E-Paper
Advertisement

హద్దులు దాటుతున్న మోడ్రన్ ట్రెండ్.. వస్త్రధారణపై సింగర్ సునీత ప్రాక్టికల్ కామెంట్స్!

హద్దులు దాటుతున్న మోడ్రన్ ట్రెండ్.. వస్త్రధారణపై సింగర్ సునీత ప్రాక్టికల్ కామెంట్స్!
Advertisement

Sunitha comments: తెలుగు చిత్ర పరిశ్రమలో తన మధురమైన గాత్రంతోనే కాకుండా, హుందాతనానికి నిలువెత్తు రూపంగా నిలిచే ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సునీత తాజాగా మహిళల వస్త్రధారణ, సమాజం చూసే దృక్పథంపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. మారుతున్న కాలంతో పాటు మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్స్, సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఆమె పంచుకున్న అభిప్రాయాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి.

Read also-‘అక్కడ బెస్ట్.. ఇక్కడ ఇంకా బాకీ ఉంది!’.. గ్లోబల్ వేదికపై వైరల్ కామెంట్లు చేసిన ప్రియాంక!

చూపు మార్చడం కంటే..

Advertisement

సమాజంలో మహిళల భద్రత, వారిపై వచ్చే కామెంట్ల గురించి సునీత ఎంతో ప్రాక్టికల్ గా మాట్లాడారు. “నేను ఎలాంటి బట్టలు వేసుకున్నా, సమాజం నన్ను సాధారణంగానే చూడాలి అని పట్టుబట్టి కూర్చుంటే.. మనకు నచ్చినట్టు ఇక్కడ ఎవరూ చూడరు. అవతలి వాడి చూపును మార్చడం కంటే, మనల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా సులువైన పని” అని సునీత స్పష్టం చేశారు. సమాజంలో రకరకాల మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఉంటారని, లక్షలాది మంది ఆలోచనలను మార్చడం మన చేతుల్లో లేని పని అని ఆమె అభిప్రాయపడ్డారు.

అది మన సంస్కృతి కాదు

వెస్ట్రన్ కల్చర్ వైపు మొగ్గు చూపుతున్న నేటి తరం వస్త్రధారణపై స్పందిస్తూ.. “లక్షల మంది విషయాలను చూసే విధానాన్ని మనం మార్చలేము. అలాగే కొన్ని రకాల బట్టలు ధరించడం అనేది మన సంస్కృతిలో భాగం కాదు” అని సునీత పేర్కొన్నారు. ఫ్యాషన్ అనేది వ్యక్తిగత ఇష్టమే అయినప్పటికీ, మనం జీవిస్తున్న సమాజం, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని కూడా గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement

Read also-Intinti Ramayanam Today Episode: మీనాక్షిని అవమానించిన పల్లవి..మీనాక్షికి నిజం చెప్పిన అవని.. సెంటిమెంట్ సీన్..

చేదు నిజాన్ని ఒప్పుకోవాల్సిందే

సునీత వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం మహిళలకు ఆంక్షలు విధించడం కాదు, సమాజంలో ఉన్న చేదు నిజాన్ని (Reality) గుర్తు చేయడం మాత్రమే. ఎదుటివారి చూపును, ప్రవర్తనను మనం కంట్రోల్ చేయలేనప్పుడు, ఒక మహిళగా మన భద్రత కోసం మనమే స్వయంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం బుద్ధిమంతం అని ఆమె వివరించారు. ప్రస్తుతం సునీత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఆమె చెప్పిన విషయాలు నేటి సమాజానికి ఎంతో ప్రాక్టికల్ గా అవసరమైనవిగా ఉన్నాయంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు.

Related News

దుల్కర్ సల్మాన్ కు చుక్కెదురు..కార్ స్మగ్లింగ్ కేసులో అలాంటి ప్రశ్నలు!

ఘనంగా జాన్వీకపూర్ సోదరి పెళ్లి.. ముహూర్తం ఫిక్స్.. కాక్ టెయిల్ పార్టీ ఎప్పుడంటే?

సీఎం విజయ్ జననాయగన్ కు తప్పని తిప్పలు.. మళ్లీ సెన్సార్ షాక్!

రామాయణ టీమ్ కి భారీ షాక్.. 11 సెకండ్ల వీడియో లీక్!

Theater Releases : ఈ వారం బాక్సాఫీస్ వార్ తప్పదా..? పోటీ మాములుగా లేదు..

Hero Nani : హీరో నాని చేతికి గాయాలు.. షాక్ లో ఫ్యాన్స్.. అసలేం జరిగిందంటే..?

కనులపండుగగా మెహర్ రమేష్ కుమార్తె వివాహ రిసెప్షన్.. తరలివచ్చిన టాలీవుడ్ అగ్ర తారలు!

పద్మశ్రీ అందుకున్న తొలి కమెడియన్.. రేలంగి వెనుక ఉన్న ఈ కన్నీటి గాథ తెలుసా?

Big Stories

Advertisement
×