E-Paper
Advertisement

Samsung Price Hike: న్యూ ఇయర్‌లో ఫ్యాన్స్‌‌కు గట్టి షాక్ ఇవ్వబోతున్న శాంసంగ్.. గెలాక్సీ S26 సిరీస్ ధరలో భారీ పెంపు

Samsung Price Hike: న్యూ ఇయర్‌లో ఫ్యాన్స్‌‌కు గట్టి షాక్ ఇవ్వబోతున్న శాంసంగ్.. గెలాక్సీ S26 సిరీస్ ధరలో భారీ పెంపు
Advertisement

Samsung Price Hike| శామ్‌సంగ్ తన తదుపరి ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికి శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్ ఫోన్లు లాంచ్ చేసింది. అందుకే రాబోయే సిరీస్ శామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్‌గా పిలువబడుతుంది. ముందస్తు రిపోర్ట్స్ ప్రకారం.. ఈ ఫోన్‌లు ఎక్కువ ధరలతో లాంచ్ అవుతాయి. ఈ వార్త చాలా శామ్‌సంగ్ ఫ్యాన్స్‌ను నిరాశపరచవచ్చు. గెలాక్సీ S26 సిరీస్ విడుదల గురించి ఇప్పటికే భారీ బజ్ నెలకొంది. అధికారిక లాంచ్ ముందు లీక్స్, రిపోర్ట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ధరల అంచనాలు ఇప్పుడు అంత ఫ్రెండ్లీగా కనిపించడం లేదు.

గెలాక్సీ S26 సిరీస్‌లో ఏ మోడల్స్ రావచ్చు?

సామ్‌సంగ్ ఈ సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్‌లను ఇంట్రడ్యూస్ చేయవచ్చు. ఇవి గెలాక్సీ S26, గెలాక్సీ S26+, గెలాక్సీ S26 అల్ట్రా. కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి సిరీస్ స్ట్రాటజీనే అనుసరిస్తోంది. శామ్‌సంగ్ ఇంకా మోడల్ పేర్లను అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. అయితే కొత్త గెలాక్సీ సిరీస్ లో మూడు ఫోన్‌లు ఉండబోతున్నాయని రిపోర్ట్స్ సూచిస్తున్నాయి.

గెలాక్సీ S26 సిరీస్ లాంచ్ టైమ్‌లైన్

Advertisement

రిపోర్ట్స్ ప్రకారం.. శామ్‌సంగ్ గెలాక్సీ S26 సిరీస్‌ను ఫిబ్రవరిలో లాంచ్ చేయవచ్చు. ఈ టైమ్‌లైన్ సామ్‌సంగ్ ట్రెడిషనల్ ఫ్లాగ్‌షిప్ రిలీజ్ షెడ్యూల్‌తో సరిపోతుంది. గెలాక్సీ S25 సిరీస్ 2025 జనవరిలో లాంచ్ అయింది. వచ్చే ఏడాది లాంచ్ కొద్దిగా డిలే అవుతుంది. కారణం ప్రొడక్షన్ మరియు కాస్ట్ చాలెంజెస్ ఉండవచ్చు.

ధర పెరుగుదల వెనుక కంపోనెంట్ కాస్ట్‌లు ఏమిటి?

రిపోర్ట్స్ ప్రకారం కంపోనెంట్ ధరలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. శామ్‌సంగ్ మాన్యుఫాక్చరింగ్ కాస్ట్‌లను కంట్రోల్ చేయడంలో ఇబ్బంది పడుతోంది. ప్రాసెసర్లు, డిస్‌ప్లేలు, కెమెరా మాడ్యూల్స్ ధరలు పెరిగాయి. కొరియన్ పబ్లికేషన్ The Bell ఈ విషయాలు షేర్ చేసింది. రిపోర్ట్ ప్రకారం.. శామ్‌సంగ్ మొబైల్ డివిజన్ కాస్ట్ ప్రెషర్ ఎదుర్కొంటోంది. ప్రయత్నాలు చేసినా పెరిగిన కంపోనెంట్ ఖర్చులను పూర్తిగా భరించలేకపోతోంది. ఫలితంగా కన్స్యూమర్లకు స్మార్ట్‌ఫోన్ ధరలు పెరగవచ్చు.

