E-Paper
Advertisement

Pawan Kalyan OG 2…ఊహించని రేంజ్‌లో ‘OG 2’ అఫీషియల్ అనౌన్స్‌మెంట్!

Pawan Kalyan OG 2…ఊహించని రేంజ్‌లో ‘OG 2’ అఫీషియల్ అనౌన్స్‌మెంట్!
Advertisement

OG Universe: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో సరికొత్త సంచలనానికి తెరతీశారు.పవన్ పాలిటిక్స్ లో బిజీగా ఉన్నప్పటికీ తన సినిమాల కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ఆయన అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు. “You Asked… We Heard…” (మీరు అడిగారు.. మేము విన్నాము) అంటూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన ఒకే ఒక్క పోస్ట్ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

సుజీత్ మార్క్ విజువల్ వండర్

సుజీత్ దర్శకత్వంలో డివివి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న మోస్ట్ అవేటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా “OG” (ఓరిజినల్ గ్యాంగ్‌స్టర్) చిత్రానికి సంబంధించి, ఏకంగా పార్ట్-2ను కూడా లైన్లోకి తెస్తూ “OGUniverse లోకి స్వాగతం” అంటూ పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించడంతో ఫ్యాన్స్ సంబరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.OG సక్సెస్ కావడంతో సుజీత్ కథను మరింత విస్తరించి, ఒక భారీ సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

also read:Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

అందుకే  ‘OG 2’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఎదురుచూపులకు పవన్ కళ్యాణ్ స్వయంగా తెరదించారు. ఈ ప్రకటనతో ‘OG’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, ఇదొక సుజీత్ మార్క్ విజువల్ వండర్ ‘OGUniverse’ అని స్పష్టమైంది. తమ లీడర్, హీరో నుంచి ఇలాంటి అప్‌డేట్ వస్తుందని అస్సలు ఊహించని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాజెక్ట్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌

Advertisement

ఇక OG తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న పూర్తి స్థాయి మాస్ కమర్షియల్ విందు ఇదే కావడంతో బిజినెస్ వర్గాల్లోనూ ఈ ప్రాజెక్ట్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. దీనితో ఇప్పుడు అందరి దృష్టి ‘OG’ ఫ్రాంచైజీ పైనే పడింది.ఇక ఇదివరకే మూడు వందల కోట్లు కొల్లగొట్టిన OG కి థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఇమ్రాన్ హష్మీ విలనిజం సినిమాను వేరే రేంజ్‌కు తీసుకెళ్ళిన సంగతి తెల్సిందే.

ఇకపోతే సరికొత్త రికార్డుల వేట మొదలుపెట్టడానికి సిద్ధమవుతున్న ఈ ‘OG 2’ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. పవన్ కళ్యాణ్ పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే లక్షలాది లైకులు, వేలాది రీట్వీట్లతో నెట్ ఇంట తుఫాన్ సృష్టించింది. ఒకవైపు ప్రజాసేవలో డిప్యూటీ సీఎంగా తీరిక లేకుండా గడుపుతూనే, మరోవైపు సినిమా అప్‌డేట్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి పవర్ స్టార్ సిద్ధమవడం గమనార్హం.

also read:పాస్‌పోర్ట్ సీజ్ అన్నారు.. సింహం బోను అన్నారు.. కట్ చేస్తే మళ్లీ ఫ్లైట్ ఎక్కేసిన మహేష్

రాబోయే రోజుల్లో ఈ ‘OGUniverse’ నుంచి మరిన్ని సెన్సేషనల్ అప్‌డేట్స్ రానున్నట్లు చిత్ర యూనిట్ హింట్ ఇచ్చింది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ బిగ్గెస్ట్ ట్రీట్‌తో టాలీవుడ్‌లో సరికొత్త రికార్డుల సృష్టి ఖాయంగా కనిపిస్తోంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×