E-Paper
Advertisement

గేమింగ్ ఫోన్ల రూపురేఖలు మార్చబోతున్న OnePlus 16.. ఏకంగా 9000mAh బ్యాటరీతో అఫీషియల్ టీజర్!

గేమింగ్ ఫోన్ల రూపురేఖలు మార్చబోతున్న OnePlus 16.. ఏకంగా 9000mAh బ్యాటరీతో అఫీషియల్ టీజర్!
Advertisement

OnePlus 16: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి కొత్తరకం స్మార్ట్‌ఫోన్లు వస్తున్నాయంటే చాలు.. టెక్ లవర్స్‌లో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తుంటుంది. ఎంత ధర ఉండొచ్చు? ఫీచర్ల సంగతేంటి? విడుదల తేదీ ఎప్పుడు.. అంటూ నెట్టింట తెగ వెతికేస్తుంటారు. అలాంటి యూజర్లను దృష్టిలో పెట్టకున్ని కంపెనీ.. OnePlus16 అధికారిక టీజర్‌ను ఇటీవల విడుదల చేసింది.

చైనాలో జరిగిన ఒక టెక్ ఈవెంట్‌లో OnePlus16 గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడైంది. ముఖ్యంగా మొబైల్ గేమింగ్ ఇష్టపడే వారిని దృష్టిలో ఉంచుకుని, గేమ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ప్రత్యేకమైన ‘ఫెంగ్చి గేమింగ్ కోర్’ టెక్నాలజీని ఈ ఫోన్ ద్వారా అందిస్తున్నారు.

గేమింగ్ ప్రియుల కోసమే..

Advertisement

OnePlus16 డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోనే ప్రత్యేకంగా నిలవనుంది. దీనిలో 6.78 ఇంచుల ప్రీమియం OLED డిస్‌ప్లేను ఇస్తున్నారు. ఏకంగా 185Hz వరకు రిఫ్రెష్ రేట్ ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనివల్ల గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు అత్యంత స్మూత్ అనుభూతి లభిస్తుంది. అంతేకాకుండా.. ఇది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 6 ప్రొ చిప్‌సెట్‌తో పనిచేస్తుందని సమాచారం.

Also Read: రాత్రి డిన్నర్, ఉదయం టిఫిన్ మధ్య ఈ గ్యాప్ ఉంటే.. కొవ్వు వెన్నలా కరిగిపోతుంది!

షాకింగ్ బ్యాటరీ కెపాసిటీ..

Advertisement

ఈ OnePlus16లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది దీని బ్యాటరీ గురించే. ఏకంగా 9000mAh బ్యాటరీతో ఈ ఫోన్ రాబోతోంది. సాధారణంగా ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఇంత పెద్ద బ్యాటరీ చూడటం చాలా అరుదు. నాన్‌స్టాప్‌గా గేమింగ్ ఆడినా, వీడియోలు చూసినా బ్యాటరీ అయిపోతుందనే భయం ఉండదు. దీనికి తోడు వేగంగా ఛార్జ్ అయ్యేలా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందించనున్నారు.

ఆకట్టుకునే కెమెరా సెటప్..

డిజైన్ పరంగా పాత మోడల్ ప్రీమియం లుక్‌నే కొనసాగిస్తూనే.. వెనుక వైపు కెమెరా డిజైన్‌లో కొన్ని మార్పులు చేశారు. కొత్తగా ఇచ్చే సర్క్యులర్ కెమెరా ఐలాండ్‌లో మెరుగైన సెన్సార్లను అందించబోతున్నారు. త్వరలోనే ఈ ఫోన్ మొదట చైనా మార్కెట్లో, ఆ తర్వాత భారత్ సహా ఇతర గ్లోబల్ మార్కెట్లలో విడుదల కానుంది. అధునాతన గేమింగ్ ఫీచర్లు, భారీ బ్యాటరీతో రాబోతున్న ఈ ఫోన్ మార్కెట్లో గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తోంది.

Also Read: ఆండ్రాయిడ్ 16తో వచ్చిన మొదటి మాస్ టాబ్లెట్ ఇదే.. Moto Pad 70 Groove ధర ఎంతంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×