E-Paper
Advertisement

Nokia 16 Year Delivery: 1,2 రోజులు కాదు 16 ఏళ్లు ఆలస్యంగా డెలివరీ అయిన ఫోన్లు.. షాకైన కస్టమర్

Nokia 16 Year Delivery: 1,2 రోజులు కాదు 16 ఏళ్లు ఆలస్యంగా డెలివరీ అయిన ఫోన్లు.. షాకైన కస్టమర్
Advertisement

Nokia 16 Year Delivery| ప్రపంచంలో ఎన్నో విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. వాటి గురించి వింటే ఆశ్చర్యమనిపిస్తుంది. అలాంటి ఒక ఘటన లిబియా దేశంలో జరిగింది. 16 ఏళ్ల క్రితం ఫోన్లు ఆర్డర్ చేస్తే ఇటీవల ఆ ఫోన్లు డెలివరీ అయ్యాయి. అది చూసి ఆ కస్టమర్ షాక్ అయిపోయాడు. ఇప్పుడు ఆ ఫోన్లతో ఏం చేయాలో అతనికి అర్థం కావడం లేదు. ఆ ఫోన్లు తన వరకు చేరినందుకు ఆనంద పడినా.. ఆ ఫోన్ల టెక్నాలజీ ఇప్పుడు ఔట్ డేటెడ్ అంటే పాతదై పోయింది. అందుకే వాటిని ఎలా వినియోగించాలో ఆశ్చర్యపోతూ ఒక వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూసిన వారంతా ఇప్పుడు ఆశ్చర్యపోతూ ఇతరులకు కూడా షేర్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియో బాగా వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. అరబ్ దేశమైన లిబియా రాజధాని త్రిపోలీ నగంలో ఒక మొబైల్ షాప్ యజమాని 2010లో ఆర్డర్ చేసిన నోకియా ఫోన్లు 16 సంవత్సరాల తర్వాత.. ఇటీవల 2026లో అతని వద్దకు చేరుకున్నాయి. లిబియాలో 2010-11లో ఆ దేశా అధ్యక్షుడు గదాఫీని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు రాజకీయంగా దెబ్బతీసి, ఆయన మరణానికి కారణమయ్యాయి.

అంతర్యుద్దం కారణంగా నిలిచిపోయిన రవాణా

Advertisement

అప్పుడు లిబియాలో అంతర్యుద్ధం ప్రారంభమైంది. దేశంలో పరిపాలన వ్యవస్థ నాశనమైపోయింది. దీంతో వాణిజ్యం, రవాణా వ్యవస్థలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. పరిస్థితి ఇంతవరకు దిగజారక కొన్ని రోజులు ముందే రాజధాని త్రిపోలిలో ఒక మొబైల్ షాపు నడుపుకునే ఒక వ్యక్తి బిజినెస్ కోసం ఆ సమయంలో మంచి డిమాండ్ లో ఉన్న నోకియా ఫోన్లు (బటన్ ప్రెస్ ఫోన్లు) కోసం పెద్ద ఆర్డర్ చేశాడు. ఆ ఫోన్లు కేవలం కొన్ని కిలోమీటర్లు దూరంలో ఉన్న గోడౌన్ల నుంచి రావాల్సి ఉండగా.. అంతర్యుద్ధం కారణంగా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ప్రజలు ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు పారిపోయారు. ఈ కారణంగా ఆ మొబైల షాపు యజమాని కూడా తన షాపు వదిలి కొన్ని రోజులు వెళ్లిపోయాడు.

16 ఏళ్ల తరువాత డెలివరీ

కాలక్రమేణా పరిస్థితులు చక్కబడిన తరువాత మళ్లీ ఆ షాపు యజమాని తిరిగి వచ్చి తన వ్యాపారం ప్రారంభించాడు. అయితే తను ఆర్డర్ చేసిన నోకియా ఫోన్లు గురించి మరిచిపోయాడు. తాజాగా కొన్ని రోజుల క్రితమే తనకు ఆ నోకియా ఫోన్లు డెలివరీ అయ్యాయి. ముందు ఆ షాపు యజమాని వాటిని చూసి గుర్తుపట్టలేకపోయాడు. తాను అలాంటి ఆర్డర్ చేయలేదని అనుకున్నాడు. కానీ డెలివరీ డాక్యూమెంట్స్ పై తన పేరు, ఆర్డర్ వివరాలు, బిల్లు తేదీ చూసి అవాక్కైపోయాడు. 16 ఏళ్ల క్రితం తాను ఆర్డర్ చేసిన ఫోన్లు ఇప్పుడు వచ్చాయని చూసి నవ్వు ఆపుకోలేకపోయాడు. ఆ ఫోన్లతో తాను ఇప్పుడు ఏం చేయాలో తోచక సోషల్ మీడియాలో వీడియో తీసి పోస్ట్ చేశాడు.

Advertisement

Also Read: స్మార్ట్‌బ్యాండ్, స్మార్ట్‌రింగ్ తరహాలో ఏఐ టెక్నాలజీ స్మార్ట్ ఆభరణాలు.. వీటిని ధరిస్తే ఏమవుతుందంటే

సోషల్ మీడియాలో విచిత్ర కామెంట్స్

ఆ వీడియో చూసి చాలా నెటిజెన్లు విచిత్రంగా, హాస్యాస్పదంగా స్పందించారు. ఒక యూజర్ తన పోస్ట్ లో.. “ప్రస్తుతం దేశాల మధ్య ఆందోళనకర పరిస్థితులు ఉండడంతో.. ఇలాంటి ట్రాకర్ లేని ఫోన్లు బాగా ఉపయోగపడతాయి. వీటికి మంచి డిమాండ్ ఉంది.” అని రాశాడు.

ఇంకొక నెటిజెన్ ఇలా కామెంట్ చేశాడు. “ఇది టెక్నాలజీ స్వర్ణయుగానికి చెందిన ఫోన్లు. ఇవి చాలా విలువైని. ” అని హాస్యాస్పదంగా స్పందించాడు. మరో యూజార్ అయితే.. “అతనికి ఆ సమయంలోనే ఈ ఫోన్లు అంది ఉంటే.. కచ్చితంగా రెట్టింపు లాభానికి విక్రయించేవాడు” అని రాశాడు.

మరో నాలుగో యూజర్ అయితే.. “ఈ వీడియో చాలా ఫన్నీగా ఉంది. నేను చాలా సీరియస్‌గా వీడియో చూశాను. కానీ అతను ఆ పాత ఫోన్లు చూపిస్తూ ఉంటే నవ్వు ఆపుకోలేక పోయాను. అతని ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ అలా ఉన్నాయి మరీ.” అని కామెంట్ చేశాడు.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×