E-Paper
Advertisement

అమెజాన్ ధమాకా సేల్.. రూ.43,000 బ్రాండెడ్ ఏసీ.. కేవలం రూ.25,990కే!

అమెజాన్ ధమాకా సేల్.. రూ.43,000 బ్రాండెడ్ ఏసీ.. కేవలం రూ.25,990కే!
Advertisement

Amazon Summer Sale 2026: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో ప్రస్తుతం గ్రేట్ సమ్మర్ సేల్ నడుస్తోంది. అతి తక్కువ ధరకే ఏసీలు, ఫ్రిడ్జ్ లు, కూలర్లు, టీవీలను ఆఫర్ చేస్తోంది. ఈ క్రమంలోనే క్రూయిజ్ 1 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ (Cruise 1 Ton 3 Star)పై ఇస్తున్న డిస్కౌంట్ అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. రూ.43,990 విలువ గల ఈ క్రూయిజ్ ఏసీని ఏకంగా 41 శాతం డిస్కౌంట్ తో రూ.25,990కే అందిస్తోంది. సమ్మర్ లో కొత్తగా ఏసీ కొనాలని భావిస్తున్న వారికి ఇదే బెస్ట్ ఛాన్స్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏసీకి సంబంధించిన ప్రధాన ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

వేగవంతమైన కూలింగ్

ఈ ఏసీ అత్యధిక ఉష్ణోగ్రతల వద్ద కూడా అద్భుతంగా పనిచేస్తుంది. బయట ఉష్ణోగ్రత 48°C ఉన్నప్పటికీ గదిని చాలా వేగంగా చల్లబరిచే సామర్థ్యం దీనికి ఉంది. దీనిలోని ‘టర్బో కూలింగ్’ మోడ్ సూపర్ ఫాస్ట్ వేగంతో గదిని కూల్ చేస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.

7 స్టేజ్ ఎయిర్ ఫిల్ట్రేషన్

Advertisement

ఈ ఏసీలోని అతి ముఖ్యమైన ఫీచర్ గా దీనిని చెప్పవచ్చు. ఇందులో ఉన్న 7 దశల ఫిల్ట్రేషన్, PM 2.5 ఫిల్టర్.. గాలిలోని దుమ్ము, ధూళి, బ్యాక్టీరియా, హానికరమైన సూక్ష్మక్రిములను తొలగిస్తాయి. స్వచ్ఛమైన గాలిని అందిస్తూ శ్వాసకోస సమస్యలు రాకుండా ఫ్యామిలీని ఆరోగ్యంగా ఉంచుతుంది.

కన్వర్టబుల్ 4-ఇన్-1 టెక్నాలజీ

యూజర్ తమ అవసరాలకు అనుగుణంగా ఈ ఏసీ కూలింగ్ కెపాసిటీని మార్చుకోవచ్చు. 4 ఇన్ 1 కన్వర్టబుల్ ఫీచర్ ద్వారా గదిలో ఉన్న వ్యక్తుల సంఖ్య, బయటి వాతావరణాన్ని బట్టి ఏసీ పనితీరును అడ్జస్ట్ చేసుకోవచ్చు. తద్వారా పవర్ బిల్లును తగ్గించుకోవచ్చు.

ఇన్వర్టర్ టెక్నాలజీ

Advertisement

ఈ క్రూయిజ్ ఏసీ.. లేటెస్ట్ ఇన్వర్టర్ కంప్రెస్ తో రూపొందింది. ఇది గది ఉష్ణోగ్రతకు అనుగుణంగా కంప్రెసర్ వేగాన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది. 3 స్టార్ రేటింగ్ కలిగి ఉండటం వల్ల విద్యుత్ బిల్లులు టెన్షన్ కూడా ఉండదు.

యాంటీ రస్ట్, కాపర్ కాయిల్

ఈ క్రూయిజ్ ఏసీలో 100% కాపర్ కండెన్సర్ కాయిల్స్ అమర్చారు. దీనిలోని యాంటీ రస్ట్ టెక్నాలజీ ఏసీ తుప్పు పట్టకుండా కాపాడుతుంది. ఫలితంగా తీరప్రాంతాలతో పాటు గాలిలో తేమ అధికంగా ఉండే ఏరియాల్లోనూ ఈ ఏసీ సమర్థవంతంగా పనిచేస్తుంది. ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది.

Also Read: కొత్త ఏసీ కావాలా? 2026లో టాప్ మోడల్స్ ఇవే.. ఒక్క రూపాయి కూడా వేస్ట్ అవ్వదు!

తక్కువ శబ్దం.. ఎక్కువ కూలింగ్

ఈ ఏసీ క్లాసిక్ వైట్ కలర్‌లో మోడ్రన్ డిజైన్‌తో వస్తుంది. ఇది తక్కువ శబ్దంతో పనిచేస్తూ.. మెరుగైన కూలింగ్ అందిస్తుంది. కాబట్టి రాత్రిళ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా నిద్రించవచ్చు. దీనిలోని డిజిటల్ డిస్ప్లే, స్మార్ట్ ఫీచర్లు.. ఏసీ వినియోగాన్ని మరింత తేలిగ్గా మార్చేస్తాయని కంపనీ వర్గాలు తెలిపాయి.

Also Read: రూ.40వేల లోపు బెస్ట్ LG ఫ్రిజ్‌లు.. అదిరిపోయే కూలింగ్, భారీగా కరెంటు ఆదా, ఎక్కడంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×