// // Instagram Algorithm| ఇన్‌స్టాగ్రామ్‌లో అవనసర రీల్స్‌కు చెక్..‌ మీరు కోరుకున్నవి మాత్రమే చూడాలంటే ఇలా చేయండి -->
E-Paper
Advertisement

Instagram Algorithm: ఇన్‌స్టాగ్రామ్‌లో అనవసర రీల్స్‌కు చెక్..‌ మీరు కోరుకున్నవి మాత్రమే చూడాలంటే ఇలా చేయండి

Instagram Algorithm: ఇన్‌స్టాగ్రామ్‌లో అనవసర రీల్స్‌కు చెక్..‌ మీరు కోరుకున్నవి మాత్రమే చూడాలంటే ఇలా చేయండి
Advertisement

Instagram Algorithm Customize| చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ “ఎప్పుడూ ఒకే రకం వీడియోలే ఎందుకు వస్తాయి?” అని ఫీల్ అయ్యేవాళ్లు. డ్యాన్స్ చూస్తే డ్యాన్స్, ఫుడ్ చూస్తే ఫుడ్ రీల్స్ మాత్రమే ఎక్కువగా కనిపించేవి. ఒక్కసారి ఒక టాపిక్ రీల్ వీడియోలు చూస్తే అదే కేటగిరీ రీల్స్ రోజంతా కనిపిస్తాయి. మరికొన్ని సార్లు అసభ్యకర రీల్స్ కనిపిస్తుంటాయి. చాలా కాలంగా యూజర్లు ఈ సమస్యతో సతమతమయ్యేవారు. కానీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఈ సమస్యని పరిష్కరించింది. మీరు ఏ రీల్స్ చూడాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోవచ్చు. అందుకోసం కొత్త ఫీచర్ తీసుకొచ్చింది.

కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుంది?

ఇన్‌స్టాగ్రామ్ ఇప్పుడు యూజర్ల కోసం రీల్స్ ట్యాబ్‌లోనే ఒక కొత్త బటన్ ఇచ్చింది. దాన్ని నొక్కితే మీకు ఇష్టమైన టాపిక్స్, ఇష్టం లేని టాపిక్స్ యాడ్ చేయడం లేదా తొలగించడం చేయొచ్చు. మీరు ఏ టాపిక్ ఎంచుకుంటే ఆ రకం రీల్స్ ఎక్కువగా వస్తాయి. ఏదైనా టాపిక్ తొలగిస్తే ఆ రకం వీడియోలు తగ్గిపోతాయి. AI సాయంతో ఇదంతా చాలా సులువుగా జరుగుతుంది.

ఈ ఫీచర్ ఎలా ఉపయోగించాలి?

  • ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి రీల్స్ ట్యాబ్‌కి వెళ్లండి
  • పైన కుడి వైపు కార్నర్‌లో కొత్తగా కన్నులాగా కనిపించే ఐకాన్ ఉంటుంది. (రెండు లైన్స్, గుండెలు ఉన్నాయి)
  • దాన్ని నొక్కండి – “Suggested Topics” మెనూ వస్తుంది
  • మీకు నచ్చిన టాపిక్స్ జోడించండి (ఉదాహరణకు.. ట్రావెల్, కుకింగ్, ఫిట్‌నెస్ ఇలాంటివి)
  • ఇష్టం లేనివి తొలగించండి
  • అంతే! ఇక మీ రీల్స్ ఫీడ్ మీరు కోరుకున్నట్లుగా మారిపోతుంది.

మీకు నచ్చే రీల్స్ కూడా షేర్ చేయొచ్చు!

Advertisement

ఈ కొత్త ఫీచర్‌లో మరో సర్‌ప్రైజ్ ఉంది. మీరు ఎంచుకున్న టాపిక్స్ లిస్ట్‌ని స్టోరీలో పోస్ట్ చేయొచ్చు. మీ ఫాలోవర్స్ అందరూ మీకు ఎలాంటి రీల్స్ ఇష్టమో వాటిని ఆసక్తికరంగా చూస్తారు. ఇది చాలా ఫన్ ఫీచర్!

Also Read: స్వయంగా పనులన్నీ చేసే ఫోన్ లాంచ్.. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏజెంటిక్ AI  స్మార్ట్‌ఫోన్.. టచ్ చేయాల్సిన అవసరం లేదు

ఈ ఫీచర్ అందరికీ కాదు

Advertisement

ప్రస్తుతానికి ఈ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాలేదు. ముందు అమెరికాలో కొంతమంది యూజర్లకి మాత్రమే వచ్చింది. త్వరలో ఇంగ్లీష్ మాట్లాడే దేశాలన్నీ, తర్వాత ప్రపంచవ్యాప్తంగా రానుంది. ఎక్స్‌ప్లోర్ పేజీ, ఇతర సెక్షన్స్‌కి కూడా ఈ ఫీచర్ వస్తుందని ఇన్‌స్టాగ్రామ్ తెలిపింది.
ఇకపై రీల్స్ ఫీడ్ మీ చేతుల్లోనే ఉంది. మీకు నచ్చిన కంటెంట్ మాత్రమే చూడండి, బోర్ కొట్టే వీడియోలు రాకుండా సెట్ చేసుకోండి!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×