E-Paper
Advertisement

అసిస్టెంట్ కెమెరా ఉమెన్ గా వర్క్ చేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

అసిస్టెంట్ కెమెరా ఉమెన్ గా వర్క్ చేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?
Advertisement

Assistant Camera Women: సినిమా ఇండస్ట్రీలో డౌన్ టు ఎర్త్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా తెర ముందుకు రానంత వరకు సినిమా ఇండస్ట్రీలోనే ఎంతో కష్టపడి.. అందరినీ ఆశ్చర్యపరిచిన వారు.. తెర ముందు తమ ప్రతిభను కనబరిచి నేడు ఉన్నత శిఖరాలను చేరుకొని అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇకపోతే పైన ఫోటోలో కనిపిస్తున్న ఒక అమ్మాయి నేడు ఒక స్టార్ హీరోయిన్ అని మీకు తెలుసా? ఒకప్పుడు అసిస్టెంట్ కెమెరా ఉమెన్ గా పనిచేసిన ఆమె.. ఎంతోమంది సినిమాటోగ్రాఫర్ల దగ్గర అసిస్టెంట్ గా పనిచేసింది. ఇండస్ట్రీలో ట్రాలీలు తోసుకుంటూ.. తాను చేస్తున్న పనినే దేవుడిగా భావించింది. అయితే ఆమె కష్టాన్ని గుర్తించి ఆమె అందాన్ని మెచ్చిన దర్శకులు కెమెరా వెనుక కాదు కెమెరా ముందు నిల్చోవాలని సలహా ఇచ్చారు. ఇక వారి సలహాను తూచా తప్పకుండా పాటించిన ఆమె.. ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు స్టార్ హీరోయిన్గా సినిమాలు చేసి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

ఎవరీ అసిస్టెంట్ కెమెరా ఉమెన్?

ఇంతకు ఆ అసిస్టెంట్ కెమెరా ఉమెన్ గా పనిచేసిన ఆమె ఎవరో గుర్తుపట్టారా? ఆమె ఎవరో కాదు అందాల తార, సహజ నటి సుహాసిని(Suhasini). తెలుగు, తమిళ్ చిత్రాలలో నటిస్తూ.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా మంచి పేరు సొంతం చేసుకున్న ఈమె.. ఈ మధ్యకాలంలో సెకండ్ ఇన్నింగ్స్ పాత్రలతో అదరగొట్టేస్తూ బిజీగా గడిపేస్తోంది. అలాంటి ఈమె ఇండస్ట్రీలోకి రాకముందు కెమెరా అసిస్టెంట్ గా పనిచేసింది. అలా సుమారుగా ఏడు చిత్రాల వరకు సుహాసిని కెమెరా అసిస్టెంట్ గా పనిచేసింది.ముఖ్యంగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్లు అశోక్ కుమార్ (Ashok Kumar), ఎన్.కె విశ్వనాథన్(N.K.Vishwanathan) వద్ద అసిస్టెంట్ గా పలు సినిమాలకు పనిచేసి.. ఆ తర్వాతే నటిగా మారింది.

తొలి మహిళా గ్రాడ్యుయేట్..

Advertisement

చెన్నైలోని మద్రాసు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీలో పట్టా అందుకున్న తొలి మహిళ గ్రాడ్యుయేట్ గా కూడా రికార్డు సృష్టించింది సుహాసిని. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక.. అసిస్టెంట్ కెమెరా ఉమెన్ గా తన కెరీర్ ను ప్రారంభించింది.

సుహాసిని అసిస్టెంట్ కెమెరా ఉమెన్ గా పనిచేసిన మూవీ..

ఏడు చిత్రాలకు అసిస్టెంట్ కెమెరా వుమెన్ గా పనిచేయగా.. అందులో ఒకటి ‘శ్రీ రాఘవేంద్ర’. 1985లో సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth ), ప్రముఖ హీరోయిన్ లక్ష్మి(Lakshmi ) జంటగా నటించిన చిత్రం ఇది. ఈ చిత్రానికి దివంగత దర్శకులు దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు. నాటి తెర వెనుక షూటింగ్ కి సంబంధించిన కొన్ని సీన్ ల తాలూకా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Advertisement

Also read:అసిస్టెంట్ కెమెరా ఉమెన్ గా వర్క్ చేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

కెమెరా వెనుక కాదు.. కెమెరా ముందుకు ఆహ్వానం..

ఇకపోతే కెమెరా వెనుక టెక్నీషియన్ గా పనిచేస్తున్న సమయంలో ఆమె ప్రతిభను గుర్తించిన కొంతమంది దర్శకులు ఆమెను కెమెరా ముందుకు ఆహ్వానించారు. అలా తొలిసారి 1980లో వచ్చిన తమిళ చిత్రం ‘నెంజతై కిళ్లతే’ అనే చిత్రం ద్వారా నటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×