E-Paper
Advertisement

రేవంత్ ‘డైనమిక్ లీడర్’.. తెలంగాణ హక్కులపై రాజీపడరు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

రేవంత్ ‘డైనమిక్ లీడర్’.. తెలంగాణ హక్కులపై రాజీపడరు.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement

CM Chandrababu: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని డైనమిక్ పర్శన్ గా అభివర్ణించారు. కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో కలిసి పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో వేదికపై కూర్చున్న రేవంత్ రెడ్డి గురించి ప్రస్తావిస్తూ ప్రశంసలు కురిపించారు. తెలంగాణ హక్కుల విషయంలో రేవంత్ ఏమాత్రం రాజీపడరని అన్నారు. రేవంత్ పట్టుదల చూసి తానెంతో ఇంప్రెస్ అయినట్లు ఆకాశానికెత్తారు. తమ రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడుకుంటూ దేశాభివృద్ధికి ఇద్దరం కృషి చేస్తున్నట్లు చంద్రబాబు వ్యాఖ్యానించారు.

మరోవైపు తుంగభద్ర ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ.. నీటి ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలని చంద్రబాబు కొనియాడారు. వాటిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని లక్షలాది మందికి తుంగభద్ర జీవనోపాధిని కల్పిస్తోందని చంద్రబాబు అన్నారు. ముఖ్యంగా ఏపీలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సాగు, తాగు నీరు.. ఈ తుంగభద్ర నది నుంచే వస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.

Advertisement

Also Read: క్షణాల్లో స్మశానంలా మారిన వెనిజులా.. ఈ వీడియోలు చూస్తే హడలిపోతారు!

Advertisement

కేంద్ర జలవనరుల మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో 3 రాష్ట్రాల సీఎంలు ఇక్కడ కలవడం చాలా సంతోషంగా ఉందని చంద్రబాబు చెప్పారు. ఇదొక చరిత్ర అంటూ కొనియాడారు. మరోవైపు దేశంలో నదుల అనుసంధానం ఆవశ్యకతను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రస్తావించారు. గంగ, కావేరి నదులను అనుసందధానిస్తే భారత్ కు తిరుగుండదని పేర్కొన్నారు. అన్ స్టాపబుల్ గా దూసుకెళ్తుందని అంచనా వేశారు. అలాగే గోదావరి – కావేరి నదిని సైతం జాతీయ ప్రాజెక్టుగా తీసుకొని అనుసంధానం చేయాలని కేంద్రం మంత్రికి చంద్రబాబు ప్రతిపాదన చేశారు.

Also Read: ఆంధ్రాలో మనోళ్లకి ఉద్యోగాలిస్తారా? మరి తెలంగాణలో ఎందుకివ్వాలి? కవిత షాకింగ్ కామెంట్స్

Related News

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. మాస్కో-విశాఖ మధ్య స్మార్ట్ సిటీ ఒప్పందం..!

ఛాలెంజ్ చేస్తున్నా.. నాన్నలా వారంతా చేస్తారా? వైసీపీ నేతలకు ముద్రగడ క్రాంతి సూటి ప్రశ్నలు

స్కామ్‌లకు బ్రాండ్ అంబాసిడర్ జగన్.. లోకేష్ సవాల్‌కు సమాధానం ఏదీ? – బుద్ధా వెంకన్న

నెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. పుట్టినరోజు నాడే ఇద్దరు యువకులు మృతి!

ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూ.. వైసీపీ నేతల్లో టెన్షన్ మొదలు, అసలు కేసు ఏంటి?

జనసేన కీలక నిర్ణయం.. పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రత్యర్థులకు ఇక కష్టాలే

శ్రీరామ్ ఫైనాన్స్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం!

నారా లోకేష్ విజన్ సూపర్ సక్సెస్.. ఏపీ ఆస్ట్రేలియా మధ్య కుదిరిన ఎంవోయూలు!

Big Stories

Advertisement
×