోనే!

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికైనా నిశ్శబ్దంగా పని చేసే హోమ్ అప్లయెన్సెస్ చాలా ముఖ్యం. ఇన్వర్టర్ , డైరెక్ట్ డ్రైవ్ మోటార్ ఉన్న వాషింగ్ మెషీన్లు ఎక్కువ కాలం మన్నడమే కాకుండా మనసుకు ప్రశాంతతను ఇస్తాయి. పైన పేర్కొన్న 5 బ్రాండెడ్ వాషింగ్ మెషీన్లు ప్రస్తుతం మార్కెట్లో బెస్ట్ రేటింగ్‌తో ట్రెండ్ అవుతున్నాయి. మీ బడ్జెట్, కెపాసిటీ అవసరాలకు సరిపోయే ఒక సైలెంట్ వాషింగ్ మెషీన్‌ను ఎంచుకుని మీ ఇంటిని ప్రశాంతంగా మార్చుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×