E-Paper
Advertisement

బోర్డింగ్ పాస్ ఉన్నా విమానం ఎక్కనివ్వలే.. సీన్ కట్ చేస్తే స్పైస్‌ జెట్‌ కు షాక్!

బోర్డింగ్ పాస్ ఉన్నా విమానం ఎక్కనివ్వలే.. సీన్ కట్ చేస్తే స్పైస్‌ జెట్‌ కు షాక్!
Advertisement

హజ్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న వృద్ధ దంపతుల పట్ల స్పైస్ జెట్ సిబ్బంది వ్యవహరించిన తీరుపట్ల వినియోగదారుల కమిషన్ సీరియస్ అయ్యింది. బోర్డింగ్ పాస్‌ లు ఉన్నప్పటికీ, విమానంలోకి వారిని అనుమతించకపోవడంపై మండిపడింది. ఈ ఘటనపై విచారణ జరిపిన శ్రీనగర్ వినియోగదారుల కమిషన్, విమానయాన సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని నిర్థారించి.. బాధిత దంపతులకు టికెట్ డబ్బుతో పాటు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

Advertisement

గులాం నబీ ఫఫూ, ఆయన భార్య రాజా బేగం హజ్ యాత్ర ముగించుకుని ఢిల్లీ నుంచి శ్రీనగర్‌ కు వెళ్లేందుకు స్పైస్‌ జెట్ విమానంలో టికెట్లు బుక్ చేసుకున్నారు. వారి కుమారుడు ముందుగానే ఈ టికెట్లను బుక్ చేశాడు. విమానం సాయంత్రం 6:45 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి రాత్రి 8:20 గంటలకు శ్రీనగర్ చేరాల్సి ఉంది. వారు ముందే విమానాశ్రయానికి చేరుకున్నారు. చెక్ ఇన్ ప్రక్రియను పూర్తి చేసి, తమ సామానును అప్పగించి, బోర్డింగ్ పాస్‌లను కూడా తీసుకున్నారు. ఆ తర్వాత గేట్ దగ్గర బోర్డింగ్ కోసం వేచి ఉన్నారు. అయితే, వారిని విమానంలోకి అనుమతించలేదు. తమ దగ్గర బోర్డింగ్ పాస్‌ లు ఉన్నప్పటికీ, ఎందుకు అనుమతించలేదో ఎయిర్‌ లైన్ సిబ్బంది సరైన వివరణ ఇవ్వలేదని ఆరోపించారు. తమ స్థానంలో మరికొందరు ప్రయాణికులను విమానంలోకి పంపించారని, తమ బోర్డింగ్ పాస్‌ లను రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా, చెక్ ఇన్ చేసిన తమ సామాను కూడా చాలా సేపటికి తిరిగి ఇచ్చారని తెలిపారు.

రాత్రి ఢిల్లీలోనే గడపాల్సిన పరిస్థితి

విమాన సిబ్బంది తీరు కారణంగా ఆ రోజు శ్రీనగర్‌ కు వెళ్లే మిగతా అన్ని విమానాలను మిస్సై, ఢిల్లీలోనే రాత్రి గడపాల్సి వచ్చింది. చివరకు మరుసటి రోజు ఉదయం ఇంటికి చేరుకోవడానికి మరో విమాన సంస్థకు చెందిన టికెట్లను ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం వారు అదనంగా రూ.13,450 ఖర్చు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన శ్రీనగర్ వినియోగదారుల కమిషన్, స్పైస్‌ జెట్ సేవల్లో లోపం ఉందని స్పష్టం చేసింది. సంస్థ నిర్లక్ష్యంతో వృద్ధ దంపతులు ఇబ్బందులు పడ్డారని అభిప్రాయపడింది.

రూ. 62 వేలు పరిహారం ఇవ్వాలని ఆదేశం

Advertisement

దంపతులకు జరిగిన నష్టం, మానసిక వేదన, అవమానం, ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని కమిషన్ వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. టికెట్ ధర రూ.10,078ను తిరిగి చెల్లించడంతో పాటు అదనంగా రూ.52,000 నష్టపరిహారం ఇవ్వాలని స్పైస్‌ జెట్‌ను ఆదేశించింది. బోర్డింగ్ పాస్ ఉన్న ప్రయాణికులను సరైన కారణం లేకుండా విమానంలోకి అనుమతించకపోతే, విమానయాన సంస్థలు చట్టపరమైన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ తీర్పు స్పష్టం చేసింది.

Read Also: వందే భారత్ డోర్లు క్లోజ్ అయినా నో టెన్షన్.. ఇలా చేస్తే హ్యాపీగా రైలు ఎక్కొచ్చు!

Related News

శ్రీలంకలో సీతమ్మ గుడి.. రామాయణంలో అశోకవాటిక ఇక్కడే.. లంక టూర్ వేసేయండి

విదేశీ ట్రిప్‌లో రోమింగ్, ఛార్జింగ్ టెన్షన్ ఉండకూడదంటే.. ఈ 5 గాడ్జెట్స్ మీ వద్ద ఉండాల్సిందే!

సరిహద్దు దాటకుండానే.. విదేశాలకు వెళ్లిన ఫీల్.. దేశంలోని 5 నెవర్ బిఫోర్ టౌన్స్!

కేరళలో భారీ వర్షాలు.. శబరిమల భక్తులకు ప్రభుత్వం కీలక సూచనలు!

జస్ట్.. పాస్‌ పోర్ట్ ఉంటే చాలు.. వీసా లేకుండా ఇండియన్స్ ఈ 27 దేశాలకు వెళ్లొచ్చు!

విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్‌.. సౌత్ కోస్ట్ రైల్వే కీలక ప్రకటన!

ఉల్కాపాతం నుంచి పుట్టిన అద్భుతం.. 50 వేల ఏళ్లనాటి ఈ అరుదైన సరస్సు గురించి మీకు తెలుసా?

దుబాయ్, మక్కా టు చైనా.. ప్రపంచంలోని అత్యంత ఎత్తైన 5 భవనాలు.. వీటి పొడవు ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×