E-Paper
Advertisement

MGNREGA Name Change: ఉపాధి హామీ పేరు మార్పుపై భగ్గుమన్న కాంగ్రెస్.. పార్లమెంట్‌లో వినూత్న నిరసన, రేపు దేశవ్యాప్త ఆందోళన

MGNREGA Name Change: ఉపాధి హామీ పేరు మార్పుపై భగ్గుమన్న కాంగ్రెస్.. పార్లమెంట్‌లో వినూత్న నిరసన, రేపు దేశవ్యాప్త ఆందోళన
Advertisement

MGNREGA Name Change: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పేరు మార్చాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని నిరసిస్తూ మంగళవారం పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు ఎంపీలు నినాదాలు చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలకు అన్నం పెట్టే పథకానికి గాంధీజీ పేరు తీసేసి, ‘జీరాంజీ’ అని పేరు పెట్టడం సరికాదన్నారు. పథకానికి కులమతాలను అంటగట్టడం, గాంధీజీని మరుగున పరచాలనుకోవడం తగదని హితవు పలికారు.

పైకప్పు ఎక్కి ఎంపీల ఆందోళన

నిరసనలో భాగంగా కుమారి సెల్జా, ప్రణీతి షిండేతో సహా పలువురు విపక్ష ఎంపీలు పాత పార్లమెంట్ హౌస్ గేట్ నంబర్-1 పైకప్పు ఎక్కి ప్లకార్డులతో నిరసన తెలిపారు. మరోవైపు, ఈ అంశంపై స్పందించిన ఎంపీ ప్రియాంక గాంధీ.. కేవలం పేరు మార్పు వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని, ఇది ప్రజాధనం వృథా తప్ప మరొకటి కాదని విమర్శించారు.

గాడ్సే వారసులని నిరూపించుకుంటున్నారు: మంత్రి పొన్నం

Advertisement

ఈ పరిణామాలపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్‌లో తీవ్రంగా స్పందించారు. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకే కేంద్రం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. 40 శాతం నిధుల భారాన్ని రాష్ట్రాలపై మోపుతూ, ఫెడరల్ స్ఫూర్తిని మోదీ సర్కార్ దెబ్బతీస్తోందని మండిపడ్డారు. గాంధీ పేరును తొలగించడం ద్వారా బీజేపీ నేతలు తాము గాడ్సే వారసులమని నిరూపించుకుంటున్నారని పొన్నం ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రేపు దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపు: కేసీ వేణుగోపాల్

ఉపాధి హామీ చట్టాన్ని తుదముట్టించాలనే కేంద్ర ప్రభుత్వ కుట్రను అడ్డుకునేందుకు దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. రేపు (డిసెంబర్ 17న) అన్ని జిల్లా కేంద్రాలలో దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే, డిసెంబర్ 28న కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం నాడు ప్రతి మండలం, గ్రామంలో మహాత్మా గాంధీ చిత్రపటాలతో నిరసనలు చేపడతామని వెల్లడించారు. ఇది కేవలం ఒక బిల్లును వ్యతిరేకించడం మాత్రమే కాదని, కోట్లాది మంది గ్రామీణ పేదల మనుగడ, గౌరవం, ఆశలకు సంబంధించిన పోరాటమని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Read Also: CM Revanth Reddy: హైదరాబాద్‌కు ఐఐఎం మంజూరు చేయండి.. కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×