E-Paper
Advertisement

వచ్చేస్తోంది Oppo F33 సిరీస్.. ఫీచర్లు, ధర వివరాలు తెలిస్తే ఇప్పుడే బుక్ చేసేసుకుంటారు!

వచ్చేస్తోంది Oppo F33 సిరీస్.. ఫీచర్లు, ధర వివరాలు తెలిస్తే ఇప్పుడే బుక్ చేసేసుకుంటారు!
Advertisement

Oppo F33 Series: సాధారణంగా ఒప్పో ఫోన్లు అంటేనే టెక్ ప్రియుల్లో ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా తక్కువ ధరలో మంచి లుక్, పవర్‌ఫుల్ బ్యాటరీ కావాలి అనుకునే వారికి ఒప్పో ఎప్పుడూ ఫస్ట్ ఆప్షనే. గతేడాది సెప్టెంబర్‌లో వచ్చిన F31 సిరీస్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో.. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ‘Oppo F33’ సిరీస్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి కంపెనీ రెడీ అయిపోయింది. ఈ నెలాఖరుకల్లా ఈ కొత్త ఫోన్లు ఇండియన్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణుల అంచనా.

లాంచ్ ఎప్పుడంటే?

టెక్ వర్గాల సమాచారం ప్రకారం.. Oppo F33, Oppo F33 Pro మోడల్స్ ఏప్రిల్ మూడో వారంలోనే భారత్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఈసారి కంపెనీ కేవలం ఫీచర్ల మీద మాత్రమే కాకుండా.. ఫోన్ మన్నిక మీద కూడా బాగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. గతంలో వచ్చిన ఫోన్ల కంటే ఇవి చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయట. అంతేకాదు.. నీళ్లు, దుమ్ము నుంచి రక్షణ కల్పించే మెరుగైన రేటింగ్‌తో వస్తున్నాయని సమాచారం.

Advertisement

Also Read: బాబోయ్.. ఇంత పెద్ద టీవీనా? LG 115 అంగుళాల స్మార్ట్ టీవీ లాంచ్.. గేమర్లకు ఇక పండగే!

బ్యాటరీ సామర్థ్యం ఎంతంటే?

ఈ సిరీస్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం దీని బ్యాటరీనే. ఇందులో ఏకంగా 7,000mAh కంటే పెద్ద బ్యాటరీని ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు తిరుగుండదు. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. Pro మోడల్‌లో మంచి గేమింగ్ చిప్‌సెట్, ఎక్కువ RAM, ఇంకా అదిరిపోయే కెమెరా సెటప్ ఉండబోతున్నాయి.

ధర ఎంత ఉండొచ్చు?

Advertisement

ప్రస్తుతం మార్కెట్‌లో అన్ని ఫోన్ల ధరలు కాస్త పెరుగుతున్నాయి కాబట్టి.. Oppo F33 సిరీస్ కూడా మునుపటి కంటే కొంచెం ఎక్కువే ఉండొచ్చు. ఈ ఫోన్ల ధర సుమారుగా రూ.25,000 నుండి రూ.35,000 మధ్యలో ఉండొచ్చని అంచనా. అయితే దీనిలో Plus వెర్షన్ ఉంటుందా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. మీరు గనుక వపర్‌ఫుల్ బ్యాటరీ, ఎక్కువ కాలం మన్నిక వచ్చే మంచి ఫోన్ కోసం చూస్తుంటే.. మరికొన్ని రోజులు ఆగితే ఈ ఒప్పో కొత్త ఫోన్లపై ఓ లుక్కేయొచ్చు.

Also Read: ఫోన్ తీయాల్సిన పనిలేదు.. నథింగ్ ఏఐ గ్లాసెస్ వచ్చేస్తున్నాయి, అన్నీ కళ్లద్దాలతోనే ఇక!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×