// // Nvidia RTX Spark Laptops: పవర్‌ఫుల్ ఏఐ ప్రొసెసర్‌తో Nvidia ల్యాప్‌టాప్స్! -->
E-Paper
Advertisement

త్వరలో మార్కెట్‌లోకి Nvidia ల్యాప్‌టాప్స్.. మైక్రోసాఫ్ట్, ఆసస్ డివైజ్‌ల ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!

త్వరలో మార్కెట్‌లోకి Nvidia ల్యాప్‌టాప్స్.. మైక్రోసాఫ్ట్, ఆసస్ డివైజ్‌ల ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!
Advertisement

Nvidia RTX Spark Laptops: గ్రాఫిక్స్ కార్డ్స్ అనగానే మనకు గుర్తొచ్చే ప్రముఖ కంపెనీ Nvidia ఇప్పుడు నేరుగా ల్యాప్‌టాప్ ప్రొసెసర్ల మార్కెట్లోకి అడుగుపెట్టింది. కంప్యూటెక్ 2026 వేదికగా Arm ఆధారిత RTX Spark చిప్‌సెట్‌ను కంపెనీ అధికారికంగా ప్రకటించింది. కేవలం గ్రాఫిక్స్ రంగానికే పరిమితం కాకుండా.. ల్యాప్‌టాప్ ప్రపంచంలో సరికొత్త విప్లవం సృష్టించేందుకు ఎన్విడియా సిద్ధమైంది. మైక్రోసాఫ్ట్, ఆసస్, డెల్, హెచ్‌పీ, లెనోవో, ఎమ్‌ఎస్‌ఐ వంటి దిగ్గజ బ్రాండ్లు ఈ కొత్త చిప్‌సెట్‌తో ల్యాప్‌టాప్‌లను తయారు చేస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో ఇవి మార్కెట్లోకి రానున్నాయి.

కొత్త చిప్‌సెట్ ప్రత్యేకతలివే:

ఈ RTX Spark చిప్‌సెట్‌ను AI అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. దీనిలో గరిష్టంగా 20 సీపీయూ కోర్స్, 6,144 జీపీయూ కోర్స్‌తో పాటు 128GB వరకు RAM సపోర్ట్ ఉంటుంది. ఎక్కువ స్టోరేజీ కావాలనుకునే ప్రొఫెషనల్స్ కోసం డిజైన్ చేసిన ఈ ల్యాప్‌టాప్‌లు కేవలం 14 మిల్లీమీటర్ల మందంతో చాలా స్లిమ్‌గా ఉంటాయి. వీటిలో ఛార్జింగ్ కూడా రోజంతా వస్తుందని కంపెనీ చెబుతోంది.

మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ ల్యాప్‌టాప్ అల్ట్రా:

Advertisement

మైక్రోసాఫ్ట్ సంస్థ ఈ కొత్త చిప్‌సెట్‌తో ‘సర్ఫేస్ ల్యాప్‌టాప్ అల్ట్రా’ మోడల్‌ను పరిచయం చేస్తోంది. సర్ఫేస్ సిరీస్‌లోనే ఇది అత్యంత శక్తివంతమైన ల్యాప్‌టాప్ అని కంపెనీ చెబుతోంది. ఇది 15 అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తోంది. దీనిలో కనెక్టివిటీ కోసం హెచ్‌డీఎమ్‌ఐ, యూఎస్‌బీ-సి, యూఎస్‌బీ-ఎ పోర్టులతో పాటు పెద్ద హాప్టిక్ టచ్‌ప్యాడ్‌ను అందించారు. ఆఫీస్ పనులు, కోడింగ్ చేసుకునే వారికి ఈ ల్యాప్‌టాప్స్ బాగా సెట్ అవుతాయి.

Also Read: యాపిల్ నుంచి తొలి మడత ఫోన్.. ఐప్యాడ్ లాంటి లుక్, రూ.2 లక్షల ధరతో iPhone Ultra!

క్రియేటర్ల కోసం ఆసస్ క్రేజీ మోడల్స్:

Advertisement

క్రియేటివ్ రంగానికి చెందిన వారి కోసం ఆసస్ సంస్థ ప్రోఆర్ట్ పి16, ప్రోఆర్ట్ పి14 అనే రెండు మోడళ్లను తీసుకొస్తోంది. ఇందులో పి16 మోడల్ 16 అంగుళాల 4కే ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో, పి14 మోడల్ 14 అంగుళాల 3కే ఓఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తున్నాయి. ఫొటో, వీడియో ఎడిటింగ్ చేసేవారికి కలర్స్ కచ్చితత్వంతో కనిపించేలా వీటి డిస్‌ప్లేలను రూపొందించారు. వీటిలో పాత డైల్‌ప్యాడ్‌కు బదులుగా కొత్త హాప్టిక్ టచ్‌ప్యాడ్ ఫీచర్లను చేర్చారు.

మార్కెట్లో గట్టిపోటీ తప్పదు:

ఎమ్‌ఎస్‌ఐ సంస్థ ‘ప్రెస్టీజ్ ఎన్16 ఫ్లిప్ ఏఐ ప్లస్’ పేరుతో 2-ఇన్-1 ల్యాప్‌టాప్‌ను తెస్తోంది. దీని స్క్రీన్‌ను వెనక్కి తిప్పుకుని టాబ్లెట్‌లా వాడుకోవచ్చు. అలాగే డెల్ ఎక్స్‌పీఎస్ 16, హెచ్‌పీ ఓమ్నీబుక్, లెనోవో యోగా ప్రో సిరీస్‌లలో కూడా ఈ ఎన్విడియా చిప్‌సెట్ ల్యాప్‌టాప్‌లు రానున్నాయి. మొత్తం మీద ఈ ఏడాది దాదాపు 30కి పైగా ఎన్విడియా స్పార్క్ ల్యాప్‌టాప్‌లు విడుదల కానున్నాయి. ఇవి మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఇంటెల్, ఏఎమ్‌డీ, క్వాల్‌కామ్ కంపెనీలకు పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: స్టూడెంట్స్ కోసం స్పెషల్ డిస్కౌంట్.. 17 గంటల బ్యాటరీ లైఫ్‌తో Dell XPS 13 వచ్చేసింది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×