E-Paper
Advertisement

ఓలా రీ ఎంట్రీ, టీవీఎస్ డామినేషన్.. అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్ 5 బ్రాండ్స్ ఇవే!

ఓలా రీ ఎంట్రీ, టీవీఎస్ డామినేషన్.. అమ్మకాల్లో దుమ్మురేపిన టాప్ 5 బ్రాండ్స్ ఇవే!
Advertisement

March 2026 EV Scooter Sales: దేశీ ఎలక్ట్రిక్ మార్కెట్ లో స్కూటర్లు సత్తా చాటాయి. మార్చి 2026లో అమ్మకాలు కొత్త రికార్డులను నెలకొల్పాయి. కేంద్రం సబ్సిడీ, ముఖ్యంగా PM E-Drive స్కీమ్ ముగియబోతుందనే కారణంతో చాలా మంది వినియోగదారులు ఈవీ కొనుగోళ్లకు ముందుకు వచ్చారు. అయితే, ప్రభుత్వం ఈ పథకాన్ని జూలై 2026 వరకు పొడిగించడం కూడా మార్కెట్‌ కు మరింత ఊపునిచ్చింది. ఈ నేపథ్యంలో,పాపులర్ బ్రాండ్లు తమ అమ్మకాలలో గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి.

⦿ 5వ స్థానంలో ఓలా ఎలక్ట్రిక్

ఈ నెలలో టాప్ అమ్మకాల బ్రాండ్ల జాబితాలో ఐదవ స్థానంలో ఓలా ఎలక్ట్రిక్ నిలిచింది. కొన్ని నెలలుగా తగ్గిన అమ్మకాలు ఇప్పుడు మళ్లీ పెరిగాయి. ఫిబ్రవరిలో ఒక స్థానం దిగజారిన ఈ కంపెనీ, మార్చిలో 10 వేలకుపైగా యూనిట్లను విక్రయించి తిరిగి 5వ స్థానంలో స్థానం సంపాదించింది. గతేడాదితో పోలిస్తే కొంత తగ్గుదల ఉన్నప్పటికీ, ఆఫర్లు, సబ్సిడీలు అమ్మకాలను మళ్లీ పెంచాయి.

⦿ 4వ స్థానంలో విడా

Advertisement

నాలుగో స్థానంలో హీరో మోటోకార్ప్‌ కు చెందిన విడా బ్రాండ్ నిలిచింది. ఈ బ్రాండ్ తన చరిత్రలోనే అత్యధిక అమ్మకాలను నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు వృద్ధి సాధించి 21 వేలకుపైగా యూనిట్లను విక్రయించింది. ప్రత్యేక ఎడిషన్ స్కూటర్లను పరిచయం చేయడం, రిమూవబుల్ బ్యాటరీ టెక్నాలజీ వినియోగదారులను ఆకర్షించాయి.

⦿ 3వ స్థానంలో ఏథర్ ఎనర్జీ

మూడో స్థానంలో ఏథర్ ఎనర్జీ నిలిచింది. ఈ కంపెనీ గత కొన్నేళ్లుగా స్థిరంగా అమ్మకాలను కొనసాగిస్తోంది. ప్రీమియం క్వాలిటీ, ఆధునిక ఫీచర్లు, విశ్వసనీయత కారణంగా వినియోగదారులలో మంచి పేరు సంపాదించింది. ముఖ్యంగా కుటుంబ వినియోగానికి అనువైన రిజ్టా మోడల్ మంచి ఆదరణ పొందింది. మార్చిలో ఈ కంపెనీ 35 వేలకుపైగా యూనిట్లను అమ్మింది.

⦿ 2వ స్థానంలో బజాజ్

Advertisement

రెండో స్థానంలో బజాజ్ చేతక్ ఉంది. పాతకాలపు డిజైన్‌కు ఆధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీని జోడించిన ఈ స్కూటర్ వినియోగదారులకు బాగా నచ్చుతోంది. మెటల్ బాడీతో వస్తుండటం వల్ల బిల్డ్ క్వాలిటీ కూడా బలంగా ఉంటుంది. మార్చిలో ఈ బ్రాండ్ 46 వేలకుపైగా యూనిట్లను విక్రయించి రికార్డు స్థాయి అమ్మకాలను నమోదు చేసింది.

⦿ తొలి స్థానంలో టీవీఎస్

మొదటి స్థానంలో టీవీఎస్ మోటార్ కంపెనీ నిలిచింది. ఐక్యూబ్, ఇతర మోడళ్ల ద్వారా ఈ కంపెనీ మార్కెట్‌లో ముందంజలో ఉంది. మార్చి 2026లో దాదాపు 50 వేల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. బ్యాటరీ సబ్‌స్క్రిప్షన్ లాంటి కొత్త విధానాలు వినియోగదారులకు కొనుగోలు ఖర్చును తగ్గించాయి.

మొత్తంగా దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లకు డిమాండ్ భారీగా పెరుగుతోంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, కంపెనీల కొత్త టెక్నాలజీలు, పోటీ ధరలు ఈ మార్కెట్‌ను మరింత బలంగా మార్చుతున్నాయి.

Read Also: విన్‌ ఫాస్ట్ నుంచి క్రేజీ స్కూటర్లు.. టీవీఎస్, ఏథర్‌కు కష్టాలే!

Related News

వర్షాకాలంలో ఈ EV బైకులే బెస్ట్.. వరదలోనూ దూసుకెళ్తాయట!

ఎక్స్‌ ప్రెస్‌ వే ప్రయాణికులకు షాక్.. టోల్ రేట్లు భారీగా పెంపు!

ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన పెట్రోల్ కార్లు ఇవే.. నెంబర్ వన్ ఏదంటే?

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

మారుతి నుంచి భారీ సర్‌ ప్రైజ్.. త్వరలో 4 క్రేజీ మోడళ్లు ఎంట్రీ!

హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

Big Stories

Advertisement
×