E-Paper
Advertisement

భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 లాంచ్.. 54 గంటల బ్యాటరీ లైఫ్, బడ్జెట్ ధరలోనే!

భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 లాంచ్.. 54 గంటల బ్యాటరీ లైఫ్, బడ్జెట్ ధరలోనే!
Advertisement

OnePlus Nord Buds 4: ప్రముఖ టెక్ సంస్థ వన్‌ప్లస్ భారత మార్కెట్లోకి తమ సరికొత్త ఆడియో డివైజ్ ‘వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4’ను అధికారికంగా లాంచ్ చేసింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న బడ్స్ 4 ప్రో సిరీస్‌కు కొనసాగింపుగా ఈ సరికొత్త ఇయర్‌బడ్స్‌ను కంపెనీ తీసుకొచ్చింది. అధునాతన ఫీచర్లు, అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌తో తక్కువ ధరలోనే ప్రీమియం అనుభూతిని అందించేలా వీటిని డిజైన్ చేశారు.

ధర వివరాలు ఇలా:

భారతదేశంలో వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 ధరను కంపెనీ రూ.3,299గా నిర్ణయించింది. అయితే కస్టమర్ల కోసం ప్రత్యేక లాంచ్ ఆఫర్ కింద కేవలం రూ.3,099కే దీనిని అందిస్తోంది. ఇవి స్టెల్లార్ బ్లాక్, ఆస్ట్రల్ టీల్ అనే రెండు ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తాయి. జూన్ 29 నుంచి వన్‌ప్లస్ అధికారిక వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్, మింత్రా వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఇవి కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానున్నాయి.

అద్భుతమైన నాయిస్ క్యాన్సిలేషన్:

Advertisement

ఈ సరికొత్త బడ్స్ లో 12mm టైటానియం కోటెడ్ డైనమిక్ డ్రైవర్లను అమర్చారు. ఇవి 52dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఫీచర్‌ను అందిస్తాయి. పాత మోడళ్లతో పోలిస్తే ఇది 200 శాతం మెరుగైన నాయిస్ రిడక్షన్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, ఇందులో ఉన్న 6 మైక్రోఫోన్లు, ఏఐ క్లియర్ కాల్ టెక్నాలజీ వల్ల గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వీచే గాలి శబ్దాన్ని కూడా అణచివేసి, ఫోన్ మాట్లాడేటప్పుడు అవతలి వారికి మన వాయిస్ చాలా స్పష్టంగా వినిపించేలా చేస్తుంది.

Also Read: బడ్జెట్ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. iQOO Neo 11S స్పెసిఫికేషన్స్ చూశారా?

అదిరిపోయే ఆడియో ఫీచర్లు:

Advertisement

గేమింగ్, మ్యూజిక్ లవర్స్ కోసం ఇందులో త్రీడీ స్పేషియల్ ఆడియో, గేమ్ స్పేషియల్ ఆడియో వంటి ఫీచర్లను ఇచ్చారు. బ్లూటూత్ 6.1 కనెక్టివిటీతో పనిచేసే ఈ బడ్స్, ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకునే సదుపాయాన్ని కలిగి ఉన్నాయి. గూగుల్ ఫాస్ట్ పెయిర్, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్ పెయిర్ వంటి ఫీచర్లతో పాటు గేమింగ్ ఆడేటప్పుడు ఎలాంటి లాగ్ లేకుండా ఉండేందుకు 47ms లో-లేటెన్సీ మోడ్‌ను కూడా ఇందులో జోడించారు.

తిరుగులేని బ్యాటరీ లైఫ్:

ఈ బడ్స్ బ్యాటరీ పరంగా చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయి. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) ఆఫ్ చేసి వాడితే, ఇయర్‌బడ్స్ మాత్రమే 13 గంటలు, ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తంగా 54 గంటల సుదీర్ఘ ప్లేబ్యాక్ టైమ్‌ను ఇస్తాయి. ఒకవేళ ANC ఆన్ చేస్తే 27 గంటల పాటు వాడుకోవచ్చు. కేవలం 10 నిమిషాలు చార్జ్ చేస్తే చాలు, కేస్‌తో కలిపి 11 గంటల పాటు, విడిగా బడ్స్ అయితే 4 గంటల పాటు నాన్‌స్టాప్‌గా వాడుకోవచ్చు. వీటికి ఐపీ55 రేటింగ్ ఉండటం వల్ల ధూళి, నీటి చుక్కల నుండి రక్షణ లభిస్తుంది.

Also Read: బడ్జెట్ ధరలో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్.. Samsung Galaxy M47 5G ఫీచర్లు చూశారా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×