E-Paper
Advertisement

బిగ్ షాక్ ఇచ్చిన ఒప్పో.. 6500mAh బ్యాటరీ, ఐపీ69 రేటింగ్ ఫోన్‌పై రూ.14,500 తగ్గింపు, పూర్తి వివరాలు ఇవే!

బిగ్ షాక్ ఇచ్చిన ఒప్పో.. 6500mAh బ్యాటరీ, ఐపీ69 రేటింగ్ ఫోన్‌పై రూ.14,500 తగ్గింపు, పూర్తి వివరాలు ఇవే!
Advertisement

Oppo Reno 15 Pro Price Cut: తక్కువ ధరలో మంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు ఇది నిజంగా సూపర్ ఛాన్స్. ఒప్పో కంపెనీకి చెందిన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ ‘ఒప్పో రెనో 15 ప్రో’పై ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు నడుస్తున్నాయి. అసలు ధరపై భారీ తగ్గింపుతో పాటు బ్యాంక్ ఆఫర్లను కూడా కలిపి వాడుకుంటే.. ఈ ఫోన్‌ను చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

రూ.14,500 కంటే ఎక్కువ ఆదా:

ఈ ఫోన్ అసలు ధర రూ.74,999గా ఉంది. అయితే విజయ్ సేల్స్ ప్రస్తుత సేల్‌లో భాగంగా దీనిపై నేరుగా డిస్కౌంట్ ఇస్తూ రూ.67,999కే లిస్ట్ చేసింది. దీంతోపాటు అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్‌ ద్వారా EMI లావాదేవీ జరిపితే మరో రూ.7,500 అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో మొత్తంగా చూసుకుంటే అసలు ధర కంటే సుమారు రూ.14,500 వరకు లాభం పొందే అవకాశం ఉంది.

అద్భుతమైన కెమెరా సెటప్:

Advertisement

ఈ ఫోన్ ధర మాత్రమే కాదు.. ఫీచర్లు కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. ఫొటోగ్రఫీని ఇష్టపడే వారి కోసం దీనిలో వెనుక వైపు మూడు కెమెరాలను ఇచ్చారు. అందులో ప్రధాన కెమెరా ఏకంగా 200MP కావడం విశేషం. దీంతో పాటు మరో రెండు 50MP కెమెరాలు ఉన్నాయి. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో కూడా 50MP కెమెరాను అమర్చారు. దీనివల్ల ఫొటోలు, వీడియో కాల్స్ చాలా స్పష్టంగా వస్తాయి.

Also Read: ల్యాప్‌టాప్‌ను మించిన పెర్ఫార్మెన్స్.. 185Hz డిస్‌ప్లేతో వస్తున్న Red Magic 5 Pro Tablet!

పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్, డిస్‌ప్లే:

Advertisement

ఈ ఫోన్‌లో 6.78 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది కాబట్టి.. గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు స్క్రీన్ చాలా స్మూత్‌గా సాగుతుంది. ఇక పనితీరు విషయానికి వస్తే.. డియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్‌ను వాడారు. 12GB RAM 256GB స్టోరేజ్‌తో వస్తున్న ఈ ఫోన్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

భారీ బ్యాటరీ సామర్థ్యం:

ఈ ఫోన్ బ్యాటరీ లైఫ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దీనిలో ఏకంగా 6500mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. దీనికి తోడు 80W సూపర్ ఊక్ (SUPERVOOC) ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుంది. అలాగే ఫోన్ ఎక్కువ కాలం మన్నికగా ఉండటం కోసం దీనికి ఐపీ69 (IP69) రేటింగ్ ఇచ్చారు. అంటే నీళ్లు, దుమ్ము పడినా ఫోన్‌కు ఏమీ కాదు. ప్రీమియం ఫీచర్లు ఉన్న ఈ ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం.

Also Read: Xiaomi 18లో 4 ఇంచ్ బ్యాక్ డిస్‌ప్లే.. Vivo X500లో కాంపాక్ట్ డిజైన్.. లీకైన రెండు క్రేజీ ఫోన్ల ఫీచర్లు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×