E-Paper
Advertisement

SBI YONO 2.0: ఫోన్‌పే, గూగుల్ పే‌కు సవాల్.. యుపిఐ రంగంలోకి ఎస్‌బిఐ ఎంట్రీ

SBI YONO 2.0: ఫోన్‌పే, గూగుల్ పే‌కు సవాల్.. యుపిఐ రంగంలోకి ఎస్‌బిఐ ఎంట్రీ
Advertisement

SBI YONO 2.0| దేశంలో డిజిటల్ పేమెంట్స్ కు మారుపేరుగా యుపిఐ టెక్నాలజీ అవతరించింది. కోవిడ్ సమయంలో పేటిఎం, ఫోన్‌పే, గూగుల్ పే లాంటి ప్లాట్‌ఫామ్స్ యుపిఐ టెక్నాలజీని ప్రజలకు మరింత చేరువ చేశాయి. ఆ తరవాత నుంచి క్రమంగా లక్షల కోట్ల బిజినెస్ యుపిఐ లావాదేవీల ద్వారా సాగుతోంది.

ఇప్పటికే ఈ రంగంలో పేటిఎం, ఫోన్‌పే, గూగుల్ పే ప్రధాన ప్లేయర్లుగా ఉండగా.. భారత్ పే, ఎయిర్‌టెల్ పే, హెచ్‌డిఎఫ్‌సి లాంటి ఇతర ప్లాట్‌ఫామ్స్ కూడా ఉన్నాయి. అయితే వీటన్నింటికీ పోటీకి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) బరిలోకి దిగింది.

Advertisement

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా YONO 2.0ని అధికారికంగా లాంచ్ చేసింది. ఇది పాత YONO డిజిటల్ బ్యాంకింగ్ సర్వీస్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్. దాదాపు 8 ఏళ్ల క్రితం మొదటి YONO వచ్చింది. ఇప్పుడు YONO 2.0తో లక్షలాది కస్టమర్లకి మరింత వేగవంతమైన, సులువైన, కనెక్టెడ్ బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని SBI లక్ష్యం.

యూనిఫైడ్ బ్యాంకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఏమిటి?

YONO 2.0 ద్వారా ఎస్‌బిఐ.. మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లను ఏకీకృతం చేసింది. ఒకే బ్యాక్‌ఎండ్ సిస్టమ్ ఉంటుంది. అన్ని డివైస్‌లలో ఒకేలా సర్వీస్ దొరుకుతుంది. సురక్షితంగా, పర్సనలైజ్డ్ సర్వీస్ ఇస్తుంది. కస్టమర్లకి సులువైన అనుభవం కల్పిస్తుంది.

కస్టమర్ ప్రాసెస్ సులువైందా?

Advertisement

కొత్త వెర్షన్‌లో KYC ప్రాసెస్ చాలా సులువైంది. వేర్వేరు సర్వీస్‌లకి రిపీట్ వెరిఫికేషన్ అవసరం లేదు. డిజిటల్ ఆన్‌బోర్డింగ్ సులువు అయింది. ప్రస్తుతానికి ఇంగ్లీష్, హిందీ భాషలలో మాత్రమే యోనో 2.0 సేవలు ఉన్నాయి. త్వరలోనే 15 భారతీయ భాషలు జోడిస్తారు. కార్బన్ ఫుట్‌ప్రింట్ ట్రాకింగ్ లాంటి సస్టైనబిలిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి.

SBI లక్ష్యాలు ఇవే..

ప్రస్తుతం YONOకి 96 మిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ సంఖ్యని రెట్టింపు చేసి 200 మిలియన్‌కి తీసుకెళ్లాలని లక్ష్యం. కొత్త అకౌంట్స్ ఓపెనింగ్, ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్స్.. ఇవన్నీ YONO ద్వారానే జరుగుతున్నాయి. డిజిటల్ ఎకోసిస్టమ్ మరింత బలోపేతం చేయాలని ప్లాన్.

డిజిటల్ సపోర్ట్ ఎలా పెరుగుతుంది?

ప్రస్తుతం 3,500 డిజిటల్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు. వాళ్లు బ్రాంచ్‌లలో కస్టమర్లకి డిజిటల్ సర్వీస్‌లు నేర్పిస్తారు. 2026 నాటికి ఈ సంఖ్యని 10,000కి పెంచుతారు. కొత్త రిక్రూట్‌మెంట్స్ ఉంటాయి. దేశవ్యాప్తంగా డిజిటల్ బ్యాంకింగ్ సర్వీస్ ప్రజల్లో వేగంగా తీసుకెళ్లాలనేది ఎస్‌బిఐ లక్ష్యం.

Also Read: సిసిటివి అవసరం లేదు.. మీ పాత ఫోన్‌‌‌తో సెక్యూరిటీ కెమెరా తయారు.. చాలా ఈజీ

డిజిటల్ పేమెంట్స్‌లో పోటీ ఇస్తుందా?

YONO 2.0 డిజిటల్ పేమెంట్స్ మార్కెట్‌లో GPay, PhonePeలకు డైరెక్ట్ పోటీ ఇస్తుంది. బ్యాంక్ ఆధారిత యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్.. బ్యాంకింగ్, పేమెంట్స్ రెండూ ఒక్కచోట. థర్డ్ పార్టీ యాప్స్ కంటే సురక్షితమైన ఆప్షన్ ఇస్తుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×