E-Paper
Advertisement

200MP కెమెరా, 9000mAh బ్యాటరీ.. OnePlus 16 ఫీచర్లకు పిచ్చోళ్లు అయిపోయారు టెక్ ప్రియులంతా!

200MP కెమెరా, 9000mAh బ్యాటరీ.. OnePlus 16 ఫీచర్లకు పిచ్చోళ్లు అయిపోయారు టెక్ ప్రియులంతా!
Advertisement

OnePlus 16 Leaks: వన్‌ప్లస్ నుంచి కొత్త ఫోన్ వస్తుందంటే చాలు.. టెక్ ప్రియుల్లో ఏదో తెలియని ఆత్రుత మొదలవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో OnePlus 16 గురించి రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ.. చైనా నుంచి వెలువడ్డ లీకులు చూస్తుంటే ఈసారి వన్‌ప్లస్ మామూలు ప్లాన్లతో రావడం లేదని అర్థమవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఆసక్తికరమైన విషయాలేంటో ఇప్పుడు మనమూ తెలుసుకుందాం.

గేమర్లకు పండగే:

ఫోన్ స్పీడ్ విషయంలో వన్‌ప్లస్ ఎప్పుడూ రాజీ పడదు. ఈసారి OnePlus 16లో రాబోయే స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో ప్రాసెసర్ ఫోన్ వేగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లనుంది. దీని వేగం ఎంతలా ఉంటుందంటే.. హెవీ గేమ్స్ ఆడినా, ఎన్ని యాప్స్ వాడినా ఫోన్ అస్సలు హ్యాంగ్ అవ్వదట.

Advertisement

Also Read: ఒక్కసారిగా పడిపోయిన Samsung Galaxy S24 FE ధర.. Flipkart May Saleలో ఇదో క్రేజీ డీల్!

బెజెల్స్ లేని స్క్రీన్:

సాధారణంగా ప్రతి ఒక్కరూ ఫోన్లో ఎక్కువగా గమనించేది స్క్రీన్ క్వాలిటీనే. ఈ ఫోన్లో బెజెల్స్ ఉండకపోచ్చని చెబుతున్నారు టెక్ నిపుణులు. దీనివల్ల ఫోన్ పట్టుకున్నప్పుడు చేతిలో కేవలం స్క్రీన్ మాత్రమే ఉన్నట్లు అనిపిస్తుంది. ఇక 240Hz రిఫ్రెష్ రేట్ అంటే వీడియోలు, స్క్రోలింగ్ ఎంత స్మూత్‌గా ఉంటాయో ఊహించుకోవచ్చు. సినిమా చూసినా, గేమ్ ఆడినా ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది.

200 మెగాపిక్సల్ కెమెరా:

Advertisement

ఇక OnePlus 16 కెమెరా విషయానికి వస్తే.. 200MP పెరిస్కోప్ అంటేనే ఒక రకమైన క్రేజు. దీంతో ఎంత దూరంలో ఉన్న వస్తువునైనా స్పష్టంగా క్లిక్ మనిపించవచ్చు. అయితే వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే.. దీని బ్యాటరీ. ఏకంగా 9,000mAh బ్యాటరీతో వస్తున్నట్లు టాక్. ఈ ఫోన్‌ను ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే.. ఇక రెండు మూడు రోజుల వరకు ఛార్జర్ ఎక్కడుందో వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు.

ఆండ్రాయిడ్ 17 వెర్షన్:

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 17 వెర్షన్‌తో పాటు సరికొత్త ఏఐ ఫీచర్లతో వస్తోంది. దీని కోసం ఒక ప్రత్యేకమైన బటన్ కూడా ఇస్తున్నారట. సౌండ్ క్వాలిటీ, వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఎలాగూ ఉండనే ఉన్నాయి. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది అక్టోబర్‌లో ఇది చైనాలో విడుదల కానుంది. ఆ తర్వాత భారత్‌లోకి ఎప్పుడు వస్తుందా అని అందరూ కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.

Also Read: అస్సలు లాగ్ అవ్వదు.. ఛార్జింగ్ అయిపోదు.. ట్రెండింగ్‌లో ఉన్న గేమర్ల ఫేవరెట్ ఫోన్లు ఇవే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×