// // మొబైల్ డేటా సగం రోజుకే అయిపోతోందా? అయితే ట్రిక్స్ మీ కోసమే! -->
E-Paper
Advertisement

మొబైల్ డేటా సగం రోజుకే అయిపోతోందా? అయితే ఈ 4 ట్రిక్స్ మీ కోసమే!

మొబైల్ డేటా సగం రోజుకే అయిపోతోందా? అయితే ఈ 4 ట్రిక్స్ మీ కోసమే!
Advertisement

Mobile Data Saving Tips: ఈ రోజుల్లో కొందరికి స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే సమయమే తెలియదు. కానీ రీఛార్జ్ చేసుకున్న డైలీ డేటా మాత్రం సగం రోజుకే అయిపోతుంటుంది. అయితే డేటాను పెద్దగా వాడకపోయినా.. త్వరగా అయిపోయిందన్న ఫీలింగ్ చాలామందికి కలిగే ఉంటుంది. అయితే మీ ప్రమేయం లేకుండానే బ్యాక్‌గ్రౌండ్‌లో డేటా ఖర్చవ్వడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. దీనికి 4 సెట్టింగ్స్ మార్చడం ద్వారా చెక్ పెట్టొచ్చని సూచిస్తున్నారు. తద్వారా రోజంతా డేటాను పొందొచ్చని తెలియజేస్తున్నారు. ఇంతకీ ఆ 4 సెట్టింగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

‘డేటా సేవర్’ మోడ్

ప్రతి ఆండ్రాయిడ్, ఐఫోన్‌లలో ‘డేటా సేవర్’ (Data Saver) లేదా ‘లో డేటా మోడ్’ (Low Data Mode) ఆప్షన్ ఉంటుంది. దీన్ని ఆన్ చేయడం ద్వారా బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్స్ అనవసరంగా డేటాను వాడుకోకుండా అడ్డుకోవచ్చు. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్ > నెట్‌వర్క్ & ఇంటర్నెట్ > డేటా సేవర్ ఆప్షన్‌ను ‘ఆన్’ చేయండి.

ఆటో అప్‌డేట్స్‌కు చెక్

Advertisement

గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్‌లో యాప్స్ ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అవుతుంటాయి. కొన్ని యాప్స్ వందల ఎంబీల్లో అప్‌డేట్ అవుతూ మీ డేటాను స్వాహా చేస్తుంటాయి. దీనికి చెక్ పెట్టేందుకు ప్లే స్టోర్ ఓపెన్ చేసి.. సెట్టింగ్స్ > నెట్‌వర్క్ ప్రిఫరెన్సెస్ > ‘ఆటో అప్‌డేట్ యాప్స్’ లోకి వెళ్లాలి. అక్కడ ‘ఓవర్ వైఫై ఓన్లీ’ లేదా ‘డోంట్ ఆటో అప్డేట్స్ యాప్స్’ సెలెక్ట్ చేసుకోండి.

ఆటో ప్లే ఆఫ్ చేయండి

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మనం క్లిక్ చేయకపోయినా వీడియోలు ప్లే అయిపోతుంటాయి. దీనివల్ల డేటా విపరీతంగా ఖర్చవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనికి చెక్ పెట్టేందుకు ఆయా యాప్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ‘మీడియా అండ్ క్వాలిటీ’ లేదా ‘డేటా యూసేజ్’ ఆప్షన్‌లో ‘Never Auto-play Videos’ సెలెక్ట్ చేసుకోండి. అలాగే వీడియో క్వాలిటీని ‘డేటా సేవర్’ మోడ్‌లో పెట్టడం ద్వారా ఇంటర్నెట్ ను ఆదా చేయవచ్చు.

Advertisement

Also Read: హైదరాబాద్ మెట్రోలో బరితెగించిన యువకుడు.. సీటుపై కాళ్లు పెట్టి రచ్చ రచ్చ!

బ్యాక్‌గ్రౌండ్ డేటా కంట్రోల్

మనం వాడకపోయినా కొన్ని యాప్స్ ఇంటర్నెట్ వాడుకుంటూనే ఉంటాయి. కాబట్టి అవసరం లేని యాప్స్ బ్యాక్‌గ్రౌండ్ డేటాను ఆపేయడం మంచిది. ఇందుకోసం ఫోన్ సెట్టింగ్స్ > యాప్స్ లోకి వెళ్లి.. ఎక్కువ డేటా తినే యాప్‌ను సెలెక్ట్ చేయండి. అక్కడ ‘మొబైల్ డేటా’ లోని ‘ఎలో బ్యాక్ గ్రౌండ్ డేటా యూసేజ్’ ను ఆఫ్ చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది.

Also Read: క్రోమా నమ్మశక్యం కాని ఆఫర్.. సగం ధరకే సరికొత్త ‘ఐఫోన్ 17’.. చార్జర్ కూడా ఫ్రీ!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×