E-Paper
Advertisement

అఖిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘లెనిన్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అఖిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘లెనిన్’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Advertisement

Lenin OTT:‘లెనిన్’..మా అయ్యగారికి  సూపర్ హిట్ ఎప్పుడా అని ఎదురు చూసిన  అక్కినేని అభిమానుల కోరికని తీర్చిన సినిమా ఇది.ముఖ్యంగా థియేటర్ లోకి వచ్చే ముందు టాక్ కాస్త అటూ ఇటూ ఉన్నప్పటికీ రిలీజ్ అయ్యాక బాక్సాఫీస్ వద్ద మాత్రం దుమ్ము దులిపేసింది.జూలై 10న విడుదలైన ‘లెనిన్’ మొదటి షో నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. అఖిల్‌ను ఇంత మాస్ లుక్‌లో చూసి అభిమానులు తెగ ఎంజాయ్ చేశారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన యాక్షన్ సీన్లు, ఎమోషనల్ కథ, మాస్ డైలాగులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. చాలామంది అఖిల్‌కు ఇలాంటి సినిమాలే బాగా సెట్ అవుతాయని సోషల్ మీడియాలో కామెంట్లు కూడా చేశారు.

ఓటీటీలోకి రావడానికి చాలా టైమ్ తీసుకున్న ఏజెంట్

Advertisement

ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి కూడా చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. అఖిల్ గత సినిమా ‘ఏజెంట్’ ఓటీటీలోకి రావడానికి చాలా టైమ్ పట్టింది. అందుకే ‘లెనిన్’ విషయంలో కూడా అలాగే జరుగుతుందేమో అనుకున్నారు. కానీ ఈసారి అలా కాదు. సినిమా థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వస్తోంది.ఈ సినిమా డిజిటల్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఆగస్ట్ 7 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో అఖిల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెగ షేర్ చేస్తున్నారు. “మళ్లీ లెనిన్ టైమ్ స్టార్ట్”, “ఈసారి ఇంట్లోనే మాస్ ఎంజాయ్” అంటూ పోస్టులు పెడుతున్నారు.

హైలెట్ అయిన థమన్ మ్యూజిక్ 

Advertisement

సినిమాలో అఖిల్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. యాక్షన్ సీన్లలో ఆయన చూపించిన ఎనర్జీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే కూడా తన పాత్రలో బాగా నటించింది. ఇద్దరి జోడీ కూడా తెరపై బాగానే కనిపించింది.ఇక థమన్ ఇచ్చిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు మరో పెద్ద ప్లస్ అయ్యాయి. ముఖ్యంగా ఫైట్స్ సమయంలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు థియేటర్లలో అభిమానులు విజిల్స్ వేశారు. సినిమా చూసిన వాళ్లు కూడా థమన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు.

మురళీ కిషోర్ అబ్బూరు ఈ సినిమాను మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. కథలో యాక్షన్‌తో పాటు ఎమోషన్ కూడా ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను బాగానే రిసీవ్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు నాగార్జున, నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరించారు.

100 కోట్ల క్లబ్‌లో చేరిన సినిమా 

ఇక తాజాగా ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కూడా.దీంతో అఖిల్ కెరీర్‌లో ఇదే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ విజయం తర్వాత అఖిల్ తర్వాతి సినిమాలపై కూడా అంచనాలు మరింత పెరిగాయి అనడంలో ఆశ్చర్యం లేదు.

ఇక ఇప్పుడు అందరి చూపు ఓటీటీ రిలీజ్‌పైనే ఉంది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఓటీటీలో కూడా అదే రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుందా అని సినీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. థియేటర్లలో మిస్ అయిన వాళ్లకు ఇది మంచి అవకాశం. ఆగస్ట్ 7 నుంచి జీ5లో ‘లెనిన్’ అందుబాటులోకి రానుంది. మరి బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించిన ఈ సినిమా, ఓటీటీలో కూడా అదే జోరు చూపిస్తుందో లేదో చూడాలి.

also read :ట్రైలర్‌తో ఆశలు పెంచిన వరుణ్.. రిజల్ట్ ఎలా ఉంటుందో అంటూ టెన్షన్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×