E-Paper
Advertisement

రాహుల్ వ్యూహం.. బీజేపీకి గ‌ర్వ‌భంగం! ఏన్డీయేపై ఇండి కూట‌మి రెండో విజ‌యం..!

రాహుల్ వ్యూహం.. బీజేపీకి గ‌ర్వ‌భంగం! ఏన్డీయేపై ఇండి కూట‌మి రెండో విజ‌యం..!
Advertisement

రాహుల్ గాంధీకి వ‌రుస‌గా రెండో విజ‌యం. త‌మ నిర్ణ‌యానికి ఎదురే లేద‌ని విర్ర‌వీగుతున్న ఎన్డీయే కూట‌మికి ఎదురుదెబ్బ‌. గ‌ర్వ‌భంగం. కార‌ణం.. రాహుల్ గాంధీ వ్యూహం. మొన్న పార్ల‌మెంటులో డీలిమిటేష‌న్ బిల్లును మ‌హిళా బిల్లుతో ముడిపెట్టి ఇండి కూట‌మిని ఇరుకున పెట్టేందుకు.. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల నేప‌థ్యాన్ని వాడుకునేందుకు ఎత్తులు వేసిన ఎన్డీయేకు చేదు అనుభ‌వ‌మే మిగిలింది.

మోడీ, అమిత్‌షా ఎత్తుల‌ను చిత్తు చేశాడు రాహుల్ గాంధీ. మ‌హిళా బిల్లు పాస‌య్యేందుకు త‌గిన సంఖ్యా బ‌లం లేకున్నా.. పార్ల‌మెంటులో స‌మావేశాలు నిర్వ‌హించి బిల్లుల ఆమోదానికి విజ‌య‌గ‌ర్వంతో బ‌రిలోకి దిగిన మోషా ద్వ‌యం.. మ‌రిప్పుడు త‌మిళ‌నాడులో విజ‌య్‌ను ఎందుకు సంఖ్యాబ‌లం లేద‌నే సాకును చూపి ఇబ్బంది పెట్టార‌నే వాద‌న తెర‌పైకి వ‌చ్చింది. వాస్త‌వానికి డీలిమిటేష‌న్ బిల్లు ప్ర‌తిపాద‌న క‌రెక్టుగా లేదు. ద‌క్షిణాది రాష్ట్రాలకు రాజ‌కీయంగా తీవ్ర న‌ష్టం చేకూరేలా.. ఉత్త‌రాది రాష్ట్రాలు సంఖ్యాప‌రంగా మ‌రింత బ‌ల‌ప‌డి… ఇక ప్ర‌భుత్వం ఏర్పాటు చేసేందుకు అక్క‌డి సంఖ్యాబ‌ల‌మే స‌రిపోతుందనే ప‌రిస్థితిని తెచ్చిపెట్టే ప్ర‌మాదం నుంచి కాపాడిన‌ట్ట‌య్యింది రాహుల్ గాంధీ.

Advertisement

దీన్ని తెలంగాణ‌తో పాటు త‌మిళ‌నాడు కూడా వ్య‌తిరేకించింది. ఏపీలో ప్ర‌భుత్వం ఎన్డీయే కూట‌మిలో భాగం కాబ‌ట్టి.. అది స‌మ‌ర్థించ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. అయితే .. బీజేపీ తెలివిగా.. బిల్లులు వీగిపోయిన త‌రువాత కూడా ఎక్క‌డా డీలిమిటేష‌న్ ముచ్చ‌ట తీయ‌లేదు. కేవ‌లం మ‌హిళాబిల్లును ఓడించారు.. మీకు మ‌హిళ‌లు గుణ‌పాఠం చెబుతారు.. వారిని రాజకీయంగా ఎద‌గ‌కుండా చేశార‌నే శాపనార్ధాలతోనే..ముందుకు పోయింది. ఇండి కూట‌మిపై దుమ్మెత్తిపోసింది. కానీ వాస్త‌వానికి ఇండి కూట‌మికి ప్ర‌శంస‌లే ద‌క్కాయి. బ‌ల‌వంతుడైన ఎన్డీయేను స‌మ‌ర్థ‌వంతంగా పార్ల‌మెంటులో ఎదుర్కొని ఓడించ‌డాన్ని రాహుల్ స‌త్తాగా భావించారంతా. అది రాహుల్ సాధించిన తొలి విజ‌యంగా చూశారు.