ధరలు పెంచకుండా ఉండేందుకు ప్రయత్నించిన శాంసంగ్

Advertisement

శామ్‌సంగ్ గత కొన్ని సంవత్సరాలుగా ఫ్లాగ్‌షిప్ ధరలను గణనీయంగా పెంచలేదు. ఇన్‌ఫ్లేషన్ ఉన్నప్పటికీ ధరలను స్టేబుల్‌గా ఉంచేందుకు ప్రయత్నించింది. అయితే ప్రస్తుత మార్కెట్ కండిషన్స్ మరింత చాలెంజింగ్‌గా ఉన్నాయి. కంపోనెంట్ సప్లయర్లు గ్లోబల్‌గా ధరలు పెంచుతున్నారు. ఈ పరిస్థితుల కారణంగా శామ్‌సంగ్‌కు ధరలు స్థిరంగా ఉంచడానికి సమస్యగా మారింది.

గెలాక్సీ S25 సిరీస్ ధరల కంపారిజన్

గెలాక్సీ S25 సిరీస్ ఫోన్ల ధరలు అంచనాలకు రిఫరెన్స్ ఇస్తాయి. ఇండియాలో గెలాక్సీ S25 ధర రూ.80,999. ఇది 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్. హయ్యర్ వేరియంట్ రూ.92,999. ఇందులో 12GB RAM + 512GB స్టోరేజ్ ఉంది. గెలాక్సీ S25+ ధర రూ.99,999. ఇది ప్రీమియం ఫ్లాగ్‌షిప్ కేటగిరీలో ఉంచింది.

Also Read: చలికాలంలో రూం హీటర్లతో అగ్నిప్రమాదాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

గెలాక్సీ S25 అల్ట్రా ధరతో ప్రీమియం బెంచ్‌మార్క్ సెట్

గెలాక్సీ S25 అల్ట్రా ధర రూ.1,29,999. ఈ హై ఎండ్ మోడల్ టాప్-టైర్ ఫీచర్లు కావాలనుకునేవారికి టార్గెట్ చేసింది. అడ్వాన్స్‌డ్ కెమెరాలు, డిస్‌ప్లే, పనితీరు అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. గెలాక్సీ S26 అల్ట్రా ఈ ధరను మించవచ్చు. రిపోర్ట్స్ ప్రకారం అన్ని వేరియంట్ల ధరలు పెరగవచ్చు.

గెలాక్సీ S26 ధర పెరుగుదలకు చాలా రిపోర్ట్స్ సపోర్ట్

గెలాక్సీ S26 సిరీస్ ధర పెరుగుదల గురించి ఇది మొదటి రిపోర్ట్ కాదు. ఇంతకుముందు కూడా అనేక లీక్స్ ఎక్కువ ధరలను సూచించాయి. ఈ రిపీటెడ్ క్లెయిమ్స్ ధర పెరుగుదల అంచనాలను బలపరుస్తున్నాయి.శామ్‌సంగ్ ఇంకా ధరలపై అధికారికంగా కామెంట్ చేయలేదు. ఫైనల్ ధరలు లాంచ్ సమయంలోనే కన్ఫర్మ్ అవుతాయి.

వచ్చే ఏడాది కొనుగోలుదారులపై భారమే

వినియోగదారులు 2026లో శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్‌లకు ఎక్కువ ఖర్చు చేయాల్సి రావచ్చు. అయితే పెరిగిన ధరలకు తగ్గట్టు గెలాక్సీ S26 సిరీస్ ఎక్కువ మెరుగులు ఆఫర్ చేయవచ్చు. అయితే కొంతమంది కొనుగోలుదారులకు అఫోర్డబిలిటీపై ఆందోళన కలిగించవచ్చు. అధికారిక అనౌన్స్‌మెంట్స్ కోసం వేచి నిర్ణయం తీసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×