తాజాగా ఇప్పుడు త‌మిళ‌నాడు ఎన్నిక‌ల ఫ‌లితాలు. స‌మయానుకూలంగా విజ‌య్‌తో జ‌త‌క‌ట్ట‌డం రాహుల్‌గాంధీ తీసుకున్న నిర్ణ‌యం అనివార్యం. చారిత్ర‌క అవ‌స‌రం కూడా. అందుకే కొన్ని ఆక్షేప‌ణ‌లు, ఆరోప‌ణ‌లు ప‌ట్టించుకోలేదు రాహుల్‌. ఇక్క‌డ మూడు ప్రాంతీయ పార్టీలు బ‌లంగా ఉన్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌కు ఇక్క‌డంత సీన్ లేదు. విజ‌య్‌తో క‌లిసి వెళ్ల‌డం ద్వారా కాంగ్రెస్‌ను త‌మిళ‌నాడులో మ‌రింత బ‌లోపేతం చేసుకోవ‌చ్చ‌నే రాహుల్ వ్యూహం ఫ‌లించింది.

Advertisement

చివ‌ర వ‌ర‌కు తొండి ఆట ఆడి.. గెల‌వాల‌నుకున్న మోడీ, షా ద్వ‌యంపై రాహుల్ వ్యూహ‌మే గెలిచింది. పైగా ఎన్డీయే త‌మిళ‌నాట ఆడిన చీప్ పొలిటిక‌ల్ డ్రామా గేమ్‌తో అభాసుపాలైంది కూడా. స‌రైన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకున్న రాహుల్ కు ఇది రెండో విజ‌యంగా చెప్పాలి. కేర‌ళ‌లో కాంగ్రెస్ పార్టీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌డం కూడా రాహుల్‌కు క‌లిసి వ‌చ్చింది. అదొక శుభ‌ప‌రిణామంగా చెప్ప‌వ‌చ్చు. ఇక‌పై ఇండి కూటమికి అన్నిమంచి రోజులే రావొచ్చునా ? అనేలా రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల‌న్నీ క‌లిసి వ‌స్తున్నాయి రాహుల్ గాంధీకి.

Related News

ఒక‌రెనుక ఒక‌రు లైనుగ‌ట్టి.. ప‌ద‌హారు మంది లైన్లు గ‌ట్టి.. తెలంగాణ భ‌వ‌న్ కిట‌కిట‌..!

అధ్య‌క్షుల వారి కుంభ‌స్థ‌లాన్ని కొట్టిన కిశోర్‌.. నితిన్ ఇలాఖాలో ప్ర‌శాంత్ జంత‌ర్‌మంత‌ర్‌..!

అధ్య‌య‌నం.. పోరాటం.. జ‌నం నాడి తెలుసుకునేందుకు దేశ‌వ్యాప్త టూర్‌కు బొద్దింక‌ల ప్లాన్‌.. !

కాగ‌ల కార్యం సుప్రీం తీర్చ‌నుందా?.. ఇక జంత‌ర్ మంత‌ర్ ను ఎత్తేయ‌డ‌మే త‌రువాయా!?

ఇంజినీరింగ్ విద్యార్థుల చ‌దువు క్రిమిన‌ల్ వేస్ట్‌.. గోడ‌ల‌కు సున్నాలేసుకుని బ‌తికిన‌ రేవంతు..!

సీఎం ఎవ‌రిని ఎండ్రిన్ తాగ‌మ‌న్నాడు? కేటీఆర్‌నా..? నిరుద్యోగుల‌నా?? ఏది రైటు.. ఎవ‌రు కరెక్టు..??

క్షుద్ర‌పూజ‌లతో ప్ర‌భుత్వాలు ప‌డ‌గొట్టొచ్చా? క్షుద్ర రాజ‌కీయాల‌తో జ‌నానికి ఏం సందేశం ఇస్తున్నారు?

ఇత‌డు ఫామ్‌హౌజ్‌లోనే ఎందుకు? అత‌డు ఫామ్‌లో ఉన్నాడెందుకు!?

Big Stories

Advertisement
×